గుప్పెడంత మనసు శుక్రవారం ఎపిసోడ్  ( Guppedantha Manasu  October 7th Today Episode 575)


అప్పటి వరకూ ప్రేమగా మాట్లాడుకున్న రిషి వసుధార మధ్య జగతి టాపిక్ రాగనే కోపంగా లేచెళ్లిపోతాడు రిషి. ఇంతలో గౌతమ్ కారు తీసుకొచ్చి రా కూర్చో అంటాడు. వసుధార నుంచి కాల్ రావడంతో గౌతమ్ ఇబ్బందిగా లిఫ్ట్ చేస్తాడు..ఫోన్ లాక్కున్న రిషి ఏంటిది అనేసి కాల్ కట్ చేస్తాడు. నువ్వు నడుచుకుంటూ రావడం ఏంటి నేను కారులో రావడం ఏంటని గౌతమ్ అడిగితే రిషి చిరాకు పడతాడు.గౌతమ్ సైలెంట్ గా ఉండిపోతాడు.


ఇంటికి చేరుకున్న రిషి..వసుధార గురించి ఆలోచిస్తుంటాడు. మరోవైపు మహేంద్ర కూడా అదే ఆలోచనలో ఉంటాడు. రిషి వసుని ఒప్పించమంటున్నాడు, వదిన రిషిని ఒప్పించమంటోంది..అసలేంటీ సమస్యకు పరిష్కారం అని అనుకుంటాడు. ఇంతలో రిషి వస్తాడు..
రిషి: ఇక్కడ కూర్చున్నారేంటి..
మహేంద్ర:నిద్రపోవాలని ఉంది..అన్నీ మర్చిపోయి ఓ రోజంతా తనివితీరా నిద్రపోవాలని ఉంది.కళ్లు మూసుకుంటే ఎన్నో ప్రశ్నలు ఎదురు ప్రశ్నలు వేస్తున్నాయి..
రిషి: ఇది నా వల్లనా
మహేంద్ర: మన వల్లనా అనుకోవాలి
రిషి: నేను ఏమైనా తప్పుగా ఆలోచిస్తున్నానా..మొండితనంగా ప్రవర్తిస్తున్నానా..
మహేంద్ర: ప్రకృతికి ఓ ధర్మం ఉంటుంది..దానికి విరుద్ధంగా వెళ్లకూడదు. ప్రవాహ దిశను మార్చాలని చూస్తున్నావ్ అందుకే నువ్వు బాధపడుతున్నావ్
రిషి: నేను వసుధారోత బంధం వదులుకోవాలి అనుకోవడం లేదు కానీ తనే..
మహేంద్ర: బంధం పరిమళం లాంటిది..ఒక్కోసారి నువ్వొద్దన్నా అది నిన్ను వీడిపోలేదు. ఇప్పుడు నేను జగతిని వదులుకోగలనా..నేను జగతిని వదులుకోలేను, నువ్వు వసుధారని వదులుకోలేవు
రిషి: మనం ఇద్దరం ఉన్నప్పుడే బావుండేవారం..మీకు నాకు మధ్య మేడం వచ్చింది
మహేంద్ర: నీకు నాకు మధ్య వసుధార వచ్చింది... సమస్య వ్యక్తులు రావడం వల్ల కాదు..మన ఆలోచనలో పరిణితి ఉండాలి
తండ్రి ఒళ్లో తలపెట్టి పడుకుంటాడు రిషి..మనిషి కష్టాలకు కోరికలే మూలం అంటూ చిన్న క్లాస్ వేస్తాడు మహేంద్ర. చెప్పినంత ఈజీకాదు కొన్ని పాటించడం అని రిప్లై ఇస్తాడు రిషి... తండ్రీ కొడుకులను దూరం నుంచి చూస్తుంటుంది జగతి...


Also Read: కార్తీకదీపంలోకి కొత్త క్యారెక్టర్ ఎంట్రీ, దీపని ఫాలో అవుతున్న డాక్టర్ బాబు


మర్నాడు ఆటోలో వెళుతూ టూ వీలర్ పై తిరగొద్దు అన్న మాటలు గుర్తుచేసుకుంటుంది. నేను చెబితే వినరు కానీ మీరు చెప్పగానే నేను వింటాను అనుకుంటుంది. నన్ను పొగరు అంటారు కానీ ఆ పేరులో కూడా మీ ప్రేమ కనిపిస్తుంది అనుకునేలోగా ఆటోడ్రైవర్ కి కాల్ వస్తుంది. ఆటో పక్కన ఆపి మాట్లాడండి..డ్రైవింగ్ చేస్తూ వద్దంటుంది. ఆటో పక్కన ఆపి తన బిడ్డతో మాట్లాడుతాడు డ్రైవర్.మీ అమ్మాయా అని వసు అడిగితే..బొమ్మల కొలువు పెట్టాలని అల్లరి చేస్తోందని చెబుతాడు. నేనే బొమ్మలు తయారు చేస్తానని చెబుతాడు... వసు తన తల్లిని గుర్తుచేసుకుంటుంది. వాళ్లు నన్ను మర్చిపోయారో ఏంటో..అందరూ ఎలా ఉన్నారో అనుకుంటుంది...


