ఐపీఎస్ ముగిసిపోయిన గతం, చెదరిపోయిన కల దయచేసి ఇక దాని గురించి వదిలేద్దాంఅని జానకి చెప్తుంది. రామా ఎంత చెప్పినా వినకుండా వెళ్ళిపోతుంది. అమ్మకేమో నిజం తెలిసిపోయింది జానకి గారు చదువను అంటున్నారు చిన్నప్పటి నుంచి కల వదిలేయడం అని రామా బాధపడతాడు. జ్ఞానంబ జానకి తన తల్లిదండ్రుల ఫోటో ముందు నిలబడి మాట్లాడిన మాటలు తలుచుకుంటూ ఉండగా రామా ఐపీఎస్ పుస్తకాలు తెచ్చి ముందు పెడతాడు. జానకిగారు ఐపీఎస్ చదువును వదిలేస్తానని నిర్ణయం తీసుకున్నారమ్మా, నా గురించి నువ్వు ఇంక భయపడాల్సిన పనిలేదమ్మా నిశ్చింతగా ఉండొచ్చు అని రామా తల్లికి చెప్తాడు.
‘జానకిగారు ఐపీఎస్ అయితే సమాజానికి చాలా మంచి చేస్తారమ్మా, చదవకుండా ఆపేస్తే ఒక మంచి ఆశయం చచ్చిపోతుందమ్మా.. అనుకున్నది సాధించలేకపోయాను అనే బాధ జానకిగారిని జీవితాంతం వెంటాడుతుంది. నువ్వు చదువుకి వ్యతిరేకం కాదు చాలా మంది చదువుకోవడానికి డబ్బు సాయం చేస్తున్నవని తెలుసు. కేవలం మావయ్య జీవితంలో జరిగిన దాని వల్ల నువ్వు జానకి గారిని చదువుకోవడానికి ఒప్పుకోవడం లేదని నాకు తెలుసు ఎప్పుడో ఏదో జరిగిందని ఎప్పుడు అలా జరుగుతుందా చెప్పమ్మా జానకి గారికి భర్తని, అత్తారింటిని గౌరవించడం తప్ప అవమానించడం తెలియదమ్మా. నా మీద గౌరవం జానకిగారి ఐపీఎస్ కలకీ శాపం అవడం ఎంతవరకు సమంజసం నువ్వే ఆలోచించమ్మా’ అని రామా తల్లికి చెప్తాడు.
Also Read: రుక్మిణిని అమ్మలా చూసుకున్న చిన్మయి- తన ఫోటోకి మీసాలు గీసి మానాయన ఇలాగే ఉంటాడు వెతకమంటున్న దేవి
నేను నడుము నొప్పితో మంచం మీద పడిపోతే ఇంటి బాధ్యతని భుజాన వేసుకుని రాముడు తన చదువుని త్యాగం చేశాడు. నా గురించి చదువుకోలేకపోయాడని నువ్వు ఇప్పటికీ బాధపడుతూనే ఉంటావ్. మరి ఒక కన్న తండ్రి తన కన్న కూతురు కోసం పడే ఆరాటం నువ్వు అర్థం చేసుకోలేవా జానకి స్థానంలో మన కూతురు వెన్నెలా ఉంటే ఏం చేస్తాం ఒకసారి ఆలోచించు అని గోవిందరాజులు అంటాడు. ఇంత చెప్పినా జ్ఞానంబ మౌనంగా ఉండటంతో రామా ఆ పుస్తకాలని తీసుకుని వెళ్ళిపోతాడు. పుస్తకాలు తీసుకుని గడప దాటుతున్న రామాని జ్ఞానంబ పిలుస్తుంది.
