గుప్పెడంత మనసు శుక్రవారం ఎపిసోడ్ ( Guppedantha Manasu December 2nd Update Today Episode 623)
తల్లిదండ్రులు ఇంటికి వచ్చిన ఆనందంలో ఉన్న రిషి..వసుతో నైట్ లాంగ్ డ్రైవ్ కి వెళతాడు. ఓ దగ్గర కారు ఆపి ఇద్దరూ ప్రేమ గురించి కబుర్లు చెప్పుకుంటూ ఉండగా..నలుగురు కుర్రాళ్లు తాగివచ్చి అసభ్యంగా మాట్లాడతారు. చిన్నపాటి ఫైట్ చేస్తాడు రిషి. తన షర్ట్ పై ఆల్కాహాల్ పడిపోవడంతో...ఇలా ఇంటికి వెళితేదేవయాని మేడం ప్రశ్నలు తట్టుకోలేం అన్న వసుధార..గౌతమ్ సార్ ఇంటికెళ్లి డ్రెస్సు మార్చుకుని వెళదాం అంటుంది. సరే అని వెళతారు. అనుకోకుండా రిషి రావడంతో గౌతమ్ టెన్షన్ పడతాడు..వీడికి నిజం తెలిసిపోయిందా ఏంటి అనుకుంటాడు. ఆ తర్వాత డ్రెస్సు కోసం వచ్చాడని తెలిసి హమ్మయ్య అనుకుంటాడు.
దేవయాని: వెళ్లిపోయిందనుకున్న జగతి మళ్లీ వచ్చి చేరింది అనుకుంటూ వెళ్లి జగతి రూమ్ డోర్ తీసి చూస్తుంది దేవయాని.. అక్కడ ధరణి ఉండడంతో వసుధార లేదేంటి అనుకుంటుంది... డౌట్ వచ్చి.. బయటకు చూస్తే కారు కనిపించదు..గేట్లు తీసి ఉంటాయి. వసు కనిపించడం లేదు..రిషి కారు లేదు..అంటే ఇద్దరూ బయటకు వెళ్లారన్నమాట అని మండిపడుతుంది. రిషి తప్పులేదు వసుధారే రిషిని చెడగొడుతోంది..నన్ను చాలా తక్కువ అంచనా వేశావ్ నీ సంగతి త్వరలోనే చెబుతాను అనుకుంటుంది దేవయాని..
Also Read: హమ్మయ్య దీప-కార్తీక్ కలసిపోయారు, సౌందర్య ఇంట్లో కోడలిగా మోనిత బిల్డప్
రూమ్ లోకి వెళ్లిన రిషి డ్రెస్సు మార్చుకుని వస్తాడు..అది బాలేదు ఇంకోటి మార్చుకో అని గౌతమ్ అంటే నా యిష్టం అంటాడు రిషి. ఇంతలో ఫోన్ మర్చిపోయాను అనుకుంటూ వెళతాడు... మహేంద్ర వస్తువులు అక్కడ కొన్ని ఉండిపోతాయి..( ఫొటో ఫ్రేమ్, పెర్ ