గుప్పెడంత మనసు శుక్రవారం ఎపిసోడ్  ( Guppedantha Manasu  November 11th  Today Episode 605)


దేవయాని-గౌతమ్  ఇద్దరూ హాల్లో కూర్చుని రిషి-వసుకోసం వెయిట్ చేస్తుంటారు
గౌతమ్: అవును పెద్దమ్మా వీళ్లింకా రాలేదేంటి
దేవయాని: పొద్దున్న నుంచీ సాయంత్రం వరకూ ఇద్దరూ కలసి తిరుగుతారు..నువ్వు నన్ను అడుగుతున్నావేంటి
ధరణి: రిషి పార్టీ ఏమైనా ఇస్తున్నాడేమో
దేవయాని: అన్నీ భలే అనుకుంటున్నావ్.. స్వీట్స్ మాత్రమేనా ఇంకా హారతులు పడతావా
గౌతమ్: పెద్దమ్మకు వసుధార అంటే ఇష్టంఉండదు..కేవలం రిషి కోసమే ఇదంతా చేస్తున్నారు
ఇంతలో రిషిధార రానే వస్తారు. వసుధార రిషి కోట్ వేసుకుని రావడంతో అదేంటి వసుధార ఇలా వచ్చింది అని దేవయాని అంటుంది. చెప్తాను పెద్దమ్మ అంటూ  నువ్వు వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకో అని వసుని పంపిస్తాడు. ఏంటిదంతా అని దేవయాని అడిగితే నేను ఫ్రెష్ అయ్యి వచ్చి చెప్తాను పెద్దమ్మ అనేసి వెళ్లిపోతాడు..
 
Also Read: ఇవాల్టితో నీ దీపం ఆరిపోతుందన్న మోనిత - నీ పాపం పండిందన్న దీప, కార్తీక్ కి ఏం జరగబోతోంది!


మహేంద్ర- జగతి ఇద్దరూ వసుధార విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. వసుధారకు కేక్ పంపించాలి విషెస్ చెప్పాలి అంటే అవన్నీ ఇప్పుడు కుదురుతాయా జగతి అని మహేంద్ర అంటాడు. నువ్వు ఏదైనా చేయి..నా స్టూడెంట్ వసుధార యూనివర్శిటీ టాపర్ అని జగతి అంటే హలో మేడం.. తను డి బి ఎస్ టి కాలేజ్ స్టూడెంట్ కూడా అని మహేంద్ర అంటాడు. అయినా ఆ ఫ్లవర్ బొకేలు, కేక్ లు ఎవ్వరైనా ఇస్తారు..నేను కొత్తగా ట్రై చేస్తానంటూ వెళ్లిపోతాడు మహేంద్ర
 
అటు ఇంట్లో అందరూ వసుధారకు కంగ్రాట్స్ చెబుతారు. దేవయాని పొగుడుతుంటే.. ఏంటి ఇలా మాట్లాడుతోంది అంటూ అక్కడ అందరూ అనుకుంటారు. రిషి కూడా వసుధారకు స్వీట్ తినిపించి కంగ్రాట్స్ చెప్తాడు. ఈ విజయం నాది మాత్రమే కాదు ఇది విశేషాలు గొప్పతనం అంటూ రిషి కి స్వీట్ తినిపిస్తుంది.  ఈ టైంలో డాడ్ ఉంటే బాగుండేది అని రిషి మొదలుపెడితే.. అవును జగతి మేడం, మహేంద్ర సార్ ఉంటే చాలా బాగుండేది అని వసుధార కూడా ఫీల్ అవుతుంది..ఇంతలో దేవయాని కలగజేసుకుని వాళ్ళు ఇక్కడ లేకపోతే ఏంటి కనీసం ఒక బొక్కే పంపించి కంగ్రాట్స్ చెప్పొచ్చుగా  అంటుంది. ఇంతలో గౌతమ్ న్యూస్ పేపర్ తీసుకుని వస్తాడు.  స్వయంగా అంకుల్-మేడం వసుధారకి అభినందనలు తెలిపారంటూ పేపర్ చూపిస్తాడు. దేవయాని షాక్ అవగా..రిషిధార సంతోష పడతారు. 


Also Read: చెరువులో పడిపోయిన వసుధార, కంగారులో రిషి -రగిలిపోతున్న దేవయాని




వసుధార పరిచయం అయినప్పటి నుంచీ జరిగినవన్నీ గుర్తుచేసుకుని మురిసిపోతాడు రిషి. వసుధారది గొప్ప ప్రయాణం, గొప్ప విజయం అంటూ పొగుడుతాడు. ఆ తర్వాత వసు బుక్ లోపేపర్ పై VR అని రాసి ఉండడం చూసి తాను చేయించిన ఉంగరం గర్తువచ్చి బయటకు తీస్తాడు. రిషి లేకుండా వసు పూర్తవదు అన్న వసు మాటలు గుర్తుచేసుకుని..ఆ ఉంగరం తీసుకుని మేడపైకి వెళతాడు. సంతోషంగా దీపాలు వెలిగిస్తున్న వసుధార..వెనుకకు తిరిగి చూడకుండానే...ఇప్పుడొచ్చారా అంటుంది
రిషి: వెనక్కుతిరిగి చూడకుండానే నేనొచ్చినట్టు ఎలా తెలిసింది
వసు:ఓ మనసుకి మరో మనసు వచ్చినట్టు తెలుస్తుంది
ఇద్దరూ కలసి దీపాలు వెలిగిస్తారు..ఈ దీపాలు ఎందుకు వెలిగిస్తున్నానంటే జగతి మేడం రావాలని వసు అంటే.. అలా అయితేడాడ్ కూడా వస్తారు కదా నేను కూడా వెలిగిస్తానంటాడు రిషి..గాలికి ఆరిపోతున్న దీపాలకు ఇద్దరూ చేయి అడ్డుపెడతారు..అప్పుడే VR అనే అక్షరాలు ఉన్న ఉంగరాన్ని  వసుధారకు గిఫ్ట్ గా ఇస్తాడు రిషి. అది చూసి వసుధార ఎంతో ఆనందపడుతుంది. ఆతర్వాత ఉంగరాన్ని రిషి చేతికిచ్చి తనకు తొడగమని చెబుతుంది.
రిషి: నువ్వు నా జీవితంలోకి వచ్చాక కొత్త వెలుగు వచ్చింది. నువ్వు కలసిన ప్రతిసారీ నాలో ఏదో కొత్త శక్తి వచ్చినట్టుంది అంటాడు
వసుధార ప్రేమగా హగ్ చేసుకుంటుంది..
ఎపిసోడ్ పూర్తయింది..