గుప్పెడంత మనసు మంగళవారం ఎపిసోడ్  ( Guppedantha Manasu  November 29th  Today Episode 620)


ఇంట్లో సోఫాలో కూర్చుని ఫోన్ చూసుకుంటాడు ఫణీంద్ర.. అక్కడకు వచ్చిన ధరణి.. జగతి అత్తయ్యగారికి ఎలాఉంది, డాక్టర్ ఏమంటున్నారు, ఎప్పుడు పంపిస్తామన్నారని అడుగుుతుంది ధరణి... డిశ్సార్జ్ చేశారంట వచ్చేస్తారని చెబుతాడు. నేను బాగా ఎదురుచూస్తున్నానని ధరణి అంటే..నేనుకూడా అంటాడు ఫణీంద్ర..అందరికన్నా ఎక్కువగా నేను ఎదురుచూస్తున్నాను అంటూ ఎంట్రీ ఇస్తుంది దేవయాని. వాళ్లు ఇంటికొస్తున్నారంటే సంబరాలు చేస్తావా, ఉత్సవాలు చేస్తావా అని సెటైర్ వేస్తుంది. ఎగిరిపోయిన పక్షులు గూటికి చేరుతున్నారు అంటుంది... 
ఫణీంద్ర: అదేంటి అలా మాట్లాడతావు..అయినా వాళ్లు రాగానే అసలు ఎందుకు వెళ్లారో అడిగి తెలుసుకుంటాను.రిషిని ఇంత బాధపెట్టారు
దేవయాని: మీరు అడిగితే చెబుతారా ఏంటి...అయినా వెళ్లిపోయిన వారిని కారణాలు అడగడం అవసరమా..
ఫణీంద్ర: కాలేజీలో అడుగుదాం అనుకున్నా ఇంటర్యూ హడావుడిలో అడగలేదు.. హాస్పిటల్లో అడగలేను.. ఇంటికి వచ్చాక అడిగి తెలుసుకుంటాలే
ధరణి: ఫణీంద్ర అటు వెళ్లిపోయిన తర్వాత....చిన్నత్తయ్య చిన్నమావయ్య వెళ్లడానికి కారణం మీరే అని తెలిస్తే అని అమాయకంగా సెటైర్ వేస్తుంది ధరణి
దేవయాని: నావల్ల వెళ్లడం ఏంటి..నావల్ల వెళ్లామని నీకు చెప్పారా..ఏంటి ధరణి నువ్వు...వాళ్లు చెబుతారో లేదో తెలియదు కానీ వాళ్లకన్నా ముందు నువ్వే చెప్పేలా ఉన్నావ్..
ధరణి: నిప్పులేనిదే పొగరాదంటారు కదా..
దేవయాని: అత్తా కోడళ్లంటే ఎలా ఉండాలి ఫ్రెండ్స్ లా కలసిపోయి ఉండాలి..ఇందులో నా ప్రమేయం లేదని సపోర్ట్ చేయాలి కానీ నువ్వే చెప్పకూడదు..ధరణి మనిద్దంర మంచి ఫ్రెండ్స్ ఓకేనా...
ధరణి: మీరు అవసరానికి తగ్గట్టు భలే మాట్లాడతారు అనుకుంటుంది ధరణి.. ఏదేమైనా ఏదో జరగబోతోందని భయం వేస్తోంది అత్తయ్యగారు
దేవయాని: ఏమీ జరగదు..నువ్వు నాకు సపోర్ట్ చేయి చాలు..


