లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ తెలుగు సినిమా పరిశ్రమలో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. చక్కటి సినిమాలతో సినీ అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. కొద్ది సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న ఈ జంట కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతోంది. తాజాగా వీరిద్దరి నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు కొణిదెల, అల్లు కుటుంబాలు హాజరయ్యాయి. ఇద్దరు బంధువులు, మిత్రుల ఆశీర్వాదాల నడుమ ఉంగరాలు మార్చుకున్నారు. త్వరలోనే వీరిద్దరు మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి ఆస్తులు, సంపాదన గురించి కీలక విషయాలు ఇప్పుడు చూద్దాం..
లావణ్య ఆస్తుల విలువ ఎంతంటే?
లావణ్య త్రిపాఠి, సౌత్ లో పలు సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందంతో పాటు అభినయంతో అందరినీ ఆకట్టుకుంది. ఆమె తెలుగు సినీ పరిశ్రమలోకి ‘అందాల రాక్షసి’ చిత్రంతో అడుగు పెట్టింది. ఆ తర్వాత పలు హిట్ సినిమాల్లో నటించింది. లావణ్య రొమాంటిక్, కామెడీ, థ్రిల్లర్ సహా అనేక రకాల పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతేకాదు, పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. సినిమాలతో పాటు ఎండార్స్ మెంట్స్ ద్వారా బాగానే డబ్బు సంపాదిస్తోంది. 2023 నాటికి ఆమె నికర ఆస్తుల విలువ దాదాపు రూ. 10 కోట్ల వరకు ఉంటుందని అంచనా.
వరుణ్ తేజ్ సంపాదన తక్కువేం కాదు!
తెలుగు చిత్ర పరిశ్రమలోకి కొణిదెల కుటుంబం నుంచి వచ్చిన వరుణ్ తేజ్ చక్కటి టాలెంట్ తో దూసుకుపోతున్నాడు. మంచినటనతో సెలెక్టివ్ సినిమాలు చేస్తూ ముందుకెళ్తున్నాడు. తన అద్భుత నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. విమర్శకుల ప్రశంసలు పొందాడు. ‘ముకుంద’ సినిమాతో ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసిన వరుణ్, ఆ తర్వాత ’కంచె’, ‘ఫిదా’, ‘గద్దలకొండ గణేష్’ లాంటి చిత్రాల్లో పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. వరుణ్ తేజ్ నికర ఆస్తుల విలువ అతడి సినిమాలతో పాటు బ్రాండ్స్, ఎండార్స్ మెంట్స్ ద్వారా పెరిగింది. వరుణ్ తేజ్ నికర ఆస్తుల విలువ 2023 నాటికి దాదాపు రూ. 47 కోట్లు ఉన్నట్లు అంచనా.
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కలసి ‘మిస్టర్’ అనే సినిమా 2017లో విడదల అయ్యింది. 2016లో ఈ సినిమా షూటింగ్ మొదలైన నాటి నుంచే లవ్ లో పడ్డారు. ఈ సినిమా తర్వాత ‘అంతరిక్షం’ అనే సినిమాలో కూడా లావణ్య వరుణ్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య రిలేషన్ షిప్ కొనసాగుతుంది. వీరి డేటింగ్ వ్యవహారంపై వార్తలు కూడా వచ్చాయి. ఆ తర్వాత నాగబాబు ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. వరుణ్ కు ఈ ఏడాదిలోనే పెళ్లి చేస్తాం అని చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పుడు ఈ ఏడాదిలోనే వరుణ్, లావణ్యల పెళ్లి జరుగుతుందని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్. పెళ్లి ముహూర్తం ఇంకా ఖరారు చేయనప్పటికీ, ఈ ఏడాది పెళ్లి చేసుకుంటారని, అది కూడా అతి త్వరలో ఉంటుందని మెగా ఫ్యామిలీ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం వరుణ్ తేజ్ చేస్తున్న సినిమాలకు వస్తే... ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో 'గాంఢీవదారి అర్జున' సెట్స్ మీద ఉంది. ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో పాన్ ఇండియా సినిమా ఒకటి చేస్తున్నారు. ప్రస్తుతం లావణ్యా త్రిపాఠి రెండు, మూడు సినిమాలు చేస్తున్నారు.
Read Also: విజయ వర్మతో తమన్నా డేటింగ్ - అసలు విషయం చెప్పేసిన మిల్కీ బ్యూటీ