Hanuman Movie Release in Japan: యంగ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ - కుర్ర  హీరో తేజ సజ్జ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం 'హనుమాన్‌'. అమృత అయ్యర్ హీరోయిన్‌గా వరలక్ష్మి శరత్‌ కుమార్‌ కీలక పాత్ర పోషించిన ఈ సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎలాంటి అంచనాలు లేకుండ వచ్చి పాన్‌ ఇండియా వైడ్‌గా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టింది. రూ. 40 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా థియేట్రికల్‌ రన్‌ వరల్డ్‌ వైడ్‌గా సుమారు రూ. 350 కోట్లకు పైగా గ్రాస్‌ వసూళ్లు చేసినట్టు ట్రేడ్‌ వర్గా నుంచి సమాచారం.


ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ సినిమా మహేష్‌ బాబు 'గుంటూరు కారం', వెంకటేష్‌ సైంధవ్‌ ఇలా స్టార్‌ హీరో సినిమాలతో పోటీకి దిగి వాటన్నింటిని వెనక్కి నెట్టి ఇండస్ట్రీ హిట్‌ కొట్టింది. తక్కవు బడ్జెట్‌లోనే విజువల్‌ వండర చూపించిన ప్రశాంత్‌ వర్మ పనితనంపై ఇండస్ట్రీ వర్గాలు, దర్శక దిగ్గజాలు సైతం ప్రశంసలు కురిపించారు. సూపర్‌ హీరో జానర్‌కి తొలిసారి తెలుగు సినిమాకు పరిచయం చేశాడు. ఇతీహాసాల్లోనే హనుమాన్‌కు సూపర్‌ హీరో జానర్‌ టచ్‌ చేసి అద్భుతం చేశాడు. ఇక ఓటీటీలోనూ హనుమాన్‌ అద్భుతైన రెస్పాన్స్ అందుకుంది. విడుదలైన 24 గంట్లోనే అత్యథిక మిలియన్ల వ్యూస్‌ సాధించిన మూవీ రికార్డు క్రియేట్‌ చేసింది.






బాక్సాఫీసు వద్ద రికార్డు క్రియేట్‌ చేసిన ఈ సినిమా ఇప్పుడు విదేశాల్లోనూ సత్తాచాటేందుకు రెడీ అయ్యింది. హనుమాన్‌ మూవీ జపాన్‌ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఇందుకు సంబంధించిన ట్రైలర్‌ను షేర్‌ చేస్తూ ప్రశాంత్‌ వర్మ వెల్లడించారు. "భారతదేశం ఇతిహాసాల ఎపిక్ టేల్స్ నుంచి జపాన్‌ ప్రజలను మంత్రముగ్ధులను చేసే భూమి వరకు. హను-మాన్‌ను ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్‌ సెన్సేషన్‌ చేసిన మా భారతీయ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. #HanuMan జపనీస్ ఉపశీర్షిక వెర్షన్ *అక్టోబర్ 4న* విడుదలవుతుందని ప్రకటించినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము. మా అద్భుతమైన జపనీస్ వీక్షకుల నుండి అద్భుతమైన ప్రతిస్పందన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము!" అంటూ ప్రశాంత్‌ వర్మ ఆనందం వ్యక్తం చేశాడు.



కాగా మన తెలుగు సినిమాలకు జపాన్‌ ఆడియన్స్‌ నుంచి విశేషా ఆదరణ లభిస్తుంది. భారత చలన చిత్రరంగానికి చెందిన స్టార్‌ హీరోల సినిమాలు జపాన్‌లో రిలీజ్‌ అవుతుంటాయి. గతేడాది ఆస్కార్‌కు నామినేట్‌ అయిన ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ కూడా జపాన్‌లో విడుదలైన సంచలన రేపింది. అక్కడ ఆర్‌ఆర్‌ఆర్‌ రీరిలీజ్‌ అవ్వడం విశేషం. రజనీకాంత్‌, రామ్‌ చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ వంటి స్టార్‌ హీరో సినిమాలతో యంగ్‌ హీరో తేజ సజ్జా సినిమా జపాన్‌లో విడుదల అవ్వడం విశేషం. కాగా హనుమాన్‌ మూవీ సీక్వెల్‌గా 'జై హనుమాన్‌'ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో హనుమంతుడు పాత్ర చూట్టూ సీక్వెల్‌ సాగనుంది. హనుమంతుడు రాముడికి ఇచ్చిన మాట ఏంటీ, దానికి ఆయన ఏం చేయబోతున్నారని సీక్వెల్‌ చూపించబోతున్నాడు ప్రశాంత్‌ వర్మ. ఫస్ట్‌ పార్ట్‌లో హనుమంతుడు పాత్రను రివీల్‌ చేయకుండ సస్పెన్స్‌లో ఉంచాడు ప్రశాంత్‌ వర్మ. 


Also Read: నెట్‌ఫ్లిక్స్‌కు నిరసన సెగ - బాయ్‌కాట్ చేయాలంటూ నెట్టింట హ్యాష్‌ ట్యాగ్‌ ట్రెండ్‌!