Adavi Sesh: శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన ‘హిట్’ మూవీ ఫ్రాంచైజీకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన ‘హిట్ 2’ సినిమా కూడా భారీ సక్సెస్ ను అందుకుంది. ఈ మూవీలో హీరోగా అడవి శేష్ నటించారు. తాజాగా హీరో అడవి శేష్ సోషల్ మీడియాలో ఓ బాధాకరమైన వార్తను షేర్ చేసుకున్నాడు. అదేంటంటే.. ఈ మూవీలో హీరో వెంటే ఉండి అతనికి సాయం చేసే మాక్స్(కుక్క) అందరికీ గుర్తుండే ఉంటుంది. మూవీలో దాని పాత్ర కూడా చాలా కీలకమనే చెప్పాలి. అందుకోసం మాక్స్ కు ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇచ్చారు, అది కూడా మూవీలో అంతే యాక్టివ్ గా చేసింది. ఇటీవలే మాక్స్ చనిపోయింది. ఈ విషయాన్ని శేష్ తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు.
కన్నీళ్లు ఆగలేదు: అడవి శేష్
‘హిట్ 2’ సినిమాలో హీరో అడవి శేష్ కు ఇన్వెస్టిగేషన్ లో హెల్ప్ చేస్తూ యాక్టీవ్ గా చేసింది మాక్స్(కుక్క). అలాంటి టాలెంటెడ్ డాగ్ చనిపోవడంతో హీరో అడవి శేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మేరకు మాక్స్ గురించి ఓ పోస్ట్ ను షేర్ చేశాడు శేష్. ‘‘తీవ్రమైన జ్వరం వలన మాక్స్ కన్నుమూసిందని మీకు చెప్పడానికి బాధపడుతున్నాను. ఈ డాగ్ ‘హిట్ 2’ సినిమాలో మాక్స్ పాత్రలో కనిపించింది. మేము మాక్స్ ను ఆసుపత్రిలో చూసినపుడు కోలుకుంటుందని అనుకున్నాము. కానీ అది పరిస్థితి విషమించి చనిపోయింది. ఇది రాస్తున్నపుడు కన్నీళ్లు ఆగడం లేదు. కష్టతరమైన షూటింగ్ సమయాల్లో కూడా మాకు సహకరించినందుకు ధన్యావాదాలు’’ అంటూ ఎమోషనల్ నోట్ ను రాసుకొచ్చాడు శేష్.
అలాంటి డాగ్ ను ఇప్పటి వరకూ చూడలేదు: శైలేష్ కొలను
‘హిట్ 2’ సినిమాలో మాక్స్ కు ప్రత్యేకమైన రోల్ ఇచ్చాడు దర్శకుడు. ప్రమోషన్స్ లో కూడా మాక్స్ ను పరిచయం చేశారు. స్టేజీపై దానితో చాలా మంది ఫోటోలు కూడా దిగారు. తాజాగా మాక్స్ చనిపోయిన విషయాన్ని దర్శకుడు శైలేష్ తెలిపాడు. ఈ మేరకు ఓ పోస్ట చేశాడు. అందులో ఇలా రాసుకొచ్చాడు.. ‘‘మీకు ఓ బాధాకరమైన వార్తను చెప్పాలనుకుంటున్నాను. మనందరికీ ఎంతో ఇష్టమైన మాక్స్ ఇప్పుడు లేదు. అది చనిపోయింది. గత పది రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ నరకం చూసింది. ఇప్పుడు అది చనిపోయింది. అది స్పెషల్ బ్రీడ్ అయినా ఇప్పటి వరకూ నా జీవితంలో అలాంటి డాగ్ ను చూడలేదు. అది లేకపోతే ‘హిట్ 2’ ఉండేది కాదు. దాని కోసం ప్రార్థించిన అందరికీ థ్యాంక్స్. మాక్స్ ను మిస్ అవుతున్నాను’’ అంటూ రాసుకొచ్చాడు శైలేష్.
మాక్స్ మృతి బాధాకరం: కోమలి ప్రసాద్
‘హిట్ 2’ లో యాక్టీవ్ గా కనిపించిన మాక్స్(కుక్క) మృతి చెందడం పట్ల మూవీ టీమ్ ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా మూవీలో వర్ష పాత్రలో కనిపించిన నటి కోమలీ ప్రసాద్ మాక్స్ మృతి పట్ల స్పందించింది. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఓ పోస్ట్ చేసింది. మాక్స్ చనిపోవడం చాలా బాధాకరమని అంది. సెట్స్ లో ఎక్కువ సేపు మాక్స్ తోనే సరదాగా గడిపేదాన్నని గుర్తుచేసుకుంది. మాక్స్ లేకుండా వర్ష పాత్ర లేదని పేర్కొంది. మా జీవితాల్లోకి వచ్చినందుకు మాక్స్ కు ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేసింది కోమలీ ప్రసాద్. ఇక ఈ వార్త చూసి నెటిజన్స్ కూడా ‘అలాంటి టాలెంటెడ్ డాగ్ చనిపోవడం బాధాకరం’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Also Read: తొడగొట్టిన ‘బేబీ’ నిర్మాత ఎస్కేఎన్ - ట్రోల్ చేస్తోన్న నెటిజన్స్!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial