గుప్పెడంత మనసు మంగళవారం ఎపిసోడ్ ( Guppedantha Manasu November 1st Today Episode 596)
కార్లో వెళుతుంటారు రిషిధార.
రిషి: వసుధార అన్న మాటలు తలుచుకుని ఆనందపడుతుంటాడు రిషి. నాకు తెలుసు వసుధారా ఇలా మారుతావని అనుకుంటాడు
వసుధార: ఇప్పుడు నా మనసు ఎంత సంతోషంగా ఉందో అనుకుంటుంది..
రిషి: ఈ సంతోష సమయంలో డాడ్ వాళ్లు మనతో ఉంటే బావుండేది కదా
వసు: వచ్చేస్తారులెండి సార్..
ఇంతలో రిషిపై పడిన గులాబీ రెక్కను తీసుకుంటుంది వసుధార..అది లాక్కున్న రిషి..జేబులో పెట్టుకుంటాడు. ఎందుకు అన్న వసు ప్రశ్నకు సమధానంగా అందమైన జ్ఞాపకంగా అని రిప్లై ఇస్తాడు..వసు ఆనందపడుతుంది.
Also Read: మోనితను మళ్లీ కొట్టిన దీప, శౌర్యని దాచేసిన ఇంద్రుడు-చంద్రమ్మకి షాక్ ఇచ్చిన కార్తీక్
గౌతమ్-జగతి-మహేంద్ర
గౌతమ్: రిషిని వదిలేసి రావడం ఇక్కడ మీరు బాధపడడం అక్కడ రిషి బాధపడడం బాలేదు. మీరు వచ్చేయండి అంకుల్
మహేంద్ర: నేను రాలేను గౌతమ్ అయినా వసుధార ఉంది కదా
గౌతమ్: అంకుల్ మీరు లేని లోటు మీరు మాత్రమే తీర్చగలరు
జగతి: మరోసారి ఆలోచించు మహేంద్ర
గౌతమ్: ఎన్నేళ్లైనా రిషి బాధ తగ్గదు అంకుల్ . అక్కడ దేవయాని పెద్దమ్మ ఏవేవో ప్లాన్ చేస్తుంది పెద్దమ్మ నుంచి ఏదో ఒక రకమైన సమస్య రాకముందే మీరు అక్కడికి వచ్చేయండి
మహేంద్ర: మేం వచ్చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ వసుధారలో ఏమైనా మార్పు వచ్చిందా గమనించి చెప్పు
మరొకవైపు కాలేజీలో వసుధార పరిగెడుతుంటుంది..వసుని పట్టుకునేందుకు రిషి వెనుకే ఫాలో అవుతాడు. పరిగెత్తుతుండగా వసు చున్నీ రిషి కాలికింద పడి దొరికిపోతుంది. నువ్వు సాధించావ్..యూనివర్షిటీ టాపర్ అయ్యావ్ ఇదిగో గిఫ్ట్ అని ఇస్తాడు. మీరే గిఫ్ట్ సార్ నాకు అని వసు అంటే..ముందు ఓపెన్ చేసి చూడు.. థ్యాంక్స్ సార్ అని వసు అనడంతో అంతేనా అని రిషి ముద్దుగా అడగ్గానే హగ్ ఇస్తుంది వసుధార... (నో అని ఉలిక్కిపడి లేస్తుంది దేవయాని) ఇదంతా నా కలా..ఇలా ఎప్పుడైనా జరగొచ్చు... వీళ్ల ప్రేమకథకు అందమైన ముగింపు ఇస్తాను అనుకుంటుంది దేవయాని...
Also Read: పశ్చాత్తాప్పడిన వసు- పూల వర్షం కురిపించుకున్న ప్రేమపక్షులు, పట్టరాని సంతోషంలో రిషి
రిషి మహేంద్రను తలుచుకుని ఎక్కడికి వెళ్లారు ఎప్పుడు వస్తారు అని బాధపడుతూ ఉంటాడు. ఇంతలో కాల్ రావడంతో తండ్రేమో అనుకుని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు...త్వరలో రిజల్ట్ వస్తాయంట సార్ అని అటువైపునుంచి చెప్పేసి కాల్ కట్ చేస్తాడు. ఆ తర్వాత వసుధార ఇంకా రాలేదేంటి అనుకుంటూ కాల్ చేసి...మిషన్ ఎడ్యుకేషన్ ఫైల్స్ తీసుకుని రా అని చెబుతాడు. వసు వెళుతుండగా..కాలేజీ మేడం వసుని ఆపి జగతి మేడం వాళ్ళు ఇల్లు విడిచి వెళ్లిపోయారంట కదా దేవయాని మేడమ్ చెప్పారనడంతో వసుధార షాక్ అవుతుంది. దేవయాని మేడం మామూలుది కాదు రిషి సార్ కి చెప్పాలి అనుకుంటుంది..
మరొకవైపు తన దగ్గరకు వచ్చిన గౌతమ్ తో మహేంద్ర గురించి ఆరాతీస్తాడు రిషి. గౌతమ్ మాత్రం ఏం మాట్లాడుకుందాం మౌనంగా ఉంటారు. అది కరెక్ట్ కాదు అని రిషి అంటుండగా ఇంతలో వసుధార అక్కడికి వచ్చి నిజం సార్ కనపడగానే కడిగేయాలి కొట్లాడాలి అని అంటుంది. అప్పుడు దేవయాని మేడం ఇలా చెప్పిందంట సార్ అనడంతో వెంటనే రిషి... పెద్దమ్మ చెప్పిన దాంట్లో తప్పేముంది వసుధార...ఆ విషయం ఎన్నాళ్లు దాచుతాం అంటాడు. ఆ తర్వాత రిషి గౌతమ్ ఇద్దరి నడుచుకుంటూ వెళుతూ ఉంటారు. జగతి మేడం వాళ్ళు బయటికి వెళ్లిన విషయం ఎలాగైనా నేనే బయట పెడతాను..పోలీస్ కప్టైంట్ ఇద్దాం అని అంటాడు రిషి. టెన్షన్ పడిన గౌతమ్..అమ్మో పోలీస్ కంప్లైంట్ ఇస్తే నేను దొరికిపోతాను అనుకుంటూ...ఎందుకురా మనింటి విషయం స్టేషన్ వరకూ అని సర్దిచెప్పేందుకు ట్రై చేస్తాడు. అక్కడి నుంచి వెళ్లిపోతూ...రిషి..వసుని ఏమీ అనొద్దురా అని చెబుతాడు. సలహాలివ్వకు అని రిషి అనడంతో గౌతమ్ వెళ్లిపోతాడు...ఇంతకీ వసు ఎక్కడుందని రిషి ఆలోచిస్తాడు....