''ఇసువంటి ఫ్యామిలీ, ఇసువంటి పంచాయతీ మీరు యాడ సూసి ఉండరు. గీ ఇంటి వింత పంచాయతీ ఏందో డిసెంబర్ 16 నుండి 'ఆహా'ల సూడుండ్రి'' అని 'ఆహా' ఓటీటీ వేదిక సోషల్ మీడియాలో పేర్కొంది. ఇంతకీ, ఏ సినిమా గురించి ఈ ప్రకటన అనుకుంటున్నారా? 'ఇంటింటి రామాయణం' గురించి!


మారుతి షో రన్నర్‌గా!
నరేష్ విజయ కృష్ణ (Naresh Vijaya Krishna), రాహుల్ రామకృష్ణ, నవ్య స్వామి (Navya Swamy), సురభి ప్రభావతి, గంగవ్వ, అంజి మామ, చేవెళ్ల రవి, జీవన్, రాధిక ప్రధాన పాత్రలు పోషించిన సినిమా 'ఇంటింటి రామాయణం' (Intinti Ramayanam Movie). వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ యిన్నమూరి నిర్మాతలు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందింది. కథ, కథనం అందించడంతో పాటు సురేష్ నరెడ్ల దర్శకత్వం వహించారు. వచ్చే నెల 16వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ దర్శకుడు మారుతి షో రన్నర్‌గా రూపొందిన సినిమా ఇది. 


టీజర్ ఎలా ఉందంటే?
Intinti Ramayanam Movie Teaser Released, Watch Here : ఈ రోజు 'ఇంటింటి రామాయణం' టీజర్ విడుదల చేశారు. అది ఎలా ఉందంటే... 'మీరు అసలు హైలైట్ అన్నా! మీ అసువంటి గొప్ప ఫ్యామిలీ ఏ ఊరిలోనూ ఉండదు తెలుసా!' అని ఓ వాయిస్ ఓవర్ వినిపిస్తుంటే... ప్రధాన పాత్రలను తెరపై పరిచయం చేశారు. రాహుల్ రామకృష్ణ, నవ్య స్వామి మధ్య ప్రేమ ఉన్నట్లు చూపించారు. 'అంతా బాగానే ఉంది కానీ... ఎక్కడో తేడా కొడుతుంది' అనే డైలాగ్ రావడం, ఆ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అంతా పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం చూపించారు. అసలు, వాళ్ళు పోలీస్ స్టేషన్‌కు ఎందుకు వెళ్ళారు? అనేది రివీల్ చేయలేదు. ట్రైలర్ లేదా సినిమాలో చూపించే అవకాశం ఉంది.
  
ఒక్కొక్కరిదీ ఒక్కో చరిత్ర!
'అరే ఏం ఫ్యామిలీరా మీది!? అరే... మీ ఇంట్లో ఒక్కొక్కరికీ ఒక్కో చరిత్ర ఉందిరా' అని పోలీస్ స్టేషన్‌లో ఫ్యామిలీ అందరినీ లైనులో నిలబెట్టి క్లాసు పీకడం, అందరూ బిక్క మొఖాలు వేసుకుని ఉండటంతో... ఎవరెవరు ఏయే తప్పులు చేశారనే క్యూరియాసిటీ క్రియేట్ అయ్యింది.   


మారుతి మాట్లాడుతూ ''నేను ఆహా కోసం ఇంతకు ముందు 'త్రీ రోజెస్' వెబ్ సిరీస్ రూపొందించాను. అదే అనుబంధంతో ఇప్పుడు చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైన‌ర్ 'ఇంటింటి రామాయ‌ణం' రూపొందించా. ఈ సినిమా, చిత్రకథ మీ హృద‌యాలను హ‌త్తుకోవ‌ట‌మే కాదు... మీరు ప్రేమించ‌న వ్య‌క్తులో గ‌డిపిన మ‌ధుర క్ష‌ణాల‌ను గుర్తుకు తెస్తుంది. సినిమా చూశాక... మీ ఇంటి స‌భ్యుల‌తో మాట్లాడతారు. ఒక‌వేళ వారు వేరే ప్రాంతాల్లో ఉంటే... టికెట్ బుక్ చేసుకుని మరీ వెళ్లి వారిని క‌లుసుకోవాల‌నే కోరిక క‌లుగుతుంది'' అని అన్నారు. 


Also Read : 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' రివ్యూ : 'అల్లరి' నరేష్ ఎన్నికల సినిమాకు ప్రేక్షకులు ఓటేస్తారా? లేదా?



'ఆహా'లో నట సింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న 'అన్‌స్టాపబుల్' రెండో సీజన్ టాప్ రేటింగ్స్‌తో దూసుకు వెళుతోంది. అనిల్ రావిపూడి, 'సుడిగాలి' సుధీర్ తదితరులతో చేసిన 'కామెడీ ఎక్స్‌ఛేంజ్' డిసెంబర్ 2వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.