Netflix chairman donated to Kamala Harris campaign sparks: ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ వివాదంలో నిలిచింది. ఈ ఓటీటీ ప్లాట్‌ఫాంను బాయ్‌కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో భారీ ఎత్తున్న నిరసనలు వెల్లువెత్తున్నాయి. అంతేకాదు బాయ్‌కాట్ నెట్‌ఫ్లిక్స్ (#Boycott Netflix) పేరుతో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. అంతేకాదు నెట్‌ఫ్లిక్స్‌ని అన్‌సబ్‌స్క్రైబ్ చేయాలంటూ నెటిజన్ల నుంచి డిమాండ్స్ వస్తున్నాయి. అయితే ఇది ఇండియాలో కాదు అమెరికాలో. దీనికి కారణం ఈ సంస్థ సహా వ్యవస్థాపకుడు రీడ్ హెస్టింగ్స్ అమెరికా అధ్యక్ష అభ్యర్థి రేసులో ఉన్న కమలా హారిస్‌కి సపోర్టు చేయడమే.
అసలేం జరిగిందంటే.. ప్రస్తుతం అమెరికాలో అధ్యక్ష పదవి ఎన్నికల హడావుడి కొనసాగుతుంది. ఈ సారి పోటీలో డెమోక్రాటిక్ పార్టీ తరపు అధ్యక్ష పదవికి కమలా హారిస్ పోటీ పడుతున్నారు. దీంతో కమలా హారిస్‌కు నెట్‌ఫ్లిక్స్ వ్యవస్థాపకుడు రీడ్ హేస్టింగ్స్ భారీగా విరాళం ఇచ్చాడట. దాదాపు 7 మిలియన్ డాలర్లు విరాళం ఇచ్చినట్టు ప్రచారం జరుగుతుంది. ఇప్పటి వరకు ఒక రాజకీయ ప్రచారానికి హేస్టింగ్స్ ఇచ్చిన భారీ మొత్తం ఇదేనని సమాచారం. కాగా కమలా హారిస్‌కు విరాళం ఇచ్చిన అనంతరం పరోక్షంగా రీడ్ హేస్టింగ్స్ ఓ ట్వీట్ చేశారట.
"నిరాశకు గురి చేసిన డిబేట్ అనంరతం మేం మళ్లీ గేమ్‌లోకి వచ్చాము" అంటూ హారిస్‌ను ఉద్దేశిస్తూ ఆయన ట్వీట్ చేసినట్టు తెలుస్తోంది.దాంతో వెంటనే సోషల్ మీడియాలో క్యాన్సిల్ నెట్‌ఫ్లక్స్ అంటూ హ్యాష్ ట్యాగ్ దర్శనం ఇచ్చింది. ప్రస్తుతం ఇది ట్రెండ్ అవుతుంది. గతంలోనే నేను నెట్‌ఫ్లిక్స్ అన్‌సబ్‌స్క్రైప్ చేశాను. మీరు చేయకపోతే ఇప్పుడు చేయండి" అంటూ ఓ నెటిజన్లు పోస్ట్ చేశాడు. దీనికి మద్దుతుగా నెటిజన్లు స్పందిస్తూ నెట్‌ఫ్లిక్స్‌ని బాయ్‌కాట్ చేయాలంటూ పిలుపునిస్తున్నారు. "మనకు ఎన్నో ఓటీటీలు అందుబాటులో న్నాయని, దేశపౌరులైన మీకు ఏం చేయాలో తెలుసు కదా" అంటూ పిలుపునిస్తున్నారు.
అయితే ఇదంతా మాజీ అధ్యక్షుడు డ్రోనాల్డ్ డ్రంప్ సపోర్ట్స్ చేస్తున్న రచ్చ అని స్థానిక మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. కాగా త్వరలో అమెరికాలో అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి అధ్యక్ష పదవికి ట్రంప్ ఎన్నికవ్వడం పక్కా అని స్థానికంగా కథనాలు వినిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గుర్తుతెలియని వ్యక్తి ట్రంప్‌పై హత్యాయత్నానికి పాల్పడంతో ఆయనకు అనూహ్యంగా మద్దతు పెరిగింది. అదే సమయంలో జో బైడెన్ అధ్యక్ష పదవి పోటీ నుంచి వైదోలిగి.. కమలా హారిస్‌కే తన మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఆ తర్వాత నుంచి ఆమెకు స్వపక్షంలోనూ మద్దతు పెరుగుతూ వస్తోంది.
Also Read: హీరోగా వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న నాని - రైటర్‌గా కొత్త అవతారం ఎత్తబోతున్నాడా?