గుప్పెడంత మనసు బుధవారం ఎపిసోడ్  ( Guppedantha Manasu  October 5th Today Episode 573)


మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ వర్క్ లో భాగంగా విలేజ్ విజిట్ కి వెళ్లిన రిషి-వసుధార ఓ పొలం దగ్గర కూర్చుంటారు. లోకల్ వాళ్లు జామకాయలు తీసుకొచ్చి ఇవ్వడంతో..ఇప్పుడు జామకాయ పుట్టుపూర్వోత్తరాలు స్టార్ట్ చేస్తావా అని సెటైర్ వేస్తాడు రిషి. కారం పెట్టిన జామకాయ తిన్నప్పుడు నోరు మండినా ఆ టేస్టే వేరంటూ క్లాస్ మొదలెడుతుంది...ఆ తర్వాత ఇద్దరూ బయలుదేరుతారు.
రిషి:టూ వీలర్ తిరిగి ఇచ్చెయ్..నువ్వు ఎలా నడుపుతావో అనే టెన్షన్ ఉందంటాడు..
వసు: ఆటోలో తిరిగే కన్నా ఇదే బెటర్ సార్..నాకు అలవాటే పర్వాలేదు
రిషి: నా కార్లు నీకార్లు కావా...
వసు: ఇద్దరం ఒక్కటవలేదు కదా..
వసు మాట పూర్తవకుండానే కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు రిషి..వసు బండిపై బయలుదేరుతుండగా రిషి ఎదురుగా నిల్చుని ఉంటాడు. కారు టైర్ పంచరైంది లిఫ్ట్ కావాలని అడుగుతాడు. పంచరైందా..కొంపతీసి అని సాగదీస్తుంది వసు..  నాకేం పంచర్ చేసే అలవాటు లేదంటాడు రిషి.. ఆ తర్వాత ఇద్దరూ బండిపై బయలుదేరుతారు. వసు డ్రైవ్‌ చేస్తుంటే రిషి రివర్స్ లో కూర్చుంటాడు..నాకేం బాలేదని రిషి అంటే..ఎప్పుడూ మీరే డ్రైవ్ చేస్తారా..అందుకే నేను బండి నడుపుతున్నా. రిషి రివర్స్ లో కూర్చోవడం చూసి రోడ్డుపక్కన అంతా నవ్వడంతో తాను డ్రైవింగ్ చేస్తానని తీసుకుంటాడు రిషి. వసుధార మాత్రం వెనుక హాయిగా కూర్చుని రిషి భుజంపై చేయి వేస్తుంది...
వసు-రిషి: వసుని రూమ్ దగ్గర దించేస్తాడు...లోపలకు రావొచ్చు కదా సార్ అని వసు.. పిలవొచ్చు కదా అని రిషి అనుకుంటారు. థ్యాంక్స్ ఫర్ ద లిఫ్ట్ అని రిషి అంటే..మీరు థ్యాంక్స్ చెప్పడం ఏంటి అంటే..ఈ విషయంలో నిన్ను మించి ఎవరుంటారని సెటైర్ వేస్తాడు. ఆగమనొచ్చుకదా అని రిషి..ఆగొచ్చు కదా అని వసు అనుకుంటారు.. మళ్లీ రిషినే వెనక్కు వస్తాడు...  చాక్లెట్ కవర్ తో బొమ్మ చేసి ఇచ్చి వెళ్లిపోతాడు... ఆ బొమ్మ పట్టుకుని రూమ్ లో కూర్చుని ఆలోచిస్తుంటుంది వసుధార... ఇంతలో డోర్ సౌండ్ అవడంతో పిల్లలెవరో వచ్చారనుకుంటుంది..అక్కడ రిషి ఉంటాడు..


Also Read: అడుగడుగునా నిలదీస్తున్న కార్తీక్ - మోనితకి మొదలైన కౌంట్ డౌన్, టెన్షన్లో దీప!


