Happy Birthday Kim Taehyung : కిమ్ టేహ్యూంగ్ అంటే ఎక్కువ మందికి తెలిసిన BTS V అంటే మాత్రం రీచ్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇతను కూడా BTS మ్యూజిక్ బ్యాండ్‌లోనే ప్రముఖ సభ్యుడు కాబట్టి. డిసెంబర్ 30వ తేదీన ఆయన తన పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. అయితే ప్రస్తుతం V సౌత్ కొరియా దేశం కోసం మిలటరీ సేవలో ఉన్నాడు. అతని పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అతని అభిమానులు, సెలబ్రెటీలు సోషల్ మీడియా వేదికగా విషెష్ చెప్తున్నారు.
BTS Vకి ప్రపంచ వ్యాప్తంగా ఎందరో డైహార్డ్ అభిమానులు ఉన్నారు. అయితే ఇతను ఓ రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి. అనుకోకుండా జరిగిన ఓ ఘటన.. అతనిని ఇప్పుడు ప్రపంచంలోనే కె-పాప్ సింగర్‌గానే కాకుండా ''మోస్ట్ హ్యాండ్సమ్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ 2024''గా నిలబెట్టింది. ఇంతకీ ఆ ఘటన ఏంటి? అతని నెట్ వర్త్ ఎంత? అతని లైఫ్ జర్నీ ఫ్యాన్స్‌కి ఎలాంటి స్ఫూర్తినిస్తుందో ఇప్పుడు చూసేద్దాం.
కెరీర్‌ను మలుపుతిప్పిన సంఘటన..
రైతు ఫ్యామిలీకి చెందిన కిమ్ టేహ్యూంగ్.. తన గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరిగాడు. చదువుకుంటూ సాయంత్రం తన అమ్మమ్మతో కలిసి వ్యవసాయం చేసేవాడు. అయితే తన 13 ఏళ్ల వయసులో ఓ ఫ్రెండ్‌తో కలిసి బీటీఎస్ నిర్వహిస్తోన్న ఆడిషన్స్‌కి తోడుగా వెళ్లాడు. కానీ అతని ఫ్రెండ్ దానిలో సెలక్ట్ కాలేదు. సరదాగా ట్రై చేసిన కిమ్ టేహ్యూంగ్ సెలక్ట్ అయి.. BTS Vగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
BTS V ఫ్యామిలీ
కిమ్ టేహ్యూంగ్ డిసెంబర్ 30, 1995లో సౌత్ కొరియాలోని సియో జిల్లాలో జన్మించాడు. ఇతనికి ఓ చెల్లి, తమ్ముడు ఉన్నారు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అతను తన అమ్మమ్మ దగ్గరే పెరిగాడు. ఆమెతో తన బాండింగ్‌ను చాలాసార్లు గుర్తు చేసుకున్నాడు V. కెరీర్లో సక్సెస్ అవుతున్న సమయంలో.. ఇతను ఓ కాన్సెర్ట్‌లో ఉండగా అమ్మమ్మ చనిపోవడంతో డిప్రెషన్లోకి వెళ్లాడు కిమ్.
BTS ఫ్యామిలీ..
BTS మెంబర్స్‌లో మఖానే లైన్లో V ఒకడు. BTSలోని మిగిలిన ఆరుగురితో అతనికి మంచి బాండింగ్ ఉంది. ముఖ్యంగా జిమిన్, జంగ్కూక్తో చాలా క్లోజ్‌గా ఉంటాడు వి. మిగిలిన నలుగురు సభ్యులు మాత్రం మాఖానే లైన్‌ని కేర్ తీసుకుంటూ ఉంటారు. BTSలోనే కాకుండా V ప్రైవేట్‌గా కూడా కొన్ని సాంగ్స్ చేశాడు. అవి కూడా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపుని తెచ్చాయి. అంతేకాకుండా అతని ఖాతాలో మరిన్ని రికార్డ్స్ తీసుకొచ్చాయి.
V నెట్‌వర్త్ ఎంతంటే..
సౌత్ కొరియా మార్నింగ్ పోస్ట్ ప్రకారం 2021లో V నికర విలువ సుమారు USD 20 మిలియన్లు. అంటే 164 కోట్ల రూపాయలతో ఉన్నాడు. అనంతరం అతని బ్రాండ్ వాల్యూ మరింత పెరిగింది. తాజా నివేదిక ప్రకారం కిమ్ టేహ్యుంగ్ నెట్ వర్త్ దాదాపు USD 40 మిలియన్లుగా మారింది. 328 కోట్ల నెట్‌వర్త్‌తో ఉన్నాడు V.
ప్రస్తుతం ఏమి చేస్తున్నాడంటే..
బీటీఎస్ మెంబర్స్ ప్రస్తుతం సౌత్ కొరియా మిలటరీలో ఉన్నారు. ఇప్పటికే జిన్, జే హోప్ తమ మిలటరీ సర్వీస్‌ని ముగించుకుని రీసెంట్గా బయటకి వచ్చారు. జంగ్ కూక్, ఆర్ఎమ్, జిమిన్, వి, సుగా ఇంకా మిలటరీ సేవలను కొనసాగిస్తున్నారు. 2025 నాటికల్లా అందరూ తమ సర్వీస్ నుంచి బయటకి రానున్నారు.
Also Read : Most Handsome Man in the Worldగా ఎన్నికైనా BTS V.. కిమ్ టేహ్యూంగ్ తర్వాత లిస్ట్‌లో ఉన్నది ఎవరంటే