Intinti Ramayanam Trailer: సినిమాలో కంటెంట్ ఉండాలే గానీ మూవీను సూపర్ హిట్ చేయడానికి ప్రేక్షకులు ఎప్పుడూ సిద్దంగానే ఉంటారు. ఈ మధ్య కాలంలో వచ్చిన చిన్న సినిమాలు కూడా మంచి హిట్ ను అందుకుంటున్నాయి. ముఖ్యంగా తెలంగాణ యాసతో ఈ మధ్య వచ్చిన ‘బలగం’ లాంటి కుంటుంబ నేపథ్య చిత్రాలు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందాయి. అలాంటి కుటుంబ కథా నేపథ్యంలో వస్తోన్న మరో సినిమా వస్తోంది. అదే ‘ఇంటింట రామాయణం’. టాలెంటెడ్ నటుడు రాహుల్ రామకృష్ణ, నవ్య స్వామి ప్రధాన పాత్రలు పోషించారు. సురేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఈ నెల 9న ప్రేక్షకుల మందుకు రానుంది.
కామెడీ, ఎమోషన్స్ కలగలిపిన కథతో..
ఈ మధ్య ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలను ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్నారు. అలాంటి కథతో ప్రేక్షకుల ముందుకొస్తున్న సినిమా ఈ ‘ఇంటింటి రామాయణం’. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. విలేజ్ డ్రామా నేపథ్యంలో వివిధ పాత్రల చుట్టూ తిరిగే ఫన్ అండ్ కూల్ ఎలిమెంట్స్ తో సినిమా సాగుతుంది. మూవీ లో రాహుల్ రామకృష్ణ, నవ్యస్వామి లవ్ ట్రాక్ కూడా బాగానే వర్కౌట్ అయినట్టు కనిపిస్తోంది. సరదాగా సాగుతున్న వాళ్లందరి జీవితాల్లోకి ఒక ట్విస్ట్ ఎదురవుతుంది. ఓ రోజు హీరోయిన్ నవ్యస్వామి ఇంట్లో బంగారం దొంగతనం జరుగుతుంది. ఆ దొంగతనాన్ని ఒకరి మీద ఒకరు నెట్టుకుంటూ ఒకరిపై ఒకరు అనుమానం వ్యక్తం చేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఏమైంది? బంగారం ఎవరు కొట్టేశారు? చివరికి ఏమైంది? రాహుల్, నవ్య పెళ్లి చేసుకున్నారా లేదా అనేది మూవీలో చూడాలి. మొత్తానికి ట్రైలర్ మాత్రం ఆకట్టుకునేలా ఉందనే చెప్పాలి. మరి సినిమా ఎలా ఉంటుంది అనేది తెలియాలి అంటే రిలీజ్ వరకూ వెయిట్ చేయాల్సిందే.
‘దసరా’, ‘బలగం’, ‘పరేషాన్’ మార్గంలో ‘ఇంటింటి రామాయాణం’ మూవీ
ఈ మధ్య తెలంగాణ యాసతో వస్తోన్న సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా తెలంగాణ పల్లె సాంప్రదాయాలను కళ్లకు కట్టినట్టు చూపించిన ‘బలగం’ లాంటి సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అలాగే తెలంగాణ యాస తో వచ్చిన సినిమాలు కూడా ఆకట్టుకుంటున్నాయి. ఇటీవలే విడుదల అయిన ‘దసరా’ ‘బలగం’, ‘సత్తిగాని రెండెకరాలు’ ‘పరేషాన్’ లాంటి కొన్ని సినిమాలు తెలంగాణ యాసలో వచ్చినవే. వాటిల్లో చాలా సినిమాలు మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఇప్పడు అదే బాటలో ఈ ‘ఇంటింటి రామాయణం’ కూడా వస్తోంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక ఈ సినమాలో నరేష్, గంగవ్వ, బిత్తిరి సత్తి ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. వెంకట్-గోపీచంద్ ఈ మూవీను నిర్మించారు. ఈ మూవీ జూన్ 9 న థియేటర్లలో విడుదల కానుంది.