స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబోలో వచ్చిన సినిమా ‘పుష్ప‘. పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు నెలకొల్పింది. ఈ సినిమాతో బన్నీకి దేశ వ్యాప్తంగా ఓ రేంజిలో క్రేజ్ లభించింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన రెండో భాగం ‘పుష్ప2’ తెరకెక్కుతోంది. ఇప్పటికే షూటింగ్ తుది దశకు చేరుకున్నది. ఈ నేపథ్యంలో బన్నీకి సంబంధించిన రెమ్యునరేషన్ గురించి నెట్టింట్లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.  


‘పుష్ప2’ కోసం బన్నీ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?


‘పుష్ప2’ కోసం అల్లు అర్జున్ తెలుగులో ఇప్పటి వరకు ఏ హీరో తీసుకోనంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గతేడాది విడుదలైన ‘పుష్ప’ అద్భుత విజయం అందుకోవడంతో, ఈ సినిమాకు రెమ్యునరేషన్ ఓ రేంజిలో పెంచినట్లు తెలుస్తోంది. ఆయనకు దేశ వ్యాప్తంగా వచ్చిన క్రేజ్ నేపథ్యంలో నిర్మాతలు కూడా భారీగా డబ్బు ముట్టజెప్పేందుకు ఓకే చెప్పారట.  'పుష్ప ది రూల్' మూవీ కోసం బన్నీ రూ. 125 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.   


రెమ్యునరేషన్ లో ప్రభాస్ ను వెనక్కి నెట్టిన బన్నీ


‘పుష్ప-2’ చిత్రాన్ని ఏకంగా రూ.350 కోట్లతో తెరకెక్కిస్తున్నారట. సుకుమార్ కూడా ఈ సినిమాకు గాను భారీగానే రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది. తొలి పార్ట్ కోసం రూ.18 కోట్లు తీసుకున్న ఆయన, రెండో భాగం కోసం రూ. 40 కోట్లు తీసుకుంటున్నారట. ఇతర ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ కు కూడా భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ఏకంగా రూ. 80 కోట్లు కేటాయించారట. ఇక బన్నీ రెమ్యునరేష్ గురించి వస్తున్న  వార్తలు నిజం అయితే, ఇప్పటి వరకు తెలుగు సినిమా పరిశ్రమలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న హీరోగా నిలవనున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియన్ మూవీ ‘ఆది పురుష్’ కోసం ఆయన రూ.120 కోట్లు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆయనను వెనక్కి నెట్టి బన్నీ ఏకంగా రూ.125 కోట్ల పారితోషకం అందుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. 


స్పెషల్ సాంగ్ కు నో చెప్పిన సమంత


ఇక ఈ సినిమాలో బన్నీకి జోడీగా రష్మిక మందన్న కంటిన్యూ అవుతోంది. అనసూయ కూడా కీలక పాత్ర పోషించనుంది. ఈ సినిమాలో సమంతను మరోసారి స్పెషల్ సాంగ్ చేయించాలని మేకర్స్ భావించినా, తన ఆరోగ్య కారణాలతో చేయలేనని చెప్పినట్లు తెలుస్తోంది. బన్నీ స్వయంగా ఆమెను అడిగినా కాదని చెప్పిందట. గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘పుష్ప’ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.  అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న నటించగా,  సమంత స్పెషల్ సాంగ్‌లో మెరిసింది. ఇప్పుడు అంతకుమించి అంచనాలతో ‘పుష్ప2’ ప్రేక్షకుల ముందుకు రానుంది.   






Read Also: లండన్‌లో మంచువారి కోడలు కొత్త బిజినెస్, లగ్జరీ స్టోర్ ఆరంభించిన విరానిక