గుప్పెడంత మనసు శనివారం ఎపిసోడ్ ( Guppedantha Manasu November 12th Today Episode 606)
వంటగదిలో హడావుడిగా ఉన్న వసుధార దగ్గరకు వచ్చిన గౌతమ్..నీకు ఇదంతా అవసరమా అంటే.. మన అనుకుంటే ఇవేమీ తప్పుకాదు కదా అంటుంది
గౌతమ్:రిషితో నీ జీవిత ప్రయాణం ఎంతవరకూ వచ్చింది..మీ ఇద్దరి మధ్యా ఆ అడ్డుతెర తొలగిపోయినట్టేనా.. అంకుల్ మేడం ఇద్దరూ రిషి దగ్గర లేరుకదా నీ ఆలోచనల్లో ఏమైనా మార్పు వచ్చిందా అని
వసు: జగతి మేడం నా జీవితానికి దిక్సూచి లాంటివారు..ఆవిడ దూరమైనా అమ్మా అనే పిలుపు అందించాలని ఆ ప్రయత్నం చేశాను. అయితే ఆయన నాకోసం పిలవడం కాదు తనంతట తాను పిలవాలి
గౌతమ్: నువ్వు మారావా..ఆ ఒప్పందం నుంచి డ్రాప్ అయినట్టేనా..రిషికి ఎలాంటి టెన్షన్ లేనట్టేనా
వసు:మారాను..మారుతున్నాను..మారిపోతాను ఇలాంటివి చెప్పను..పరిస్థితులు ఎదుటివారిని బట్టి అభిప్రాయం మారొచ్చు
గౌతమ్: కొంత అర్థమయ్యేలా చెప్పు
వసు: నేను దారి మార్చుకున్నాను గమ్యం మార్చుకోలేదు..అభిప్రాయం మార్చుకోలేదు..ఇచ్చిన మాట వదులుకోలేదు.. అలాగని రిషి సార్ ని వదులుకోలేదు. నా పంధాని మార్చుకున్నాను పంతం తగ్గించుకున్నాను.. కొన్ని మార్పులు జరగాలని ఆశించాలి కానీ కాస్త ఓపిక పట్టాలి..అవి మనమే మార్చాలని అనుకోవచ్చు.. చాలా బంధాలు విడిపోవడానికి పెద్ద పెద్ద కారణాలు ఉండవు సార్..అన్నీ చిన్న చిన్నవే..ఈ ఒక్కటి తెలుసుకుంటే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్...
గౌతమ్: గ్రేట్ వసుధారా బాగా చెప్పావ్
ఇంతలో రిషి ఎంట్రీ ఇస్తాడు...గ్రేట్ రా వసుధార బుర్ర తింటున్నావా...
రిషి: నువ్వు యూనివర్శిటీ టాపర్ అయిన సందర్భంగా కాలేజీలో నీకోసం సెలబ్రేషన్ పార్టీ ప్లాన్ చేస్తున్నారు..
వసు: ఇప్పుడు ఇవన్నీ ఎందుకు..జగతి మేడం మహేంద్ర సార్ లేనప్పుడు ఏ సెలబ్రేషన్స్ ని నేను ఆస్వాదించలేను
గౌతమ్: నువ్వు సాధించినదానికి ఇంకా బాగా సెలబ్రేట్ చేయాలి
రిషి: కాలేజీలో నిన్ను ఇంటర్యూ చేయడానికి మీడియా వస్తోంది వాళ్లని వద్దనలేవు కదా
Also Read: దీపను చంపబోయిన మోనిత, కాపాడి ఇరుక్కుపోయిన కార్తీక్
ఇదంతా పక్కనుంచి విన్న దేవయాని..వసు-గౌతమ్ మాటలన్నీ గుర్తుచేసుకుని ఏం చేయాలి ఇప్పుడు అని ఆలోచనలో ఉంటుంది. ఇంతకీ వసుధార ఏం ఆలోచిస్తోంది..ఇంట్లో అందర్నీ ఒక్కటి చేసి నన్ను ఒంటరి చేస్తుందా.. రిషి నా పట్టులోంచి జారిపోయినట్టేనా..జగతి మహేంద్ర ఇంట్లోంచి వెళ్లిపోవడం నాకు కలసి వస్తుంది అనుకున్నాను కానీ నాకు కాకుండా ఆ వసుధారకి కలిసొచ్చినట్టుంది..ఈ పరిస్థితిని ఎలా అధీనంలోకి తెచ్చుకోవాలి.. నీ దూకుడికి కళ్లెం వేస్తాను..నిన్ను ఎలా ఆపాలో నాకు బాగా తెలుసు..జగతి లాంటి తెలివైనదాన్నే 20 ఏళ్లు ఇంట్లోంచి బయటకు పంపించగలిగా నువ్వు నాకొక లెక్కా నీ ఎత్తుకి పైఎత్తు తప్పకుండా వేస్తాను...
