టీమిండియాలో సక్సెస్ ఫుల్ క్రికెటర్ గా కొనసాగుతున్న శుభ్‌మాన్ గిల్ తరుచుగా వార్తల్లో నిలుస్తున్నాడు. బాలీవుడ్ నటి సారా అలీఖాన్ తో గిల్ డేటింగ్ లో ఉన్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. ఆమెతో కలిసి ఒకటి రెండు సార్లు రెస్టారెంట్లో కనిపించి ఈ వార్తలకు బలాన్ని చేకూర్చాడు. తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించిన ఆయన మీ క్రష్ ఎవరు? అనే ప్రశ్నకు షాకింగ్ విషయాన్ని చెప్పాడు. సారా అలీ ఖాన్, సారా టెండూల్కర్ మాత్రమే కాదు, సౌత్ మూవీస్ లో ఓ టాప్ హీరోయిన్ పైనా క్రష్ ఉందని వెల్లడించాడు.
అప్పుడు సారా, ఇప్పుడు రష్మిక? మాట మార్చాడా?
“మీకు ఇష్టమైన బాలీవుడ్ నటి ఎవరు?” అనే ప్రశ్నకు రష్మిక మందన్న అని చెప్పాడు. ప్రస్తుతం ఆయన కామెంట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. గత ఏడాది ఇదే ప్రశ్నకు సారా అంటూ బదులిచ్చాడు. ఆమెతో డేటింగ్ చేస్తున్నారా? అనే ప్రశ్నకు అవును, కాకపోవచ్చు అంటూ సమాధానం చెప్పాడు. తాజాగా సారాను కాదని, రష్మిక అని చెప్పాడు. అయితే, తాజాగా ఓ మీడియా సంస్థ.. అతడి తాజా క్రష్ రష్మిక మందాన్న అంటూ పెట్టిన పోస్టుపై శుభ్‌మన్ స్పందించాడు. ఎవరు ఇది నిర్ధరించారని అడిగాడు. దీంతో.. శుభ్‌మన్‌కు రష్మికపై క్రష్ ఉందా.. లేదా అని కొంతమంది అభిమానులు తలలు పట్టుకుంటున్నారు.
టీమిండియాలో టాప్ క్రికెటర్ గా కొనసాగుతున్న ఆయన సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటాడు. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ప్రాక్టీస్ ఫోటోలు, వీడియోలు అభిమానులతో పంచుకుంటాడు. అయితే, ఇంతకీ తను సారాతో ప్రేమలో ఉన్నాడా? లేదా? అనే విషయం మాత్రం తెలియడం లేదు.
‘పుష్ప’తో దేశ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించిన రష్మిక
అటు శుభ్‌మాన్ గిల్ తాజాగా కామెంట్ పై రష్మిక ఇంకా స్పందించలేదు. ‘పుష్ప’ సినిమాతో రష్మిక దేశ వ్యాప్తంగా ఓ రేంజిలో పాపులారిటీ సంపాదించుకుంది. శ్రీవల్లి పాత్రల్లో ప్రేక్షకులను బాగా అలరించింది. ప్రస్తుతం ‘పుష్ప2’లో నటిస్తోంది. తొలి పార్ట్ తో పోల్చితే రెండో భాగంలో మరింత ఆకట్టుకోనున్నట్లు తెలుస్తోంది. రష్మిక చివరి సారిగా బాలీవుడ్ లో ‘మిషన్ మజ్ను’ మూవీలో కనిపించింది. అంతకు ముందు ‘గుడ్‌బై’ సినిమా చేసింది. రష్మికతో పాటు ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, నీనా గుప్తా, ఎలి అవిరామ్, సునీల్ గ్రోవర్, సాహిల్ మెహతా, పావెల్ గులాటి నటించారు. అటు సారా అలీ ఖాన్ సైతం వరుస సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఆమె నటించిన ‘గ్యాస్ లైట్’ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘అతరంగీ రే’, ‘లవ్ ఆజ్ కల్’, ‘సింబా’, ‘కేదార్‌నాథ్’ లాంటి సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి.
Read Also: ‘చంద్రముఖి-2’లో శత్రు కీలక పాత్ర - కొత్త లుక్ కోసం మేకప్ షురూ!