Devara Second Single Update: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న లేటెస్ట్  మూవీ ‘దేవర’. ‘RRR’ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న ఈ మూవీపై దేశ వ్యాప్తంగా భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఎన్టీఆర్ కెరీర్ లో 30వ చిత్రంగా ‘దేవర’ రూపొందుతుంది. ఎన్టీఆర్, కొరటాల కాంబోలో వస్తున్న రెండో చిత్రం కావడంతో మంచి బజ్ క్రియేట్ అవుతోంది.


‘దేవర’ సెకెండ్ సింగిల్ రిలీజ్ ఎప్పుడంటే?


‘దేవర’ సినిమా తొలి భాగం సెప్టెంబర్ లో విడుదలకు రెడీ అవుతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేశారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన తొలి సాంగ్ (ఫియర్ సాంగ్) విడుదలైంది. ప్రేక్షకులను ఈ సాంగ్ అద్భుతంగా అలరించింది. సినిమాపై భారీగా అంచనాలు పెంచింది.  ఈ నేపథ్యంలోనే సెకెండ్ సింగిల్ ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.  ఇప్పుడు ఈ సాంగ్ కు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. ఈ వారంలోనే సెకెండ్ సింగిల్ కు సంబంధించి ప్రకటన వస్తుందని అందరూ భావించారు. అనుకున్నట్లుగానే ఆడియో లేబుల్ సంస్థ టి సిరీస్ హింట్ ఇచ్చింది. ఈసారి దేవర నుంచి  లవ్ సాంగ్ ని విడుదల చేయబోతున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో హింట్ ఇచ్చింది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి రెండో సాంగ్ విడుదలయ్యే అవకాశం ఉంది.  






‘దేవర’లో ఇద్దరు విలన్లు!


‘దేవర’ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా కనిపించనున్నట్లు మొదటి నుంచి వార్తలు వినిపించాయి. తాజాగా ఈ సినిమాలో మరో బాలీవుడ్ నటుడు కూడా విలన్ పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.  ‘యానిమల్’ యాక్టర్ బాబీ డియోల్ ఈ సినిమాలో మరో విలన్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ‘దేవర’ పార్ట్ 1లో సైఫ్ అలీ ఖాన్ మెయిన్ విలన్ గా ఉండగా, చివరలో బాబీ డియోల్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ‘దేవర’ పార్ట్ 2లో ఇద్దరి పాత్రలకు సమ ప్రాధాన్యత ఉంటుందని టాక్ వినిపిస్తోంది.  


సెప్టెంబర్ 27న 5 భాషల్లో విడుదల


ఇక ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ తోపాటు ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.  రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో విడుదలకానుంది. తీర ప్రాంతం కథ నేపథ్యంలో ఈ సినిమా కొనసాగుతుంది. జాన్వీ కపూర్ నటిస్తున్న ఈ తొలి తెలుగు సినిమా సెప్టెంబరు 27న విడుదల కానుంది.  


Also Read: ఆ దేశంలో హనుమాన్‌ రిలీజ్‌ - ఎప్పుడో చెప్పిన ప్రశాంత్‌ వర్మ, పోస్ట్‌ వైరల్‌



Read Also: ఫస్ట్‌ టైం 'యానిమల్‌' వివాదంపై స్పందించిన రణ్‌బీర్‌ - మరోసారి ఇలాంటి సినిమా చేయనన్నాను..