ఇంట్లో తన కడుపు నాటకం బయటపడే పరిస్థితే వస్తే తోటి కోడలు జానకి వల్లే తన కడుపు పోయిందని అందరినీ నమ్మించి తనని ఇరికిస్తాను అని చెప్పి మల్లిక సంబరపడుతుంటే పక్కన రామా, జానకి ఉంటారు. వాళ్ళ మాటలు ఎక్కడ విన్నదో అని మల్లిక టెన్షన్ పడుతుంది. నీ పద్ధతేమి బాగోలేదు మల్లిక అని జానకి అంటుంది. నేనేం చేశాను జానకి అని మల్లిక టెన్షన్ గా అడుగుతుంది. అప్పుడే అక్కడకి విష్ణు కూడా వస్తాడు. జానకి బేబీ పోస్టర్స్ ఇచ్చి గదిలో అంటించుకుని రోజు వీటిని చూస్తే ఇలాగే పండంటి బిడ్డ పుడుతుందని జానకి చెప్తుంది. నీది ఎంత మంచి మనసమ్మ నీ సొంత చెల్లిని చూసుకుంటున్నట్టు చూసుకుంటున్నావని గోవిందరాజులు అంటాడు. అవునమ్మా పెద్ద కోడలిగా నీ బాధ్యతలు నెరవేరుస్తున్నావని జ్ఞానంబ కూడా మెచ్చుకుంటుంది.


ఎప్పటిలాగానే మల్లిక అత్తయ్యగారి దగ్గర జానకిని ఇరికించి తప్పు చేసిందని నిరూపించాలని మనసులో అనుకుంటుంది. జానకి ఫ్రూట్ సలాడ్ చేసి తీసుకొచ్చి మల్లికకి ఇస్తుంది. ఆ సలాడ్ లో బొప్పాయి ముక్కలు చూస్తుంది జ్ఞానంబ. వాటిని తినబోతుంటే మల్లిక ఆపుతుంది. కడుపుతో ఉన్న ఆడపిల్ల బొప్పాయి తినకూడదు ఎందుకు తింటున్నావని అడుగుతుంది. ఇది నేను చేసుకోలేదు జానకి తెచ్చి ఇచ్చిందని చెప్తుంది. జ్ఞానంబ కోపంగా జానకిని పిలుస్తుంది. కడుపుతో ఉన్న ఆడపిల్ల బొప్పాయి ముక్కలు తినకూడదని నీకు తెలియదా అని అడుగుతుంది. కావాలని కలిపోయిందో లేదో కడుపుతో ఉన్న వాళ్ళు బొప్పాయి తినకూడదని చదువుకున్న జానకికి తెలియదా ఏదో ఏమరపాటులో కలిపి ఉంటుందిలే అని ఇరికించేందుకు చూస్తుంది. ఏమ్మా తాలింపు మల్లిక మళ్ళీ మొదలు పెట్టావా అని గోవిందరాజులు తిడతాడు.


Also Read: ఇన్విటేషన్ కార్డ్ తులసి, సామ్రాట్ పెళ్లి శుభలేఖలా ఉందన్న లాస్య- కార్డ్ చింపేసి రచ్చ చేసిన అభి


నీకిచ్చిన దాంట్లో జానకి ఎందుకు కలుపుతుందని అంటాడు. కావాలంటే తననే అడగమని మల్లిక అనేసరికి నేనే సలాడ్ తెచ్చి ఇచ్చాను కాని అందులో బొప్పాయి ముక్కలు నేను కలపలేదని జానకి చెప్తుంది. నీకు కడుపు వచ్చిన దగ్గర నుంచి జానకి ఎంత సంబరపడుతుందో నాకు తెలుసు అలాంటప్పుడు తను ఎందుకు ఇలా చేస్తుందని రామా అంటాడు. ఏదో ఆవేశంలో జానకి ఇలా చేసి ఉంటది క్షమించండి అత్తయ్యగారు అని మల్లిక నటిస్తుంది. క్షమించడానికి ఇదేమన్న చిన్న విషయమా అని తిడుతుంది. ఆ బొప్పాయి ముక్కలు కలిపింది నేను అని విష్ణు చెప్తాడు. (జానకి సలాడ్ చేసి పక్కకి వెళ్ళిన తర్వాత మల్లిక చాటుగా వచ్చి బొప్పాయి ముక్కలు కలపడం విష్ణు చూస్తాడు). సోరి అమ్మ కడుపుతో ఉన్న వాళ్ళు బొప్పాయి ముక్కలు తినకూడదని నాకు తెలియదు, వదిన ఫ్రూట్ సలాడ్ చేసి ఏదో పని మీద బయటకి వెళ్తే అప్పుడే నేనే అక్కడ ఉన్న బొప్పాయి చూసి హెల్త్ కి మంచిది కదా అని కలిపాను. వదిన అది చూసుకోకుండా మల్లికకి ఇచ్చింది. సోరి వదినా నేను చూసిన పనికి నువ్వు మాటలు పడ్డావ్ అని విష్ణు అంటాడు.


గదిలోకి వచ్చిన తర్వాత కడుపుతో ఉన్న భార్యని బాధపెట్టి తప్పు చేసిన జానకిని వెనకేసుకొచ్చి నా మనసుని బాధపెట్టారని మల్లిక అడుగుతుంది. ఆ మాటకి తప్పు చేసింది వదిన కాదు నువ్వు అని అంటాడు. వదిన మీద నింద వెయ్యడానికి నువ్వే సలాడ్ లో బొప్పాయి ముక్కలు కలిపావని అమ్మకి చెప్తే ఎలా ఉంటుందో ఊహించుకో.. నువ్వు వాటిని కలపడం నేను చూశాను, ఎందుకు నీకు అంత ఓర్వలేని తనం అని అడుగుతాడు. వదిన నీకు కావలసింది చేసి పెడుతూ కాలు కింద పెట్టకుండా చూసుకుంటుంటే తన మీద ఎందుకు నీకు అంత ద్వేషం అని అంటాడు. నీ మీద ప్రేమ లేకపోతే ఫంక్షన్ చేస్తుందా అని అంటాడు. ఇంకోసారి ఇలా చేస్తే అమ్మకి చెప్పేస్తాను అని హెచ్చరిస్తాడు. అటు రామా కూడా మల్లిక చేసిన దాని గురించి ఆలోచిస్తూ బాధపడతాడు. జానకి మాత్రం అవేమీ పట్టించుకోవద్దని సర్ది చెప్తుంది.  


Also Read: కార్తీక్ కి మోనిత గోరుముద్దలు, నువ్వు నా భార్యని కాదంటూ దీపని గుర్తుచేసుకున్న డాక్టర్ బాబు!