Heart of Stone trailer: హాలీవుడ్ దర్శకుడు టామ్ హార్పర్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘హార్ట్ ఆఫ్ స్టోన్’. ఈ మూవీలో గ్యాల్ గ్యాడట్, జామీ డోర్నాన్, సోఫీ ఒకొనెడో, మాథియాస్, జింగ్ లూసి, పాల్ రెడీతో పాటు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ కూడా మూవీలో నటించింది. ఈ మూవీలో విలన్ పాత్రలో అలియా తొలిసారి హాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్దమైంది. ప్రస్తుతం మూవీ టీమ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. తాజాగా మూవీకు సంబంధిచిన ట్రైలర్ ను బ్రెజిల్ లో విడుదల చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో అలియా భట్ కూడా పాల్గొంది.
యాక్షన్ సన్నివేశాలతో ఆక్టుకుంటోన్న ట్రైలర్..
తాజాగా ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. దేశాన్ని ప్రమాదాల నుంచి రక్షించడానికి ఒక రహస్య గూఢచర్య టీమ్ ‘చార్టర్’ అనే పేరుతో పనిచేస్తుంది. ఈ టీమ్ ను గాల్ గాటోడ్ లీడ్ చేస్తుంది. ఇందులో ఆమె రాచెల్ స్టోన్ గా కనిపించింది. వీరంతా దేశం కుప్పకూలిపోయినపుడు పరిస్థితుల్ని ఈ టీమ్ ఆధీనంలోకి తీసుకుంటుంది. వీరికి ఎలాంటి ఎమోషన్స్, పొలిటికల్ ఎజెండాలు ఉండవు కేవలం దేశాన్ని కాపాడటం కోసమే ఈ మిషన్ పనిచేస్తుందని ట్రైలర్ లో చూపించారు. అయితే మూవీలో ప్రతి ఒక్కరు ‘ది హార్ట్’ అని పిలిచే ఒక మాక్ గఫిన్ కోసం వెతుకుతున్నట్టు కనిపిస్తోంది. ఇది ‘చార్టర్’ మిషన్ కు బూస్ట్ ఇచ్చే పరికరం లాంటింది. ‘ది హార్ట్’ కోసం రెండు వర్గాలు పోటీ పడతున్నట్లు తెలుస్తోంది. ఇంకా ట్రైలర్ లో భారీ యాక్షన్ సన్నివేశాలు, గన్ ఫైట్లు ఇలా ట్రైలర్ మొత్తం ఉత్కంఠగా సాగింది.
విలన్ గా అదరగొట్టిన అలియా భట్..
ఈ మూవీలో అలియా భట్ కూడా నటించింది. ట్రైలర్ చూస్తుంటే ఆమె ఇందులో విలన్ పాత్రలో చేస్తున్నట్టు కనిపించింది. ట్రెలర్ రెండు, మూడు చోట్ల అలియా కనిపించింది. ఆమె ఈ మూవీలో విలన్ గా మంచి లీడ్ రోల్ లోనే చేస్తున్నట్లు తెలుస్తోంది. అలియా యాక్షన్ సన్నివేశాలు, డైలాగ్ లు కూడా చాలా స్ట్రాంగ్ గానే కనిపిస్తున్నాయి. మరి మూవీలో ఆమె పాత్ర ఎలా ఉండబోతోంది? ఎంత నిడివి ఉంటుంది అనేది తెలియాలి. ఇది అలియాకు తొలి హాలీవుడ్ సినిమా. ఈ సినిమా ఆమెకు చాలా ప్రత్యేకం. దీని బట్టే అలియా హాలీవుడ్ కెరీర్ ఆధారపడి ఉంటుంది. మరి హాలీవుడ్ ప్రేక్షకులు అలియాను ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
ప్రెగ్నెన్సీ సమయంలో మూవీ షూటింగ్..
అలియా భట్ నటించిన హాలీవుడ్ మూవీ కోసం ఆమె అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అలియాకు కూడా ఈ మూవీ ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు ఈ మూవీ షూటింగ్ జరిగింది. గర్భధారణ సమయంలో కూడా అలియా షూటింగ్ లో పాల్గొంది. అలాగే సినిమా పూర్తైన తర్వాత మూవీ ప్రమోషన్స్ లో కూడా అలియా చురుగ్గా పాల్గొంది. పలు దేశాల్లో ప్రమోషన్స్ ప్రోగ్రాంలో కనిపించింది. అలాగే బ్రెజిల్ లో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లోనూ అలియా పాల్గొంది. ఇది ఆమె తొలి హాలీవుడ్ సినిమా కాబట్టి మూవీ రిజల్ట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది అలియా. ఇక ఈ మూవీను భారీ బడ్జెట్తో తెరకెక్కించారు. ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ చిత్రం ఆగస్టు 11వ తేదీన నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.