గుప్పెడంత మనసు గురువారం ఎపిసోడ్  ( Guppedantha Manasu  December 8th Update Today Episode 628)


రిషి గిఫ్ట్ ఇచ్చిన చీర కట్టుకుని వచ్చిన వసుధారని చూసి మైమరిచిపోతాడు రిషి. ఆ తర్వాత గులాబీ ఇచ్చి పెట్టమని అడుగుతుంది. రిషి జడలో పువ్వు పెట్టి వసుని అద్దం ముందు నిల్చుని ఒకర్ని చూసి మరొకరు మురిసిపోతుంటారు. ఇంతలో గౌతమ్ పిలవడంతో త్వరగా రా అని చెప్పి రిషి బయటకు వెళ్లిపోతాడు. రిషి నీ డ్రెస్ చాలా బాగుందిరా అని చెప్పి.. మరి నా డ్రెస్ బావుందని చెప్పవా అని గౌతమ్ అడిగితే..నువ్వు చెప్పావని నేను చెబితే బాగుండదు అనేసి నీ డ్రెస్ కూడా బావుందిరా అంటాడు..


Also Read: మతి స్థిమితం కోల్పోయిన మోనిత, సౌందర్య ఆగ్రహం, ఇంటికి చేరిన దీప-కార్తీక్


దేవయాని నొప్పితో బాధపడుతూ ఉండగా ఇంతలో వసుధార చీర కట్టుకుని కిందికి దిగిరావడం చూసి దేవయాని షాక్ అవుతుంది. 
దేవయాని: ఏం వసుధార కొత్తదా
వసు:  బాగుంది కదా మేడం రిషి సార్ తీసుకువచ్చారనగానే దేవయాని షాక్ అవుతుంది. రిషి సెలక్షన్ గురించి వసుధార పొగుడుతూ మాట్లాడడంతో దేవయాని  కోపంతో రగిలిపోతూ ఉంటుంది.
రోజు రోజుకి వసుధార ఎక్కువ చేస్తోంది అనుకుంటూ.. అని కాలేజీ స్టాఫ్ కి ఫోన్ చేసి వసుధార విషయంలో ఒక ప్లాన్ చెబుతుంది. మరోవైపు పుష్ప మినిస్టర్ ఇంటికి వెళ్లి వసుధార ఎక్కడుందని కాలేజీ మేడంని అడిగితే.. రిషి సార్ ఎక్కడున్నారో వసుధార అక్కడే ఉంటుంది వెళ్లి వెతుక్కో అంటుంది. రిషి-వసుధార గురించి కామెంట్ చేస్తారు. 
ఆ తర్వాత వసుధార వంటల దగ్గరకు వెళ్లి సలహాలు,సూచనలు ఇస్తుంది. వసుని చూసి రిషి మురిసిపోతూ అక్కడకు వెళతాడు. అప్పుడు రిషి చెఫ్ గెటప్ లో రావడంతో అందరూ షాక్ అవుతారు. 
వసుధార దగ్గరికి వెళ్లి గొంతు మార్చి వంట పనులు ఎలా సాగుతున్నాయి అమ్మ అని అనడంతో బాగానే సాగుతున్నాయి అని  వెనక్కు తిరిగిన రిషిని చూసి షాక్ అవుతుంది.
వసు: వంట మాస్టర్ గారు మా రిషి సార్ కి ఆలూ ఫ్రై చాలా ఇష్టం బాగా చేయండి అని చెప్పి రిషితో ఒక సెల్ఫీ దిగుతుంది. 
రిషి: వనభోజనానికి రావడం చాలా సంతోషంగా ఉంది అని మాట్లాడుకుంటూ ఉంటారు.  డాడ్ వాళ్ళు కూడా వచ్చింటే ఇంకా బాగుండేది


Also Read: రిషిధార రొమాంటిక్ మూమెంట్స్, దేవయానికి ఝలక్ ఇచ్చిన గౌతమ్!


లాస్ట్ టైం జరిగిన వన భోజనాలు బాగా ఎంజాయ్ చేసాము కదా సార్ అని అనడంతో వెంటనే రిషి అప్పుడు జరిగిన విషయాలు అన్నీ గుర్తు తెచ్చుకుంటాడు.ఇక్కడ స్టూడెంట్స్ ని గ్రూపులుగా డివైడ్ చేశారంట ఇక్కడ పనులు చూసుకోవడానికి అని వసు అంటే సరే కానీ  ఈ గౌతమ్ గాడు కనపడలేదంటాడు. ఆ వాలంటీర్స్ కి గౌతమ్ సారి హెడ్ అనడంతో ఇంకా సూపర్ అని అంటాడు రిషి. మీకు గెటప్ అంత బాగోలేదు తీసేయండి అనడంతో రిషి తీసేస్తాడు. అక్కడి నుంచి వెళ్లిపోతుండగా..వసుధార డ్రెస్ సరిగా ఉండకపోవడం చూసి ఏం చేయాలి అనే ఆలోచనలో పడతాడు. అప్పుడు ఫొటో తీసి వసుకి సెండ్ చేస్తాడు. సరిచేసుకునేందుకు వసు ఇబ్బంది పడడం చూసి రిషి హెల్ప్ చేస్తాడు. ఇదంతా చూసిన కాలేజీ స్టాఫ్ కొందరు చెడుగా మాట్లాడతారు.  ఆ మాటలు విన్న వసుధార షాక్ అవుతుంది. వసు గమనిస్తోందని తెలిసి మరింత రెచ్చిపోయి మాట్లాడతారు కాలేజీ స్టాఫ్. వసుధార ఏం మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలో గౌతం అక్కడికి వచ్చి వారి పై సీరియస్ అవుతాడు. అక్కడికి ధరణి రావడంతో వదిన మీరు ఇవి తీసుకెళ్లండి ఈ మేడం వాళ్ళకి చిన్న ప్రాబ్లం ఉంది అది సరిచేసి నేను అక్కడికి వస్తాను అని అంటారు గౌతమ్.
 
గౌతమ్: మీరు మాట్లాడింది తప్పు మేడం. వసుధార ఇక్కడ అందరి ముందు ఇబ్బంది పడుతుండగా రిషి సహాయం చేశాడు అలాంటిది మీరు నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతారా మీ ఇళ్లలో  ఇలాంటివి జరగవా . మీరు ఇన్ని మాటలు అన్న వసుధార ఏం మాట్లాడకుండా ఎందుకు వెళ్లిందో తెలుసా తనకి సంస్కారం ఉంది. మీరిద్దరూ మాట్లాడిన మాటలు ప్రతి ఒకటి రిషి చెబితే తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి.మీరు వెళ్లి వసుధారకి సోరీ చెప్పకపోతే మీరు మాట్లాడిన మాటలు వెళ్లి నేను రిషికి చెబుతాను అని అంటాడు


ఆ తర్వాత గౌతమ్ రిషి దగ్గరకు వెళ్లి...మినిస్టర్ గారు వస్తున్నారు వెళదాం పద అంటాడు.. వదినా వసుధారని రమ్మని చెప్పండి అని ధరణికి చెబుతాడు. నీకు కాఫీ కావాలా అని ధరణి అడిగితే..ఇక్కడ కూడా మీరు సర్వ్ చేస్తారా అంటాడు. థ్యాంక్స్ వదినా అనేసి..వసుధారని రమ్మని చెప్పండి అంటాడు. అటు వసుధార ఓ చెట్టు దగ్గర నిల్చుని..కాలేజీ మేడమ్స్ అన్న మాటలు తలుచుకుని బాధపడుతూ ఉంటుంది..
ఎపిసోడ్ ముగిసింది