కన్నడ ఇండస్ట్రీకి చెందిన రష్మిక(Rashmika).. 'ఛలో' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే హిట్ అందుకుంది. దీంతో ఆమెకి పలు సినీ అవకాశాలు వచ్చాయి. వచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటూ స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. టాలీవుడ్ లో అగ్ర హీరోల సరసన నటిస్తూ బిజీగా మారింది. 'పుష్ప' సినిమాతో నేషనల్ వైడ్ గా ఆమె పాపులర్ అయింది. ఇప్పుడు ఆమెకి బాలీవుడ్ లో కూడా అవకాశాలు వస్తున్నాయి. 


I still maintain a friendship with my exes: 'గుడ్ బై' సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటుంది రష్మిక. ఈ క్రమంలో తనకు మాజీ బాయ్‌ఫ్రెండ్స్‌ గురించి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. వీటికి బోల్డ్ గా సమాధానాలు ఇచ్చింది రష్మిక. తన మాజీ బాయ్‌ఫ్రెండ్స్‌తో తో కూడా తనకు మంచి రిలేషన్ ఉందని ప్రకటించింది రష్మిక. వారు ఎదురుపడితే పలకరించేంత చనువు అయితే ఉందని తెలిపింది. 


ఇంతకీ తన మాజీ ప్రియులు ఎంతమందో ఆమె చెప్పలేదు. మాజీ బాయ్‌ఫ్రెండ్స్‌తో పాటు వారి ఫ్యామిలీస్ తో కూడా చనువు ఉందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నారు. రష్మిక కెరీర్ ఆరంభంలో కన్నడ నటుడు రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ అయింది. తెలుగులో ఎంట్రీ ఇవ్వకముందే ఆమె పెళ్లి ఫిక్స్ అయింది. ఎంగేజ్మెంట్ కి, పెళ్లికి మధ్య ఉన్న గ్యాప్ లో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. 


ఆమె నటించిన సినిమాలు సక్సెస్ అయి.. కెరీర్ పుంజుకోవడంతో పెళ్లి వద్దనుకుంది. ఎంగేజ్మెంట్ రద్దు చేసుకుంది. దీంతో కన్నడ ఫ్యాన్స్ రష్మికపై విరుచుకుపడ్డారు. ఆమెపై దారుణమైన ట్రోలింగ్ చేశారు. రష్మిక మాత్రం ఇవేం పట్టించుకోకుండా కెరీర్ పై ఫోకస్ పెట్టింది. ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ బిజీ అయింది. 


రష్మిక అగ్రెసివ్ ప్రమోషన్స్:


రష్మిక నటించిన 'గుడ్ బై' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటుంది. ఈ సినిమా రిలీజ్ కాకుండానే ఈ బ్యూటీకి బాలీవుడ్ లో ఐదారు సినిమా అవకాశాలు వచ్చాయి.  తన క్రేజ్ ఇలానే ఉండాలంటే.. డెబ్యూ ఫిల్మ్ తో కచ్చితంగా హిట్ కొట్టాల్సిందే. అందుకే వీలైనంత ఎక్కువగా తన సినిమాను ప్రమోట్ చేస్తుంది. ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ఉన్నారు. కానీ ఆయన ప్రమోషన్స్ కు రారు. కాబట్టి ప్రమోషన్స్ బాధ్యత మొత్తం రష్మికపై పడింది. ఎన్నడూ లేని విధంగా 'గుడ్ బై' ప్రమోషన్స్ లో స్కిన్ షో చేస్తుంది రష్మిక. ఎక్కువగా షార్ట్స్, మైక్రో స్కర్ట్స్ వేసుకుంటూ కనిపిస్తుంది. ప్రస్తుతం రష్మిక 'మిషన్ మజ్ను', 'యానిమల్' వంటి సినిమాల్లో నటిస్తోంది. ఈ సినిమాలు వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. 


క్రేజీ సీక్వెల్ లో రష్మిక:
1990లో మహేష్ భట్ తీసిన 'ఆషికీ' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. దానికి సీక్వెల్ గా 2013లో 'ఆషికీ2' వచ్చింది. ఇందులో శ్రద్ధాకపూర్ నటించింది. ఈ సినిమా మరో మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా ఫ్రాంచైజీలో భాగంగా 'ఆషికీ3' రాబోతుంది. అనురాగ్ బసు దర్శకత్వంలో కార్తీక్ ఆర్యన్ హీరోగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఇందులో హీరోయిన్ గా రష్మిక పేరుని పరిశీలిస్తున్నారు. ఆమెతో పాటు దీపికా పదుకోన్, అలియా భట్ ల పేర్లు కూడా లిస్ట్ లో ఉన్నాయి. మరి వీరిని దాటుకొని రష్మిక ఛాన్స్ అందుకుంటుందేమో చూడాలి.


Also Read : వెయ్యి కోట్లు దాటే మార్కెట్ ఎట్లుంటదో చూపిస్తా: పవన్‌పై బండ్ల గణేష్ ట్వీట్


Also Read : యాక్షన్ విత్ మెసేజ్, అంతా యునైటెడ్ కింగ్‌డ‌మ్‌లో - వరుణ్ తేజ్ సినిమా డీటెయిల్స్ చెప్పిన ప్రవీణ్ సత్తారు