Hero Upcoming Bikes: హీరో మోటోకార్ప్ తన పోర్ట్‌ఫోలియోను విస్తరించేందుకు సిద్ధమవుతోంది. దీని కారణంగా జూన్ 14వ తేదీన కొత్త ఆర్డీఈ నిబంధనలతో తను అప్‌డేట్ చేసిన బైక్ Xtreme 160R మోటార్‌సైకిల్‌ను లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ బైక్ ఇప్పటికే చాలా సార్లు టెస్టింగ్‌లో కనిపించింది. 


Hero Xtreme 160R 2023 అనేక ముఖ్యమైన మార్పులతో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. అయితే ఈ బైక్ గురించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు. కానీ ఇప్పటి వరకు లీక్ అయిన ఫొటోలు చూసుకుంటే అప్ డేట్ చేసిన బైక్ టెలిస్కోపిక్ సస్పెన్షన్‌కు బదులుగా యూఎస్‌డీ ఫోర్క్‌లను ఇందులో చూడవచ్చు. ఇది కాకుండా బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కూడా అందించారు. దీనితో పాటు కంపెనీ ఈ అప్‌డేట్ చేసిన మోడల్‌ను కొత్త డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్‌తో లాంచ్ చేయవచ్చు.


హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ ఇంజన్
ఎక్స్‌ట్రీమ్ 160R లేటెస్ట్ మోడల్‌లో 163 సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజన్ అందించారు. ఇది 14.9 హెచ్‌పీ శక్తిని, 14 న్యూటన్ మీటర్ల పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ సెగ్మెంట్ బైక్‌లతో పోటీ పడేందుకు, దీనిని ఈ20 ఆధారిత ఇంజిన్‌తో కూడా లాంచ్ చేసే అవకాశం ఉంది.


వేటితో పోటీ?
అప్‌డేట్ చేసిన Hero Xtreme 160Rతో పోటీ పడుతున్న బైక్‌ల గురించి చెప్పాలంటే ఈ జాబితాలో టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వీ, బజాజ్ పల్సర్ ఎన్160, పల్సర్ ఎన్ఎస్160 ఉన్నాయి. అదే సమయంలో ఈ కొత్త అప్‌డేటెడ్ వేరియంట్‌లో రూ. ఆరు వేల నుంచి రూ. 10 వేల వరకు పెరుగుదలను చూడవచ్చు.


విక్రయాల పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద మోటార్‌సైకిల్ తయారీదారు సంస్థ అయిన భారతదేశానికి చెందిన హీరో మోటో శుక్రవారం తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. అదే హీరో విడా వీ1. హీరో క్లీనర్ ట్రాన్స్‌పోర్ట్‌కు మారడానికి ముందు కొత్త మార్కెట్లను చేరుకోవాలని చూస్తోంది.


హీరో తొలి ఎలక్ట్రిక్ మోడల్ విడా వీ1. ధర రూ.1.45 లక్షలుగా ఉంది. ఇది భారతదేశంలోని చాలా ఎలక్ట్రిక్ స్కూటర్ల కంటే ఎక్కువ. ఏథర్ మాదిరిగానే ఒక్కసారి చార్జ్ చేస్తే కనీసం 143 కిలోమీటర్ల రేంజ్‌ను అందించనుంది. అక్టోబర్ 10వ తేదీ నుంచి దీని బుకింగ్స్ ప్రారంభం అవుతాయి. డెలివరీలను డిసెంబర్ నుంచి మొదలు పెట్టనున్నారు.


ఎలక్ట్రిక్ వాహనాల స్టార్టప్‌లలో హీరో వరుసగా పెట్టుబడులు పెట్టింది. సెప్టెంబర్‌లో కాలిఫోర్నియాకు చెందిన జీరో మోటార్‌సైకిల్స్‌లో సంయుక్తంగా ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను అభివృద్ధి చేసేందుకు $60 మిలియన్లు (దాదాపు రూ. 500 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు హీరో తెలిపింది. జనవరిలో ఇది ఏథర్‌లో $56 మిలియన్ల (దాదాపు రూ. 460 కోట్లు) పెట్టుబడిని ప్రకటించింది. 2021లో దాని బ్యాటరీ షేరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం తైవాన్‌కు చెందిన గోగోరోతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.


భారతదేశంలో ఈ-స్కూటర్లు, ఈ-బైక్‌లు 2030 నాటికి మొత్తం టూ-వీలర్ అమ్మకాలలో 80 శాతంగా ఉంటాయని అంచనా. ఇప్పుడు ఇది దాదాపు 2 శాతంగా ఉంది. పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో ప్రజలు గ్యాసోలిన్ స్కూటర్‌లకు దూరంగా ఉండటంతో అమ్మకాలు వేగవంతం అవుతున్నప్పటికీ, ఇటీవల ఎలక్ట్రిక్ స్కూటర్‌లకు మంటలు అంటుకోవడం భద్రతపై ఆందోళనలను పెంచింది. ఇది వినియోగదారుల విశ్వాసాన్ని కూడాని దెబ్బతీసింది.


Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!