రెండు బాటిల్స్ పాయిజన్ తెచ్చి ఇవ్వు అక్క ఒకటి ఆ వసంత్ కి తాగించి రెండోది నేను తాగేస్తాను అని చిత్ర వేదతో అంటుంది. అవునే కొంపదీసి మనది ఉత్తిత్తి నిశ్చితార్థం అని తెలిసిపోయిందా ఏంటి అని సులోచన అంటుంది. అప్పుడే మాలిని సులోచన అని పిలుస్తూ ఇంట్లోకి వచ్చేసరికి అందరూ కంగారుగా లేచి నిలబడతారు. మనం మాట్లాడుకోవడం వినేసిందా ఏంటి అని సులోచన ఇంట్లో వాళ్ళతో గుసగుసలాడుతూ ఉంటే వినకుండా ఎలా ఉంటాను ఉత్తిత్తి నిశ్చితార్థం అంటే ఏంటి అని మాలిని అంటుంది. ఎంగేజ్మెంట్ ఆగిపోయేలా ఉందని యష్ నాటకం స్టార్ట్ చేస్తాడు. నేను జరగదు అనేది వసంత్ ఎంగేజ్మెంట్ కాదు చిత్ర వాళ్ళ ఎంగేజ్మెంట్ అని యష్ అంటాడు. ఫంక్షన్ హాల్ ఇంతవరకు బుక్ చెయ్యలేదు ఏంటి అని యష్ వేదని అడిగేసరికి అందరు నీళ్ళు నములుతూ తడబడతారు.
Also Read: వసు కోసం మల్లెపూలు కొన్న రిషి - నాకోసం వచ్చేస్తావా వసుధార అని అడిగేసిన మిస్టర్ ఇగో
5 గంటలకి మీ చెల్లి చిత్ర ఎంగేజ్మెంట్ జరిపించి తర్వాత 7 గంటలకి మా తమ్ముడు వసంత్ నిశ్చితార్థం నిధితో నీ చేతుల మీదుగానే జరిపించు అని యష్ వేదతో అంటాడు. ఉత్తిత్తి నిశ్చితార్థం అని చెప్పి మమ్మల్నే బోల్తా కొట్టిద్దామని అనుకున్నావా బెస్ట్ సీఈవో ఇక్కడ అని యష్ అంటే అప్పుడే ఏమి అయిపోలేదని వేద ఛాలెంజ్ చేస్తుంది. నిధి అందంగా ముస్తాబై వస్తుంది. చాలా చక్కగా ఉన్నావ్ అని మాలిని మెచ్చుకుంటుంది. ముందు వసంత్ నిధిల నిశ్చితార్థం జరిగేలా చెయ్యడానికి పంతుల్ని రంగంలోకి దించుతుంది వేద. జాతకాలు సరిగా చూడలేదు పొరపాటున ముహూర్తం పెట్టాను ముందు వసంత్ నిధిల నిశ్చితార్థం జరగాలి తర్వాత చిత్ర, వైభవ్ వాళ్ళది అని పంతులు చెప్తాడు. లేదంటే అశుభం జరుగుతుందని అంటాడు.
శుభమా అని నిశ్చితార్థం చేసుకుంటుంటే ఏంటి ఆ మాటలు అని వేద ఏమి తెలియనట్టు అంటుంది. మరి ఏం చెయ్యమంటారు అని పంతులు కోపంగా అంటాడు. సరే మీ ఇష్టప్రకారం ముందు వసంత్ వాళ్ళది తర్వాత చిత్ర వాళ్ళ నిశ్చితార్థం చేద్దాం అని సులోచన అంటుంది. కానీ అందుకు మాలిని ఒప్పుకోదు.. ఇందులో ఏదో మ్యాచ్ ఫిక్సింగ్ లాగా ఉందని అనేసరికి దామోదర్ వస్తాడు. వాళ్ళకి జాతకల మీద పట్టింపు ఉంది ఇంత చిన్న విషయానికి ఎందుకు రాద్దాంతం ముందు వసంత్ వాళ్ళ నిశ్చితార్థం చేద్దాంఅని అంటాడు. వేద చిన్నగా తన ప్లాన్ సక్సెస్ అయినందుకు నవ్వుకోవడం యష్ గమనిస్తాడు. సరే అని వసంత్ నిశ్చితార్థం ఏర్పాట్లు పనిలోకి వెళ్లిపోతారు.
Also Read: సామ్రాట్ విషయంలో తగ్గేదెలే అన్న తులసి- 'నాన్న కానీ ఈ నాన్న'ని క్షమించమని హనీని అడిగిన సామ్రాట్
పంతుల్ని, పంచంగాన్ని బాగానే మేనేజ్ చేశావ్ అని యష్ వేదని అంటాడు. నేనేమీ చేశాను అమాయకంగా అడుగుతుంది. నటించకు ఏం జరిగిందో తెలుసుకోలేనంత అమాయకుడిని ఏమి కాదు అని యష్ అంటాడు. నువ్వు ట్విస్ట్ ఇస్తాను అన్నప్పుడే ఏదో ఒక రూమ్ లో పెట్టి లాక్ చేస్తే పోయేది తప్పు చేశాను అని యష్ అంటే నేను దాన్ని బ్రేక్ చేసి బయటకి రావడం వచ్చేస్తాను అని వేద అంటుంది.