మనోహర్ తన ప్లాన్ ప్రకారం రామాని ఇరికించేందుకు జ్ఞానంబ ఇంటికి వస్తాడు. నీ దగ్గర మాదక ద్రవ్యాలు కొనే కస్టమర్ ఇతను అని మనోహర్ చెప్పేసరికి అందరూ షాక్ అవుతారు. డిస్కషన్ అనవసరం ఇంట్లో సెర్చ్ చేయమని జానకి అంటుంది. అదేంటి వాడేదో వాగాడని మన ఇల్లు వెతకడం ఏంటని గోవిందరాజులు అంటే కంప్లైంట్ వచ్చాక తప్పదని జానకి అంటుంది. పండగ పూట ఇంట్లో పోలీసులు అడుగు పెట్టడానికి వీల్లేదని జ్ఞానంబ ఖరాఖండీగా చెప్తుంది. డ్యూటీకి అడ్డు పడకూడదని జానకి అంటుంది. అంతగా అనిపిస్తే నువ్వు వెళ్ళి వెతుక్కో గోవిందరాజులు చెప్తాడు. కానీ జానకి మాత్రం తాను చేయకూడదని తను నిందితుడి భార్యనని చెప్తుంది. దీంతో పోలీసులు వెళ్ళి ఇల్లంతా చూస్తారు. మనోహర్ మిఠాయి బండి చెక్ చేయడానికి వెళతాడు. ఎవరూ చూడకుండా మనోహర్ మిఠాయి బండిలో మాదక ద్రవ్యాలు ప్యాకెట్ పెట్టి పక్కకి తప్పుకుంటాడు.


Also Read: తులసి ఇంట్లో సంబరంగా మొదలైన పెళ్లి పనులు- దివ్యకి ఫోన్ చేసిన ప్రియ


కానిస్టేబుల్ సుగుణని చూడామని చెప్పి పక్కకి తప్పుకుంటాడు. ఇంట్లో కానిస్టేబుల్స్ ఇల్లంతా వెతుకుతారు. జానకి రామాని క్షమించమని అడుగుతుంది. ఇల్లంతా వెతికాము ఏమి దొరకలేదని కానిస్టేబుల్స్ చెప్పేసరికి అందరూ ఊపిరి పీల్చుకుంటారు. సుగుణ వచ్చి బండిలో కూడా ఏమి దొరకలేదని చెప్పేసరికి అంతా వెతికావా అని మనోహర్ కావాలని బండి సరిగా చూడమని చెప్తాడు. మనోహర్ ప్యాకెట్స్ పెట్టిన చోట కానిస్టేబుల్ వాటిని చూసి ప్యాకెట్స్ దొరికాయని పిలుస్తుంది. వాటిని చూసి అందరూ షాక్ అవుతారు. నీ మిఠాయి బండిలోనే ఇవి దొరికాయని అంటాడు. అవి అక్కడికి ఎలా వచ్చాయో తనకి నిజంగా తెలియదని రామా చెప్తున్నా కూడా మనోహర్ వినిపించుకోడు. రామా అలాంటి వాడు కాదని దీని వెనుక ఏదో కుట్ర ఉందని జ్ఞానంబ వాళ్ళు అంటారు. ఇదంతా అక్కడ ఉన్న వాళ్ళు వీడియో తీస్తూ ఉంటారు. 


Also Read: స్వప్నకి ఘోరమైన అవమానం, మళ్ళీ రోడ్డున పడ్డ బతుకు- రాజ్ తిక్క కుదురుస్తున్న అప్పు


జానకి ఇదంతా నిజమని మీరు నమ్ముతున్నారా? అని రామా భార్యని అడుగుతాడు. కానీ జానకి ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండేసరికి ఏదో ఒకటి మాట్లాడమని జ్ఞానంబ వాళ్ళు అంటారు. రామా ఏ తప్పు చేయలేదని ఎస్సైకి చెప్పమని అడుగుతారు. సిన్సియర్ పోలీస్ వి కదా భర్త చేతికి సంకెళ్ళు వేసి జీపు ఎక్కించమని మనోహర్ చెప్తాడు. దీంతో జానకి చేసేదేమి లేక రామాని అరెస్ట్ చేస్తుంది. చట్టం ముందు రుజువు అయ్యే వరకు ఎవరు దోషి కాదని జానకి అంటే రామాకి బేడీలు వేయమని మనోహర్ రెచ్చగొడతాడు. నా రామాకి బేడీలు వేయొద్దని జ్ఞానంబ జానకి కాళ్ళ మీద పడబోతుంది. ఆయనకి ఏమి కాదని చెప్పి బేడీలు వేసి తీసుకెళ్తుంది. జ్ఞానంబ కుప్పుకూలిపోతుంది. చుట్టుపక్కల జనాలు అందరూ జ్ఞానంబ వాళ్ళని చూస్తూనే ఉంటారు. స్టేషన్ కి తీసుకొచ్చిన తర్వాత రామాని అవమానించేలా మనోహర్ మాట్లాడతాడు.