కాలేజీలోచెట్టుకింద వసు ఓవైపు రిషి మరోవైపు కూర్చుంటారు..ఒకర్నొకరు చూసుకోరు. కాలేజీ అంతా సందడిగా ఉండేది ఇప్పుడు ఖాళీగా ఉంది కాలేజీ అంతా నాదే..కాలేజీలో నేను ఒక్కదాన్నే అనుకుంటుంది. అటురిషి కూడా వసుతో కాలేజీలో జరిగిన సంఘటనలు గుర్తుచేసుకుంటాడు. నన్ను నేను మర్చిపోయేలా చేశావ్..ప్రతి ఆలోచనలో నువ్వే నిండిపోయావ్.. ఇప్పుడు రిషి అంటే వసుధార..కానీ ఒకే విషయంలో ఇబ్బంది పెడుతున్నావ్ అనుకునేలోగా... మరోవైపు కూర్చున్న వసు చేతిలో ఉన్న రంగు బాటిల్ కిందపడుతుంది. ఆ శబ్ధం విని రిషి వసుని చూస్తాడు.
రిషి: ఏంచేస్తున్నావ్ ఇక్కడ
వసు: ఈ బొమ్మల్ని డెకరేట్ చేస్తున్నాను.. పండుగలకుబొమ్మల్ని డెకరేట్ చేస్తారు కదా వాటికోసం రాజు రాణి బొమ్మల్ని తెచ్చుకున్నా. దసరా,దీపావళికి బొమ్మల కొలువు పెట్టుకుంటే బావుంటుంది..
రిషి: నేను కూడా హెల్ప్ చేయనా
వసు: మీకిది రాదు తర్వాత నేర్పిస్తానంటుంది
ఇటు రా అని వసు చేతిలో బొమ్మలు తీసుకుంటాడు... రాజు రాణి బొమ్మలు పక్కపక్కనే ఉండాలని వసు అంటే మరి సైన్యం ఏరి అని రిషి అడిగితే..మీరే నా సైన్యం అంటుంది. నిన్నటి రిపోర్ట్ సబ్ మిట్ చేయనా అని వసు ...వెంటనే వెళ్లిపోతావా అని రిషి అంటాడు.
వసు: మనల్ని కలిపిన ఈ కాలేజీ అంటే చాలా ఇష్టం..ఇంత మంచి వాతావరణంలో ఏదైనా మంచి పాట పాడొచ్చుకదా
రిషి: గౌతమ్ కి కాల్ చేసి ఆర్కెస్ట్రాని పంపించమను..అసలు విషయాన్ని వదిలేసి మనం ఏవేవే మాట్లాడుకుంటున్నాం...
వసు:అసలు విషయం ఏంటి..
రిషి: మన ఇద్దరి మధ్యా చిన్న అడ్డుతెర ఉంది దాన్ని నువ్వు తొలగిస్తావని చూస్తున్నా
వసు: నా ఆలోచనలు తప్పు అనిపించవచ్చుకానీ కాస్త సహనంగా ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది
రిషి: నా వైపునుంచి ఎందుకు ఆలోచించవు..ఓ చిన్న విషయాన్నిపట్టుకుని ఎందుకింత మొండిపట్టు పడుతున్నావ్.. నేను బంధాలకు,ప్రేమకు విలువఇస్తున్నారు
వసు: అమ్మను అమ్మా అని పిలవడానికి మీకు ఎందుకింత..
రిషి: నా మనసులో ఉన్నది పదే పదే చెబుతూనే ఉన్నాను..నీకుఅర్థం కావడం లేదంటూ కోపంగా వెళ్లిపోతాడు..
సైట్ విజిటింగ్ రిపోర్ట్ అని వసు అడిగితే..జగతి మేడంకి ఇచ్చేసి వెళ్లు అనేస్తాడు...మీరుజగతి మేడంని అమ్మా అని పిలుస్తారు... పిలిచేలా చేస్తాను 
కోపంగా లోపలకు వెళ్లిన రిషి..వసుపై అనవసరంగా అరిచాను ఫీలైందేమో కానీ నాకోపంలో న్యాయం ఉంది..వసుధార నన్ను అర్థం చేసుకోవడం లేదు అనుకుంటాడు... అప్పుడు వసు వీడియో ఓపెన్ చేసి చూసుకుంటూ నవ్వుకుంటాడు... ఆ వెనుకే వసుధార వెళ్లి ఫోన్ లాక్కునేందుకు ప్రయత్నిస్తుంది... మళ్లీటామ్ అండ్ జెర్రీ వార్ స్టార్ట్...


Also Read: అప్పుడే ప్రేమ అంతలోనే కోపం, రిషిధార గమ్యం ఏంటో మరి!