శ్రుతి హాసన్ 2000 సంవత్సరంలో  తన తండ్రి కమల్ హాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన “హే రాం” సినిమాతో బాలనటిగా వెండితెరపై మెరిసింది. ఆ తర్వాత మల్టీ టాలెంట్స్ తో మెప్పించిన బ్యూటీ  2008లో “లక్” సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. లక్ పెద్దగా కలసిరాలేదు.  2011లో సిద్దార్థ్ హీరోగా నటించిన “అనగనగా ఓ ధీరుడు” సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఆ సినిమా కూడా పెద్దగా కలసి రాలేదు. ఆ తర్వాత నటించిన సినిమాలు కూడా హిట్ కాకపోవడంతో అమ్మడు ఐరెన్ లెగ్ అనేశారు. ఇక హీరోయిన్ గా శ్రుతి కెరీర్ కష్టమే అనుకున్న సమయంలో పవన్ కళ్యాణ్-హరీశ్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన 'గబ్బర్ సింగ్' లో ఛాన్స్ వచ్చింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో అప్పటి నుంచి ఐరెన్ లెగ్ కాస్తా గోల్డెన్ లెగ్ గా టర్న్ అయింది. అప్పటి నుంచి శ్రుతి నటించిన సినిమాలన్నీ దాదాపు హిట్టే. కోలీవుడ్ లో శ్రుతి ఫస్ట్ హిట్ ధనుష్ హీరోగా నటించిన '3' సినిమా. ఆ తర్వాత మహేష్ బాబుతో 'శ్రీమంతుడు', జూనియర్ ఎన్.టి.ఆర్. తో 'రామయ్యా వస్తావయ్యా', రవితేజ సరసన 'బలుపు', అల్లు అర్జున్ తో 'రేసుగుర్రం' ఇలా వరుస ఆఫర్స్ , వరుస హిట్స్ అందుకుంది. 


 'కాటమరాయుడు' సినిమా తర్వాత కూడా శ్రుతి కెరీర్ కి బ్రేక్ పడిందనుకున్నారు కానీ ' క్రాక్', 'వకీల్ సాబ్' సినిమాలతో రెట్టించిన ఉత్సాహంతో దూసుకొచ్చింది.  ఇప్పుడు గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో బాల‌కృష్ణ స‌ర‌స‌న తొలిసారి న‌టిస్తోంది.  ప్ర‌భాస్ 'స‌లార్' లోనూ హీరోయిన్ గా నటిస్తోంది. నటిగానే కాదు సింగర్ గానూ సత్తాచాటుకుంది. తండ్రి నటించిన‘ఈనాడు’ సినిమాకు ప్రచార గీతంలో గళం విప్పిన శ్రుతి ఆ తర్వాత 'ఓ మై ఫ్రెండ్', 'త్రీ', 'రేసుగుర్రం', 'ఆగడు'  సినిమాల్లో పాటలు పాడి అలరించింది. కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్ కు కంపోజర్ గానూ పనిచేసింది. ఉత్తమ తెలుగు నూతన నటి గా దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డును సొంతం చేసుకుంది. ఏ. ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో సూర్య సరసన నటించిన 7వ సెన్స్ సినిమాలో నటించిన శ్రుతి బెస్ట్ తమిళ హీరోయిన్ గా మళ్ళీ దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డు సొంతం చేసుకుంది.






కెరీర్ పరంగానే కాకుండా వ్యక్తిగతంగానూ వార్తల్లో నిలుస్తుంటుంది శ్రుతిహాసన్. అప్పట్లో హీరో సిద్ధార్థ్ తో ప్రేమాయణం సాగించింది. తరువాత మైఖేల్ కోర్సేల్ అనే విదేశీ నటునితో డేటింగ్ చేసి బ్రేకప్ చెప్పింది. ఏదేమైనా శ్రుతిహాసన్ రూటే సెపరేట్...హ్యాపీ బర్త్ డే శ్రుతి....


Also Read:  సంతోషంలో జగతి, మహేంద్ర.. వసుపై రిషి స్పెషల్ కేర్.. గుప్పెడంతమనసు శుక్రవారం ఎపిసోడ్
Also Read:  శౌర్యకి ట్రీట్మెంట్, రుద్రాణికి చెక్.. సౌందర్య రీఎంట్రీతో తాడికొండ ఎపిసోడ్ ముగుస్తుందా.. కార్తీకదీపం శుక్రవారం ఎపిసోడ్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి