జానకి జెస్సితో ఉండ్రాళ్ళ తద్ది పూజ చేయిస్తుంది. జానకి పాట పాడుతుంటే పక్కనే ఉన్న మల్లిక తనతో కలిసి పాడమని చెప్తుంది. దీంతో జెస్సి గట్టిగా పాత పాడేసరికి అందరూ బిత్తరపోతారు. అది విని నీలావతి పుల్లలు వేస్తూనే ఉంటుంది. మన సంప్రదాయాలు అన్నీ దృష్టిలో పెట్టుకుని ఆ అమ్మాయిని పూజలో కూర్చోబెట్టకుండా ఉండాల్సింది అని అమ్మలక్కలు అంటారు. పూజ పూర్తైంది వాయనం ఇవ్వమని పూజారి చెప్తాడు. వాయనం ఇవ్వాల్సిన జాకెట్ ముక్కల మీద మల్లిక నీలావతి తెచ్చిన లక్క రాస్తుంది. పంతులు హారతి ఇచ్చి ఆ జాకెట్ ముక్కలు పక్కన హారతి పళ్ళెం పెడతాడు. పూజ పూర్తయిందని ముత్తైదువులకి వాయనంతో పాటు ఉండ్రాళ్ళు కూడా ఇస్తే పూజ ఫలితం దక్కుతుందని పూజారి చెప్తాడు.


వాయనం ఇవ్వాల్సినని మంటలు అంటుకుని తగలబడి పోవడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి ఈ అపచారం అని జ్ఞానంబ మనసులో అనుకోగానే అమ్మలక్కలు అదే మాట బయటకి అంటారు. మొత్తానికి మనం అనుకున్నది అయ్యింది అని నీలావతి మనసులో అనుకుంటుంది. జానకి ఆ మంటలు ఆర్పేందుకు ట్రై చేస్తుంది. కొత్త కోడలిని కూర్చోబెట్టి వ్రతం చేస్తుంటే ఇలా జరిగింది ఏంటని నీలావతి అంటుంది. ఇలా వాయనం ఇచ్చే జాకెట్ ముక్కలకి మంటలు అంటుకున్నాయంటే పెద్ద అపశ్రుతే జరిగిందని నలుగురు నానా మాటలు అంటారు. అమ్మ వారికి ఆగ్రహం కలిగి అగ్ని ద్వారా చూపించిందని ముత్తైదువులు అంటారు. అంటే ఏంటి వాయనం తీసుకుంటే మన పసుపు కుంకుమలు కూడా అమ్మవారి కోపానికి బలై పోతాయనా మీ ఉద్దేశం అని నీలావతి అక్కడి ఆడవాళ్ళని రెచ్చగొడుతుంది.


Also Read: కార్తీకదీపం నాటకంతో సీరియల్ మరో మలుపు, కార్తీక్ భార్య మోనిత కాదని ఫిక్సైపోయిన శివ!


పూజకి వచ్చిన ముత్తైదువులు వాయనం తీసుకోకుండానే అక్కడ నుంచి వెళ్లిపోతామంటే జానకి వారిని ఒప్పించేందుకు చూస్తుంది. కానీ వాళ్ళు మాత్రం వినకుండా వెళ్లిపోతారు. నాకే ఎందుకు ఇలా జరుగుతుందని జ్ఞానంబ చాలా బాధపడుతుంది. ఐదుగురితో సమానం అయిన మీరు వాయనం తీసుకుంటే అమ్మవారి ఆశీర్వాదం ఇచ్చినట్టే మమ్మల్ని అక్షింతలు వేసి ఆశీర్వదించండి అని జానకి అడుగుతుంది. అందుకు జ్ఞానంబ సరే అని ఒప్పుకుని వాయనాలు తీసుకుంటుంది. జానకి, మల్లికతో పాటు జెస్సిని కూడా జ్ఞానంబ ఆశీర్వదిస్తుంది. జానకి కాలేజీ ప్రిన్సిపాల్ రామాతో మాట్లాడుతుంది.


క్లాసులకి జానకి సరిగా రావడం లేదు, ఒక పరీక్ష కూడా రాయలేదు. త్వరలో మెయిన్స్ ఉంటే జానకి నిర్లక్ష్యంగా ఉంటుంది. తనకి ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పక్కన పెట్టి ఐపీఎస్ మీద దృష్టి పెట్టమని చెప్పండి. పరీక్ష పూర్తయిన తర్వాత ట్రైనింగ్ ఉంటుంది. అందుకోసం శారీరకంగా దృఢంగా ఉండాలి. అందుకు వ్యాయామం కూడా చెయ్యాలి. అందుకు తను సిద్ధంగా ఉండమని చెప్పండి. తన బాధ్యత నీది కూడా చెప్పడం మాత్రమే కాదు తనకి తోడుగా ఉంది అన్నీ చూసుకోండి’ అని రామాతో చెప్తుంది. జ్ఞానంబ పూజలో జరిగినది గుర్తు చేసుకుని తన బాధని భర్త గోవిందరాజులుతో పంచుకుంటుంది. అది జానకి గమనిస్తూ ఉంటుంది.


Also Read: ఊహించని ట్విస్ట్, సూసైడ్ చేసుకోబోయిన మాళవిక- వసంత్, చిత్రని కలిపిన యష్, అవధుల్లేని ఆనందంలో తేలిపోతున్న వేద