జానకి ఉండ్రాళ్ళ తద్ది గురించి జెస్సికి చెప్తుంది. ఈ వ్రతం నేను కూడా చెయ్యొచ్చా ఆంటీ ఒప్పుకుంటారా అని అడుగుతుంది. ఈ మాటలు జ్ఞానంబ వింటుంది. ఇప్పుడు నువ్వు పుట్టింటికి కూతురు కాదు అత్తింటికి కోడలు.. ఇక్కడ సాంప్రదాయాలు కచ్చితంగా అలవాటు చేసుకోవాలి. ముందు ఆంటీ పిలవడం మానుకో అత్తయ్యగారు అని పిలవడం అలవాటు చేసుకో. అత్తయ్యగారు అనే పిలుపులో గౌరవం పెరుగుతుంది. ఇదే కాదు రేపు ఇంటికి వచ్చే ముత్తైదువుల దృష్టి అంతా నీ ప్రవర్తన మీదే ఉంటుంది. ఇది అత్తయ్యగారి గౌరవ మర్యాదలు, ఇంటి పరువుకి సంబంధించిన విషయం. నువ్వు వాళ్ళతో మాట్లాడే విధానం మీద పూజలో పాల్గొనే పద్ధతి మీద ఆధారపడి ఉంటుంది. వాటిని కాపాడాల్సిన బాధ్యత నీదే. అదంతా నీ మీదే ఆధారపడి ఉంటుంది’ అని జానకి చెప్తుంది.


Also Read: సామ్రాట్ జీవితంలో పెను విషాదం- తులసిని దూరం పెట్టమని సామ్రాట్ కి తెగేసి చెప్పిన అనసూయ


నాకు ఇంత సపోర్ట్ చేసినందుకు చాలా థాంక్స్ అని జెస్సి చెప్తుంది. జానకి వ్రతం కోసం ఉండ్రాళ్ళు తయారు చేస్తుంటే జెస్సి వచ్చి నేను చేస్తాను అని అడుగుతుంది. సరే అని పిండి కలపమని చెప్పి జానకి పక్కకి వెళ్లిపోగానే మల్లిక వచ్చి జెస్సితో మాట్లాడుతుంది. అటు కోడలిగా అడుగుపెట్టిన రోజు నుంచే పనులు నేర్చుకుంటున్నావ్ గ్రేట్ అని పొగుడుతూ ఉండ్రాళ్ళు చెడగొట్టాలని రవ్వకి బదులుగా సాల్ట్ మారుస్తుంది. అప్పుడే అటు జ్ఞానంబ రావడం చూసి మల్లిక జారుకుంటుంది. ఉండ్రాళ్ళలో జెస్సి ఉప్పు వేయబోతుంటే జ్ఞానంబ జానకి అని గట్టిగా అరుస్తుంది. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఉప్పుకి పిండికి తేడా తెలియకుండా పోతుంది నేను చూశాను కాబట్టి సరిపోయింది లేదంటే అమ్మవారికి పెట్టె నైవేద్యము అపచారం జరిగేది అని అరుస్తుంది. నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి అని జ్ఞానంబని పంపించేస్తుంది జానకి.


అందరూ పూజ ఏర్పాట్లలో ఉంటే మల్లిక మాత్రం తింటూ కూర్చుంటుంది. అఖిల్ కూడా పూజ ఏర్పాట్లలో సాయం చెయ్యమని రామా చెప్పడంతో గోవిందరాజులు సంతోషిస్తాడు. జానకి జెస్సిని చక్కగా రెడీ చేసి తీసుకుని వస్తుంది. అప్పుడే ముత్తైదువులు వస్తారు. వచ్చి రాగానే ఎవరు ఈ అమ్మాయి పద్ధతికి చీర కట్టినట్టు లక్ష్మీ దేవిలాగా ఉందని అంటారు. ఎప్పుడు చూడలేదు సంప్రదాయానికి మనిషి రూపంలో నిలువెత్తులాగా ఉందని అడుగుతుంటే మల్లిక వచ్చి పుల్ల పెడుతుంది. మా అఖిల్ భార్య అని జానకి చెప్తుంది. ఒక్క మాట కూడా చెప్పకుండా పప్పన్నం పెట్టకుండా మూడో కొడుకు పెళ్లి చేశారు ఏంటి అని అమ్మలక్కలు అడుగుతారు. నీ పేరెంటి అని అడిగితే జెస్సి అని చెప్తుంది. వాళ్ళని జానకి పక్కకి తీసుకుని వెళ్ళిపోతుంది.


Also Read: దేవిని ఆదిత్యతో మాట్లాడమని ఒట్టు వేయించుకున్న చిన్మయి- షాక్లో మాధవ్, ఇల్లు విడిచి వెళ్ళనన్న రాధ


మల్లిక నీలావతి కోసం ఎదురుచూస్తుంది. వ్రతం చెడగొట్టేందుకు లక్క తీసుకుని వస్తుంది నీలావతి. ఈ లక్కని ముత్తైదువులకి ఇచ్చే జాకెట్ ముక్కలకి పూస్తే అది హారతి దగ్గర పెడితే వెంటనే తగలబడిపోతుంది. అప్పుడు కొత్త కోడలు చేయడం వల్ల అశుభం జరిగి పూజ ఆగిపోతుందని నీలావతి చెప్తుంది. జానకి దగ్గర ఉండి పూజ గురించి చెప్తూ ఉంటే పంతులు గారు ఏం చెయ్యాలి అని జెస్సి అడుగుతుంది అలా అడగకూడదు పంతులు గారు చెప్తారు అని జానకి అంటుంది. మన సాంప్రదాయాలు తెలియదు కదా అందుకే ఉత్సాహపడుతుంది అమ్మాయి అని నీలావతి అంటుంది. కళ్ళు మూసుకుని దేవుడ్ని సంకల్పం చెయ్యమని పంతులు గారు చెప్తారు. తర్వాత పంతులు గారు చెప్తున్న మాటలు జెస్సి బయటకి చెప్పడంతో అందరూ బిత్తరపోతారు. మనసులో చెప్పుకోవాలి బయటకి కాదని జానకి చెప్తుంది. మధ్యలో నీలావతి పుల్ల వేస్తూనే ఉంటుంది. జెస్సి అలా చేయడంతో నలుగురు నానా మాటలు అంటారు.