Also Read: దీప కోసం డాక్టర్ బాబు కన్నీళ్లు, సౌందర్యని మళ్లీ తప్పుదారిపట్టించిన ఇంద్రుడు


జగతికి వసుధార సేవలు చేస్తూ ఉంటుంది. అప్పుడు ఎందుకు వసు ఇవన్నీ అనడంతో మీకు సేవ చేసుకోనివ్వండి మేడం అని అంటుంది.
వసు: మేడం ఈమధ్య మీ మాటలు మీ ప్రవర్తన అస్సలు అర్థం కావడం లేదు. అసలు ఇంట్లో నుంచి ఎందుకు వెళ్లారు ఎందుకు ఇలా చేస్తున్నారు ఏమీ అర్థం కావడం లేదు 
జగతి: కొన్ని ప్రశ్నలకు మనం సరిగ్గా సమాధానం చెప్పలేం వసు. కొన్ని కొన్ని సార్లు కొన్ని బాధలకు ఇంకొందరిని బాధ్యుల్ని చేయాల్సి వస్తుంది
వసు: మీరు ఇంట్లోంచి వెళ్లినప్పటి నుంచి ఎక్కడ ఉన్నారో ఏం చేస్తున్నారో ఎలా ఉన్నారో అని చాలా టెన్షన్ పడ్డాం బాధ పడ్డాము మేడం
జగతి: మేము వెళ్లామని మీరు బాధపడుతున్నారు కదా మేము అక్కడ ఎంత బాధపడి ఉంటామో మీకేం తెలుసు వసు
వసు: మీరు వెళ్లడానికి నేనేమైనా కారణమా 
జగతి: కారణాలు అడగొద్దు. ఇప్పుడు అన్ని సర్దుకున్నాయి కదా
వసు: ఏం సర్దుకున్నాయి మేడం రిషి సార్ మహేంద్ర సార్ ను వదిలి హాస్పిటల్ నుంచి వెళ్ళాలి అంటేనే భయపడుతున్నారు
ఆ తర్వాత జగతి.. భార్య ఎలా ఉండాలో చిన్న క్లాస్ వేస్తుంది. ఇంత చెబుతున్ననేను అప్పుడు రిషిని ఎందుకు వదిలేసి వెళ్లానని అడుగుతావేమో...నేను వెళ్లలేదు వెళ్లగొట్ట బడ్డాను అని చెబుతుంది. రిషి అడిగితే నా నోటి నుంచి నో అనే మాట రాదు...అందుకే నీ ఇంటర్యూకి రమ్మని మెయిల్ పెట్టగానే ఆగలేక వచ్చేశాను..చెప్పడంతో వసుధార చాలా సంతోషపడుతుంది.. వాళ్లిద్దరూ రిషిని పొగుడుతూ మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి మహేంద్ర, రిషి వస్తారు. మహేంద్ర జగతి డాక్టర్ తో మాట్లాడాను డిశ్చార్జ్ చేస్తానన్నారు అనడంతో జగతి సంతోషిస్తుంది


Also Read: నిజం తెలిసి గౌతమ్ ని ఛీ కొట్టిన రిషి- దేవయానికి వార్నింగ్ ఇచ్చిన మహేంద్ర


గౌతమ్ అక్కడికి వచ్చి ఈ ఫార్మాలిటీస్ అని పూర్తయ్యాయి రా అని అనడంతో..బిల్ కట్టావా అని అడిగితే లేదంటాడు. ఇదిగో నా కార్డుతో కట్టు అని మహేంద్ర అంటే..వద్దు నా కార్డుతో బిల్ కట్టేసేయ్ అని గౌతమ్ కి కార్డు ఇస్తాడు. అది చూసి జగతి సంతోష పడుతుంది. మేడం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీకోసం ఒక స్పెషల్ గా నర్సుని పెడదామనడంతో సరే రిషి అని కొడుకువైపు చూస్తూ ఉంటుంది జగతి. రిషి నాకు దూరమైన అదృష్టం వసు నువ్వెప్పుడూ రిషిని వదులుకోవద్దని జగతి మనసులో అనుకుంటే..ఈ జెంటిల్మెన్ ని ఎప్పటికీ వదులుకోను అనుకుంటుంది వసుధార. ఆ తర్వాత అందరూ కలిసి కారులో వెళ్తూ ఉంటారు. రిషి-వసుధార ఇద్దరూ కలసిపోయారని మురిసిపోతుంది జగతి..