పొద్దున్నే ధరణి వంటగదిలో బిజీగా ఉంటుంది.. అక్కడకు వెళ్లిన దేవయానిని చూసి పొద్దున్నే కిచెన్లోకి వస్తున్నారు ఏంటో అనుకుంటుంది ధరణి. ఏంటి విశేషాలు అని అడగ్గానే..నేను వార్తాపత్రికనా అనుకుంటుంది.. ధరణి నుంచి ఏవేవో తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తుంటుంది. రిషి ఇంకా నిద్రలేవలేదు..వసుధార కూడా లేవలేదు..ఈ అవకాశాన్ని మనం వాడుకోవాలి...ఆ వసుధారని గెలవాలంటే మనిద్దరం ఒకేలా ఆలోచించాలి అంటుంది. దేవయాని కాఫీ కలుపుతుంటే.. నాను నేను కలుపుకుంటాను అత్తయ్యగారు అంటుంది.. నీకోసం కాదు రిషి కోసం అని కాఫీ తీసుకెళుతుంటుంది దేవయాని...
Also Read: మచ్చలేని స్వచ్ఛమైన భావాలేవో ఉరకలేసే, ఊహించని గిఫ్ట్ ఇచ్చిన రిషికి వసు హగ్
రిషి రూమ్ సర్దుతూ ఉంటుంది వసుధార... పక్కనున్న ర్యాక్ లో గతంలో తానిచ్చిన గోళీల సీసా, నెమలి కన్ను చూసి అప్పటి జ్ఞాపకాల్లోకి వెళ్లిపోతుంది. బ్యాగులోంచి వీఆర్ అని ఉన్న ఉంగరాన్ని తీసి చూస్తుంటుంది. వెనుక నుంచి వచ్చిన రిషి ఇక్కడేం చేస్తున్నావ్ అని అడిగితే..సర్దుతున్నాను అంటుంది. అంతా బాగానే ఉందికదాఅంటే మళ్లీ మళ్లీ చూడాలి అనిపించే అపురూపమైన కానుక చూస్తున్నా అంటుంద. గిఫ్ట్ ఇచ్చిన వారిని వదిలేసి గిఫ్ట్ ను చూస్తున్నావేంటో అని రిషి అంటే ఇది నాకు గొప్ప బహుమతి అని వసు అంటే..నువ్వే నాకు గొప్ప బహుమతివి అంటూ రిషి వసు చేయి పట్టుకుని ప్రేమ ప్రయాణం గురించి మాట్లాడుకుంటారు..
అప్పుడే కాఫీ తీసుకొచ్చిన దేవయాని... పొద్దున్నే వచ్చేసిందా అనుకుంటూ ఏంటి వసుధార అనుకుంటూ రూమ్ లోపలకు వస్తుంది. పొద్దున్నే లేచావా వసుధారా అని అంటే.. పొద్దున్నే లేవడం మంచి అలవాటు కదా అంటుంద.. ఇంతలో వసు చేతిలో ఉన్న ఉంగరం బాక్స్ చూస్తుంది దేవయాని. పొద్దున్నే నా చేత్తో నీకు కాఫీ ఇస్తేనాకు ఎంతో తృప్తిగా ఉంటుంది.. నేను వసుధారకి ఇంకో కాఫీ తెప్పిస్తానులే నువ్వు తాగేసెయ్ అంటుంది.
వసు: నాకోసం మళ్లీ మళ్లీ ఇంకో కాఫీ తెప్పించడం ఎందుకు షేర్ చేసుకుంటాం లెండి...( కౌంటర్ ఇచ్చి దేవయాని వైపు గెలిచాను అన్నట్టు చూస్తుంది). కాఫీ చాలా బావుంది మేడం..మీరే కలిపారు కదా..
దేవయాని: నీ టైమ్ బావుందే వసుధారా కానివ్వు అనుకుంటుంది..
పెదనాన్న కాల్ చేస్తున్నారని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు రిషి.. ఇక్కడికి వచ్చిన పని సక్సెస్ అయింది..నేను వస్తున్నా అనికాల్ కట్ చేస్తాడు ఫణీంద్ర...
రిషి: పెద్దమ్మా పెదనాన్న వచ్చాక డాడ్ గురించి అడిగితే ఏం చెబుదాం..డాడ్ వాళ్లు ఇంట్లోంచి వెళ్లిపోయారని తెలిస్తే పెదనాన్న బాధపడతాడు
దేవయాని: నేను కూడా అదే ఆలోచిస్తున్నాను..ఆయన వచ్చి వీళ్ల గురించి అడిగితే నాక్కూడా ఇబ్బందే..
సరే మేం బయలుదేరుతున్నాం అని వసు పదా అని వెళ్లిపోతారు.. ఏంటో మహేంద్ర జగతి వెళ్లిన వ్యవహారం నా మెడకు చుట్టుకునేలా ఉంది అనుకుంటుంది దేవయాని...