సరికొత్త కథలతో సినిమాలు చేయడంలో ముందుంటారు యంగ్ హీరో శ్రీ విష్ణు. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం 'సామజవరగమన'. రామ్ అబ్బరాజు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.  బిగిల్ సినిమాలో ఈవ్ టీజింగ్ బాధితురాలిగా నటించిన రెబా జాన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను హాస్య మూవీస్‌ బ్యానర్‌పై రాజేష్ దండ నిర్మిస్తున్నారు. ఈ సినిమా సమ్మర్ కానుకగా మే 18న విడుదల కానుంది.


ఫుల్ ఫన్నీగా 'సామజవరగమన' టీజర్


ఈ నేపథ్యంలో 'సామజవరగమన' సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు మొలయ్యాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, గ్లిప్స్, పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా విడుదలైన టీజర్ సినిమాపై ఓ రేంజిలో అంచనాలను పెంచేసింది. టీజర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కామెడీతో నిండిపోయింది. శ్రీవిష్ణు పంచులకు ప్రేక్షకులు పడిపడి నవ్వుకుంటున్నారు. ప్రేమించిన అమ్మాయిలతో హీరో రాఖీ కట్టించుకోవడం చాలా ఫన్నీగా అనిపిస్తుంది. అమ్మాయిల మీద ప్రేమ కలగకపోవడానికి గల కారణం చెప్పిన నవ్విస్తారు. ఇప్పటికే విడుదలైన 'సామజవరగమన' గ్లింప్స్ సైతం బాగా ఆకట్టుకుంది. ప్రేమించుకున్న ప్రతి ఒక్కరికీ కాస్ట్ ప్రాబ్లమ్స్, లేదా మనీ ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ నాకేంటి ఈ సమస్య వచ్చింది అంటూ శ్రీవిష్ణు చెప్పే డైలాగ్ అందరినీ ఆకట్టుకుంది. టీజర్ చూసిన ప్రతి ఒక్కరు ఈ దెబ్బతో శ్రీవిష్ణు ఖాతాలో మంచి హిట్ పడటం ఖాయం అంటున్నారు. ఈ సినిమాలో వెన్నెల కిశోర్ .. నరేశ్ .. శ్రీకాంత్ అయ్యంగార్ ముఖ్యమైన పాత్రలను పోషించారు.



ఆకట్టుకుంటున్న లిరికల్ సాంగ్


అంతేకాదు, ఈ సినిమాకు సంబంధించి  విడుదలైన లిరికల్ సాంగ్ ను కూడా సినీ అభిమానులను అలరించింది. 'ఏం బోర్ కొట్టిందో' అంటూ సాగే ఈ పాటలో  హీరో మందుకొట్టి  ఫ్రెండ్స్ తో కలిసి చిందులేస్తూ కనిపిస్తాడు. గోపీసుందర్ స్వరపరిచిన ఈ పాటకి శ్రీమణి సాహిత్యాన్ని అందించారు. జెస్సీ గిఫ్ట్ ఈ పాటను పాడారు.   



'రాజ రాజ చోర' తర్వాత నో హిట్


నిజానికి శ్రీవిష్ణు ఇప్పటి వరకు 10 సినిమాలు చేశారు. అందులో ముచ్చటగా మూడు సినిమాలు మాత్రమే సక్సెస్ అయ్యాయి. మిగతా సినిమాలన్నీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయ్యాయి. ఒకప్పుడు ఈయనతో సినిమా చేస్తే మినిమం హిట్ గ్యారెంటీ అనుకునే వారు దర్శకనిర్మాతలు, కానీ ఆ తర్వాత పూర్తిగా ఫ్లాప్ సినిమాలు చేయడంతో తెరమరుగు కావడం ఖాయం అనుకున్నారు. కానీ, మళ్లీ 'సామజవరగమన' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. 'రాజ రాజ చోర' మూవీ తర్వాత శ్రీవిష్ణుకి ఇంతవరకూ హిట్ దక్కలేదు. ఈ సినిమాతో ఆయన ఆశ నెరవేరుతుందేమో చూడాలి.






Read Also: భార్యను తమిళంలో మాట్లాడాలన్న రెహమాన్, నెటిజన్లు ఆగ్రహం - అందులో తప్పేముంది?