కూర్చోమని చెప్పి టీ తీసుకొస్తానని వెళుతుంది.. ముందు వాటర్ తీసుకొచ్చి ఇస్తుంది... వసు చేయి పట్టుకుని కూర్చో వసుధారా మాట్లాడాలి అని అడుగుతాడు..
రిషి: ఎగిరే పక్షుల రెక్కలు విరిగిపోతే ఎలా తల్లడిల్లిపోతుందో అలా ఉంది నా పరిస్థితి..నీకు నాకు తెలియని దూరం ఏంటి వసుధారా ఇది..నాకేం బాలేదు..మధ్యలో మాట్లాడుతున్న వసుని ఆపి..నేను చెప్పేది విను అంటాడు. మనిద్దరం కార్లో కలసి ప్రయాణం చేస్తేనే ఎన్నో అందమైన జ్ఞాపకాలు పోగేసుకున్నాం..అలాంటిది జీవితాంతం కలసి ప్రయాణం చేస్తే ఎంత బావుంటుందో కదా మనిద్దరి మధ్యా ఈ ఒక్క విషయం ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతోంది. ప్రేమంటే ఎదుటి వాళ్లని భరించడమా,గౌరవించడమా...
వసు: ప్రేమంటే అన్నీ..మిమ్మల్ని బాధించాలని నేనెప్పుడూ అనుకోను..ఏం జరిగిందని మీరు ఇంతలా బాధపడుతున్నారు
రిషి: కష్టాలు,బాధలు, ఒంటరితనం నాలో నన్నే కుచించుకుపోయేలా చేస్తున్నాయి...ఇప్పుడేదో బావుంది అనుకుంటే నువ్వు కూడానా...
ఇంతలో వసుధార కళ్లలో నీళ్లు చూసి రిషి కంగారు పడతాడు..
వసు: ఆనందం సార్..ఇది గుండెపట్టలేని ఆనందం..మీ దృష్టిలో నాకున్న స్థానం తెలుసుకుని నాకు తెలియకుండానే కన్నీళ్లు వస్తున్నాయి సార్.. చిన్న పిల్లలకు కలల్లో సైతం ఊహించని బొమ్మ కానుకగా ఇస్తే ఆ ఆనందంతో పాటూ ఆ బొమ్మ ఎక్కడ దూరమవుతుందో అనే భయం ఉంటుంది ..అలా మీరెక్కడ దూరమవుతారో అని అనుక్షణం మనసులో గుబులుగా ఉంటోంది. పరీక్షలు అయిపోగానే అమ్మా నాన్న దగ్గరకు వెళ్లిపోదాం అనుకున్నాను కానీ మీకు దూరంగా ఉండలేక రిజల్ట్ వచ్చాక వెళదాం అని సర్దిచెప్పుకున్నా...కొన్ని రోజులకే మిమ్మల్ని వదిలి ఊరు వెళ్లడానికి మనసు రావడం లేదంటే ఏమైందిసార్ నాకు..ఏం మాయ చేశారు..
రిషి: మాయ జరిగింది వసుధార..ఏం మాయచేశావ్ అని నన్ను అడుగుతున్నావ్ కానీ అదే మాయ నాక్కూడా జరిగింది కదా.. ఒకప్పుడు రిషి వేరు..కాలేజీకి నువ్వొచ్చాక, నా జీవితంలోకి నువ్వొచ్చాక ఈ రిషి వేరు.. పాఠాలు లెక్కలు చెప్పే నాకు జీవిత పాఠాలు చెప్పావ్,కొత్త లెక్కలు నేర్పావ్..ఎన్నో అందమైన జ్ఞాపకాలు ఆస్తులుగా అందించావ్..చివరి శ్వాస వరకూ మనం కలసి ఉండాలని కోరుకున్నాను..ఇప్పుడు ఈ దూరం..శ్వాస ఆగిపోయినట్టు చేస్తోంది..ఎందుకు మనమధ్య ఈ దూరం.. 
వసు: నేనుకూడా అదే చెబుతున్నాను సార్..మన మధ్య దూరం లేదు..జగతి మేడం అనే చిన్న అభిప్రాయ బేధం ఉంది సార్.. జగతి మేడంని అమ్మా అని పిలిస్తే..
వసుధారా అని గట్టిగా అరిచి లేచి నిల్చుంటాడు...నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ ప్రస్తావన వద్దని..నేను ఏం కోల్పోయానో నీకేం తెలుసు.. 
వసు:కోల్పోయిన తల్లి ప్రేమ ఇప్పుడైనా పొందొచ్చు కదా..నిజం తెల్సుకోండి సార్
రిషి: నిజం నాకు తెలుసు..
వసు: జగతి మేడం ఎందుకు వెళ్లారో మీకు తెలుసా
రిషి: ఎందుకు వెళ్లిందో కాదు..నన్ను వదిలేసి వెళ్లారు అంతే..
సార్ అని వసు పిలుస్తున్నా..రిషి వెళ్లిపోతాడు....
ఎపిసోడ్ ముగిసింది...


Also Read: పంటపొలాల్లో ప్రేమపక్షుల విహారం, మరోసారి విషం చిమ్మిన దేవయాని