“ఈరోజు ఈ కుటుంబం చల్లగా ఉందన్న, ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారన్నా దానికి కారణం ఆరేళ్ళ వయసులో నా పెద్ద కొడుకు తన చదువుని భవిష్యత్ ని త్యాగం చేసి ఈ ఇంటి బాధ్యతని తన భుజాన వేసుకోవడం. అంత గొప్ప త్యాగం చేసిన నా బిడ్డ బాగుండాలని క్షేమంగా ఉండాలని కన్న తల్లిగా నేను ప్రతి క్షణం తపన పడ్డాను. అందుకోసం వాడి కంటే తక్కువ చదువుకున్న అమ్మాయిని పెళ్లి చెయ్యాలని అనుకున్నాను. ఈరోజు నాబిడ్డ కంట తడి పెట్టుకుని ఓ మాట అన్నాడు. నా భార్య బాధపడుతుంటే నేను జీవితాంతం సంతోషంగా ఎలా ఉండగలనమ్మా అని.. నా బిడ్డ తన భవిష్యత్ త్యాగం చేసిన రోజు కూడా ఇలా బాధపడలేదు. అందుకే నా భయమే నా కొడుకు క్షేమం కోసం అయినప్పుడు నా బిడ్డ నా కళ్ళ ముందు బాధపడుతుంటే నేను ప్రశాంతంగా ఎలా ఉండగలను. నా కొడుకు సంతోషంగా ఉంటేనే ఈ కుటుంబం క్షేమంగా ఉంటుంది. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. జానకి ఐపీఎస్ చదవడానికి నేను ఒప్పుకుంటున్నాను” అని అందరికీ చెప్తుంది. ఆ మాటకి అందరూ సంతోషిస్తారు.
Also Read: తులసి కోసం ఓడిపోయి తనకి అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చిన సామ్రాట్- అది చూసి కుళ్ళుకుంటున్న లాస్య, నందు
మల్లిక మాత్రం ఈ పోలేరమ్మ ఏంటి ఇంత పెద్ద షాక్ ఇచ్చిందని అనుకుంటుంది. చదువుకోవడానికి జానకి కొన్ని షరతులకి ఒప్పుకోవాలని జ్ఞానంబ అంటుంది. షరతులు ఎందుకమ్మా అని రామా అంటాడు. నీ కోసమే నీ క్షేమం కోసమే. జానకికి ఐపీఎస్ అంటే ప్రాణం.. నాకు నా కొడుకంటే ప్రాణం తన కల చెదిరిపోతే తను ఎలా తట్టుకోలేదని నువ్వు బాధపడ్డావో నేను అంతే నా కొడుక్కి ఏమైనా అయితే నేను తట్టుకోలేనని అంటుంది. “నీ ప్రవర్తన, నీ నడవడిక అన్నీ నిన్ను చూసుకుని నేర్చుకునేలా ఉండాలి, చదువుకున్నాను అనే అహంతో భర్తని చిన్న చూపు చూడకూడదు, నువ్వు చదువుని ఎంత ముఖ్యం అనుకుంటున్నావో సంసార బాధ్యతని కూడా అంతే అనుకోవాలి. ఒక భార్యగా భర్తకి అందించాల్సిన ప్రేమానురాగాలు నీ చదువు కారణంగా నీ భర్తకి దూరం కాకూడదు. ఈ ఇంటికి వారాసుడిని ఇవ్వడానికి నీ చదువు ఆటంకం రాకూడదు. నీ చదువు వల్ల ఈ ఇంటి పరువు ప్రతిష్టకి ఎటువంటి భంగం వాటిల్లకూడదు. అలాగే గతంలో వెన్నెల విషయంలో జోక్యం చేసుకున్నావ్ అలాంటి విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోకూడదు. వీటిలో నువ్వు ఏది తప్పినా నేను తీసుకునే నిర్ణయం చాలా కఠినంగా ఉంటుంది. ఆ క్షణం నువ్వు నా నిర్ణయానికి తల వంచాలి ఎదురు ప్రశ్నించకూడదు” అని జ్ఞానంబ చెప్తుంది.