తెలుగు సినిమా పరిశ్రమలో అర్థ శతాబ్దాం పాటు సత్తా చాటిన మేటి నటుడు సూపర్ స్టార్ కృష్ణ. ఏఎన్నార్, ఎన్టీఆర్ హవా కొనసాగుతున్న సమయంలోనూ ఎదురు నిలిచిన ఒకేఒక్క నటుడు ఆయన. ఎన్టీఆర్ తో సినిమాల పరంగా ఢీ అంటే ఢీ అన్న హీరో. రామారావుతో పోటీలో చాలా వరకు నష్టపోయినా వెనక్కి తగ్గలేదు కృష్ణ. ఆయన తీసే సినిమాలకు దీటుగా తీయాలని భావించి బోల్తా కొట్టిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. 


‘తేనె మనసులు’ సినిమాతో తెలుగు వెండి తెరకు పరిచయం


ఘట్టమనేని కృష్ణ.. ‘తేనె మనసులు’ సినిమాతో  టాలీవుడ్ లో నటుడిగా అడుగు పెట్టారు. ఆ తర్వాత నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా మారారు. నిర్మాతల మేలు కోరే హీరోగా నిలిచిపోయాడు. ఆయనతో సినిమా చేస్తే తమకు ఎలాంటి ఢోకా ఉండదని భావించేవారు నాటి నిర్మాతలు. ఏదైనా పొరపాటు జరిగి సినిమా ఫ్లాప్ అయినా, తర్వాత సినిమాను ఉచితంగా చేసిన గొప్ప మనసున్న నటుడు కృష్ణ. ప్రస్తుతం వినిపిస్తున్న పాన్ ఇండియా సినిమాలను అర్థ శతాబ్దం కిందటే తెరకెక్కించి చూపించిన వ్యక్తి కృష్ణ. ఆయన నటించిన సినిమాలు అప్పట్లో రికార్డుల మీద రికార్డులు సృష్టించాయి. వసూళ్ల వర్షం కురిపించాయి.  


అర్థ శతాబ్దం క్రితమే పాన్ ఇండియా సినిమా చేసిన సూపర్ స్టార్


ఘట్టమనేని కృష్ణ.. జేమ్స్ బాండ్, కౌబాయ్, 70 ఎంఎం, ఈస్టమన్ కలర్ మొదలుకొని అత్యాధునిక సినిమాల వరకు ఆయన అన్ని రకాల టెక్నాలజీని ప్రేక్షకులకు పరిచయం చేశారు. పద్మాలయ స్టూడియోన్ బ్యానర్ నిర్మించి ఎన్నో అద్భుత సినిమాలను తెరకెక్కించాడు. తన సొంత బ్యానర్ లో ‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమా తీసి సంచనల విషయాన్ని అందుకున్నాడు. ఇప్పటికీ ఆ సినిమా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. దేశ చరిత్రలోనే తొలి యాక్షన్ కౌబాయ్ సినిమాగా ఈ చిత్రం నలిచింది. 1971లోనే ఈ సినిమా తెలుగు, ఇంగ్లీష్, స్పానిష్, రష్యన్, తమిళం, మలయాళం, హిందీ, బెంగాలీ భాషల్లో విడుదలై అన్ని చోట్లా అద్భుత విజయాన్ని అందుకుంది.  70 MM సినిమాను పరిచయం చేసిన నటుడు కూడా కష్ణ కావడం విశేషం. ‘సింహాసనం’ సినిమాతో ఆయన ఈ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు.   


ఏడాదికి 17 సినిమాల్లో నటించిన కృష్ణ


కృష్ణకు సినిమాల పట్ల ఎంతో అంకితభావం ఉండేది. ఏడాదికి పది సినిమాల్లో నటించే వారు. 1964 నుంచి 1995 వరకు.. ఏడాదికి 10 సినిమాలు చేసి ఏకంగా 300 సినిమాలు కంప్లీట్ చేశారు. 1972 కృష్ణ కెరీర్ లో ప్రత్యేకం అని చెప్పుకోవచ్చు. ఈ ఏడాదిలో ఆయన నటించి 17 సినిమాలు విడుదలై రికార్డు సృష్టించాయి. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఏ నటుడు ఏడాదిలో ఇన్ని సినిమాలు చేయలేదు.  నిర్మాతలు సినిమాల్లో నష్టపోతే అండగా ఉండేవారు. వారితో ఎలాంటి పారితోషికం తీసుకోకుండా సినిమాలు చేసే వారు. నిర్మాతల మేలుకోరే హీరోగా నిలిచారు కృష్ణ.


Read Also: ‘పుష్ప 2‘ అప్‌డేట్ ఇవ్వాలంటూ అభిమానుల నిరసనలు!