రెస్టారెంట్లో కూర్చున్న రిషి-గౌతమ్..వసు ముచ్చట్లలో ఉంటారు. వసుకి తెలియకుండా తీసుకున్న సెల్ఫీని రిషికి చూపిస్తాడు గౌతమ్. తనకు చెప్పకుండా ఫొటో తీయడం సరికాదన్న రిషి ఫోన్ లాక్కుని ఫొటో డిలీట్ చేస్తాడు. మిత్రద్రోహి అని తిట్టిన గౌతమ్.. స్నేహం కోసం ప్రాణం ఇస్తార్రా కొందరు అని గౌతమ్ అంటే..స్నేహితులు చేసిన చెత్తపనులను వ్యతిరేకిస్తారు నాలాంటి కొందరు అంటాడు రిషి. వసుధారకి చెప్పొద్దు పార్టీ ఇస్తాను అంటాడు గౌతమ్. ఇంతకీ పార్టీ ఎందుకు ఇస్తున్నావని వసు ముందు ఇరికిస్తాడు రిషి. కట్ చేస్తే ఇంటికి చేరుకున్న రిషి మౌత్ ఆర్గాన్ తో బిజీగా ఉంటే.. గౌతమ్ తాను గీస్తున్న బొమ్మ సరిగా రావడం లేదంటాడు. మనసులో ఉండే రూపం పేపర్ పై ఆటోమేటిగ్గా ప్రవహిస్తుంది అంటాడు రిషి. ఆ కళ్లు చూడాలంటే మనకళ్లు అదృష్టం చేసుకోవాలన్న మాట అంటాడు. గౌతమ్..ఆర్ట్ ని ఆర్టిఫిషియల్ చేయకురా....ఏకాగ్రత లేనప్పుడు ఏపనీ చేయకూడదు..అందులోనూ కళకు సంబంధించిన పనులు చేయకూడదంటాడు. నువ్వు ఎప్పుడూ ఎంకరేజ్ చేయవు అన్న గౌతమ్..అందమైన కళ్లని అందంగా గీస్తానంటాడు. అంతలోనే కుదరట్లేదని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అప్పుడు రిషి..వసుధార ఊహల్లో ఆమె బొమ్మ గీస్తాడు. 


Also Read: మోనిత కొడుకుపై ప్రేమ పెంచుకుంటున్న డాక్టర్ బాబు, వంటలక్క.. కార్తీకదీపం బుధవారం ఎపిసోడ్
సోఫాలో పడుకున్న వసు చేతిలో బుక్ తీసి టేబుల్ పై పెట్టిన సమయంలో నెమలి ఈక చూస్తుంది జగతి. ఇంకా చిన్న పిల్లల చేస్టలు, అప్పుడే ధైర్యంగా ఉంటావ్, అప్పుడే చిన్న పిల్లలా మారిపోతావ్, రిషిలాగే నువ్వు కూడా అర్థం కావు..నిద్రలేపాలా వద్దా అనుకుని వద్దులే అని అక్కడి నుంచి వెళ్లిపోయిన జగతి.. జంట నెమలీకలు ఉన్న బాటిల్లో మూడోది పెడదాం అనుకుని.. జంట అంటే రెండే కదా మూడో నెమలీకను ఏం చేయాలని ఆలోచించి అదే బాటిల్లో పెట్టేసి వెళ్లిపోతూ..వద్దులే రెండే బావున్నాయని ఒకటి తీసేస్తుంది. 


