సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన ‘జైలర్’ సినిమా బ్లాక్‌బస్టర్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. మొదటి రోజే దాదాపు రూ.90 కోట్లు పైగా6 కో కలెక్షన్లను ‘జైలర్’ సాధించింది. ఇందులో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ కీలకమైన అతిథి పాత్రల్లో కనిపించిన సంగతి తెలిసిందే.


తెలుగు నుంచి అలాంటి స్టార్ అప్పియరెన్స్ ఏదీ సినిమాలో కనిపించలేదు. కానీ ఒక పవర్‌ఫుల్ పోలీసాఫీసర్ పాత్రకు నటసింహం నందమూరి బాలకృష్ణను తీసుకుందామని సినిమా టీమ్ అనుకున్నారట. కానీ అది వర్కవుట్ అవ్వలేదని దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.


ఒకవేళ ఈ పాత్ర సెట్ అయి నందమూరి బాలకృష్ణ చేసి అది వేరే లెవల్‌లో ఉండేది. అనిరుథ్ రవిచందర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో శివరాజ్ కుమార్, మోహన్ లాల్‌తో పాటు నందమూరి బాలకృష్ణ కూడా నడిచి వస్తూ ఉంటే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు టాప్ లేచి పోయేవి. అనిరుథ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో బాలయ్యని చూసిన ఆనందం ఫ్యాన్స్‌కు ఉండిపోయేది. కానీ కొంచెంలో అది మిస్ అయింది.


‘జైలర్’ మాత్రం మరోవైపు బాక్సాఫీస్ వద్ద నాన్‌స్టాప్‌గా దూసుకుపోతూనే ఉంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే మొదటి రోజు రూ.12 కోట్ల గ్రాస్, రూ. ఏడు కోట్ల షేర్‌ను ‘జైలర్’ వసూలు చేసింది. రజనీ గత చిత్రం ‘పెద్దన్న’ తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు కేవలం రూ.1.6 కోట్లు మాత్రమే. కాబట్టి రజనీకాంత్‌కు కూడా ఇది ఊరటనిచ్చే విషయం.


ఈ సినిమా ఆడియో లాంచ్‌లో రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు తెలుగు నాట సంచలనాన్ని రేపాయి. ‘జైలర్’ ప్రీ రిలీజ్ స్పీచ్ లో రజినీకాంత్ మాట్లాడుతూ తన గురించి ఎదుటి వాళ్లు ఏం అనుకున్నా పట్టించుకోనని చెప్పారు. తన జీవితంలో ఎదుర్కొన్న పరిస్థితులను కూడా ఈ సందర్భంగా వివరించారు. "మొరగని కుక్క లేదు. విమర్శించని నోరు లేదు. ఈ రెండూ జరగని ఊరు లేదు. వాటి గురించి పట్టించుకోకుండా, మనం మన పని చేసుకుంటూ పోవాలి. అర్థమైందా రాజా" అని నవ్వుతూ చెప్పుకొచ్చారు. ఆయన మాటలకు ఆడిటోరియంలో ఉన్న ప్రేక్షకులు కరతాళధ్వనులతో మద్దతు పలికారు. అయితే ఈ వ్యాఖ్యలను సూపర్ స్టార్ రజనీకాంత్ వైసీపీ నాయకులను ఉద్దేశించి చేశారని కొంత మంది నెటిజన్లు సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు.


కొద్ది నెలల క్రితం ఏపీలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో తలైవర్ రజనీకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. “చంద్రబాబు నాయుడు ముందుచూపు కలిగిన వ్యక్తి. న్యూయార్క్‌ నగరాన్ని తలపించేలా హైదరాబా​ద్ నగరాన్ని రూపొందించారు. చంద్రబాబు విజన్ 2047 గురించి నాకు వివరించారు. ఆ కల సాకారం అయితే, ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో ఉంటుంది. ఆయన వేసిన ప్రణాళికలు అమల్లోకి రావాలని భావిస్తున్నాను.” అని ఆయన అన్నారు.


Read Also: ఈడో పెద్ద దూలగాడు, ఆడ పిల్లలను అలా చూడకు దరిద్రంగా - రాజా రవీంద్రకు చిరంజీవి చురకలు


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial