Ileana Valentine's day: గోవా బ్యూటీ ఇలియానా గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ‘దేవదాసు’ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ, తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత మహేష్ బాబుతో కలిసి నటించిన ‘పోకిరి’ చిత్రంతో స్టార్ హీరోయిన్ గా మారింది. అనంతరం తెలుగులో పలు సినిమాలు చేసి హాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత ఆస్ట్రేలియన్ ఫోటో గ్రాఫర్ తో ప్రేమాయాణం కొనసాగించింది. ఆ తర్వాత మరో వ్యక్తితో ప్రేమ, పెళ్లి, పిల్లలు అంటూ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది.


జీవిత భాగస్వామితో కలిసి వాలంటైన్స్ డే జరుపుకున్న ఇలియానా


తాజాగా ఈ ముద్దుగుమ్మ వాటంటైన్స్ డే సందర్భంగా తన జీవిత భాగస్వామి ఫోటోను అభిమానులతో పంచుకుంది. మైఖేల్ డోలన్‌తో కలిసి చిరునవ్వులు చిందిస్తున్న ఫోటోను ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసింది. ఈ ఫోటోలో మైఖేల్ ఇలియాను హగ్ చేసుకుంటూ కనిపించాడు. బ్లాక్ డ్రెస్ లో ఇద్దరూ అందంగా కనిపించారు. ఈ ఫోటోకు "నా తొలి నిజమైన వాలెంటైన్స్ డే’’ అని క్యాప్షన్ పెట్టింది. గత ఏడాదిగా ఇలియానా డోలన్ తో కలిసి అమెరికాలో నివాసం ఉంటుంది. ఇక గత ఏడాది ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇలియానా, తన ప్రేమ, పెళ్లి, బిడ్డ గురించి కీలక విషయాలను వెల్లడించింది. ఆయన చక్కటి వ్యక్తి అని చెప్పిన ఇలియానా, కావాలనే తనకు సంబంధించిన విషయాలను సీక్రెట్ గా ఉంచినట్లు వెల్లడించింది.   


గత ఏడాది బాబుకు జన్మనిచ్చిన ఇలియానా


ఇన ఇలియానా పెళ్లి కాకుండానే గత ఏడాది ఆగస్టు 1న పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో షేర్ చేసుకునే ఇలియానా తన ప్రెగ్నెన్సీకి కారణమైనటువంటి వ్యక్తి గురించి మాత్రం అప్పట్లో ఎలాంటి విషయాలు చెప్పలేదు. దీంతో ఆమె విపరీతమైన ట్రోలింగ్‌కి గురైంది. తరచూ బిడ్డ తండ్రి ఎవరని ప్రశ్నిస్తూ.. ఇలియానని ఇబ్బంది పెట్టారు. అయినా అవేవి పట్టించుకోని ఇలియాన అమ్మతనాన్ని అస్వాదిస్తూ తరచూ తన ప్రెగ్నెన్సీ జర్నీని సోషల్ మీడియా వేదికగా పంచుకునేది. చివరికి ట్రోలింగ్స్, విమర్శల మధ్య తన భర్తను పరిచయం చేసింది. బాబుకు ఫీనిక్స్ డోలన్ అని పేరు పెట్టినట్టు చెప్పిన ఇల్లి బేబీ తన భర్త పేరును కూడా రివీల్ చేసింది. అతడి ఫోటో షేర్ చేసి మైఖేల్ డోలన్ అని పరిచయం చేసింది. దీంతో ట్రోల్ చేసిన వారు సైతం ఇలియానాకు శుభాకాంక్షలు తెలిపారు. 


తన భర్త గురించి బయటకు ఎందుకు చెప్పలేదంటే?


అటు తన గురించి వచ్చిన ట్రోల్స్‌ పైనా ఆమె స్పందించింది. “మైఖేల్‌తో రిలేషన్‌ను  భయటపెట్టకపోవడం కారణం ఉంది. నా గత రిలేషన్, బ్రేకప్ గురించి అందరికి తెలిసిందే. ఆ తర్వాత నేను నా ప్రజెంట్ రిలేషన్, భర్త గురించి చెప్పడానికి కాస్తా భయపడ్డాను. నేను చెప్పగానే అంతా దానిపై మాట్లాడుకుంటారు. ఎవరికి తోచినట్టు వారు ఆలోచించకుని నెగిటివ్ కామెంట్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. అది నాకు ఇష్టం లేదు. నా భర్త, నా ఫ్యామిలీ గురించి చెడుగా మాట్లాడుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే మైఖేల్‌తో నా రిలేషన్‌‌ను సస్పెన్స్‌లో ఉంచా. దాని వల్ల కూడా ట్రోల్స్‌కు గురయ్యాను. కానీ ఒకే. నా రిలేషన్ మిస్టరీగా ఉంచి అందరిలో ఆసక్తి పెంచాను”అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం 'దో ఔర్ దో ప్యార్'లో నటిస్తోంది. ఈ సినిమా మార్చి 29న విడుదల కానుంది.


Read Also: ‘వార్ 2’ షూటింగ్‌కు ముహూర్తం ఫిక్స్, ఎన్టీఆర్ లేకుండానే?