Also Read: వసుధార విషయంలో గౌతమ్ కి షాకిచ్చిన రిషి, సర్ ప్రైజ్ చేసిన గౌతమ్..గుప్పెడంత మనసు మంగళవారం ఎపిసోడ్
పేపర్ చదువుతున్న రిషికి కాఫీ ఇస్తుంది ధరణి. గుడ్ మార్నింగ్ మిత్రమా అంటూ ఎంట్రీ ఇస్తాడు గౌతమ్. కాఫీ తీసుకుందామని గౌతమ్ అనుకునే లోగా ఇది నా కాఫీ అంటూ తీసుకుంటాడు రిషి. ఇది నాకే రాసుందని త్యాగం చేసెయ్ అన్న గౌతమ్ తో..ఈ కాఫీపై నీ పేరు లేదు..త్యాగం చేయడానికి కూడా కొన్ని పద్ధతులుంటాయంటాడు. పోనీ షేర్ చేసుకుందామా అంటే... అన్నీ షేర్ చేసుకోలేం, నీది కానిది ఎంత తపించినా నీకు రాదంటాడు రిషి. పొద్దున్నే విచిత్రంగా మాట్లాడుతున్నావ్ అన్న గౌతమ్ తో..సమయం సందర్భాన్ని బట్టి నేను పద్ధతి మార్చుకోను అంటాడు రిషి. నువ్వు మాట్లాడుతున్నది కాఫీ గురించేనా అన్న గౌతమ్ తో..నీకు ఎలా అర్థమైతే అలా అన్న రిషి..నువ్వెంత గింజుకున్నా నీకు దక్కాల్సింది నీకు దక్కుతుందంటాడు. నేను కాలేజీకి వెళుతున్నా.. నీ సంగతి నీ ఇష్టం అనేసి రిషి వెళ్లిపోతుంటే..నువ్వెక్కడికి వెళితే నేను కూడా అక్కడికే అంటాడు గౌతమ్. ఏంటో రిషి..అస్సలు అర్థంకాడు అనుకుంటాడు గౌతమ్.


Also Read: సీతాకోక చిలుకల్లా రెండు మనసులు ఊగిన నెమలి ఈక ఉయ్యాల, గుప్పెడంత మనసు ఎపిసోడ్ అంతా ప్రేమమయం..
కార్లో కాలేజీకి వెళుతుండగా..వసు నువ్వు హాల్లో పడుకున్నావేంటని అడుగుతుంది జగతి. చదువుతూ అలాగే నిద్రపోయా అన్న వసుతో..నీకు చదువుపై ఇంట్రెస్ట్ తగ్గిపోయింది అనుకున్నా అంటుంది జగతి. ఈ వారంలో మిషన్ ఎడ్యుకేషన్ కి సంబంధించి మెయిల్స్ అవి చెక్ చేయాలి..మీ ఎండీ గారికి చెప్పు అన్న జగతితో..మన ఎండీగారు అనండి మేడం అంటుంది వసు. మేడం మిషన్ ఎడ్యుకేషన్ ఫీల్డ్ వర్క్ కూడా చాలా పెండింగ్ పడింది..అది కూడా పూర్తిచేయాలి అన్న వసుతో..నువ్వు తలుచుకుంటే అయిపోతుందిలే నువ్వు చెబితే రిషి కాదంటాడా ఏంటి అంటుంది జగతి. ఇంతలో ఆ కారుని ఫాలో అవుతూ వెళుతుంటాడు గౌతమ్. కాలేజీలో దిగిన రిషి..ఇంట్లో గీసిన వసు బొమ్మని, వసుని తలుచుకుంటూ ఆమె ఇంకా రాలేదా అనుకుంటూ పుష్ప దగ్గరకు వెళ్లి అడుగుతాడు. లైబ్రరీకి వెళ్లిందని పుష్ప చెప్పడంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఎపిసోడ్ ముగిసింది...


రేపటి ఎపిసోడ్ లో 
వసుకి రోమియో జూలియట్ బుక్ ప్రెజెంట్ చేసిన రిషి.. అది చదువుతున్న వసు దగ్గరకు వెళ్లి ప్రేమంటే ఏంటో అర్థమైందా అంటాడు. ఇంతలో అక్కడకు గౌతమ్ ఎంట్రీ ఇస్తాడు...


Also Read: వసుపై ప్రేమతో ప్లేట్ ఫిరాయించిన రిషి, మహేంద్ర క్లాస్-జగతి షాక్, గుప్పెడంతమనసు శుక్రవారం ఎపిసోడ్
Also Read: డాక్టర్ బాబు తమ్ముడిని 'బుజ్జి బంగారం' అంటూ వెంటపడుతోన్న మోనిత
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి