పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన సినిమా 'భీమ్లానాయక్'. సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేసిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించారు. త్రివిక్రమ్ ఈ సినిమాకి మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. ఈ సినిమాలో నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. ఈరోజే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అన్ని ప్రాంతాల నుంచి సినిమాకి పాజిటివ్ టాక్ వస్తోంది. 


మలయాళంలో సూపర్ హిట్ అయిన 'అయ్యప్పనుమ్ కోశియుమ్' సినిమాకి రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా నటించగా.. రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ గా రానా కనిపించారు. వీరిద్దరి మధ్య పవర్ ఫుల్ డైలాగ్స్, ఫైట్స్, యాక్షన్ సన్నివేశాలు ఓ రేంజ్ లో ఓ రేంజ్ లో ఉన్నాయి. దీంతో సినిమాకి సూపర్ హిట్ టాక్ వచ్చింది. హైదరాబాద్ లో తెల్లవారుజామున ప్రదర్శించిన ప్రీమియర్ షోని చూసిన దర్శకుడు హరీష్ శంకర్ 'భీమ్లానాయక్'కి తన స్టైల్ లో రివ్యూ ఇచ్చారు. 


''చాలాకాలం తరువాత పవన్ కళ్యాణ్ రోరింగ్ పెర్ఫార్మన్స్ చూశాం. గొప్ప పనితీరు కనబరిచిన దర్శకుడు సాగర్ కె చంద్ర, త్రివిక్రమ్, నిర్మాత నాగవంశీలకు అభినందనలు. తమన్ కెరీర్ బెస్ట్ వర్జ్ ఇదే. ప్రతి సన్నివేశాన్ని ఎంతో ఎంజాయ్ చేశారు. ఒక సన్నివేశాన్ని తమన్ చాలా బాగా అర్ధం చేసుకుంటాడు. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి బ్యాక్ బోన్. ఇక చివిరిగా రానా గురించి చెప్పుకోవాలి. నేను ఈ సినిమాలో రానాని చూడలేదు. డానియల్ శేఖర్ ని మాత్రమే చూశాను. అంత అద్భుతంగా నటించాడు. ఈ సినిమా చూసిన తరువాత 'రానా నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ' అని మాత్రమే చెప్పాలనుంది'' అంటూ రాసుకొచ్చారు.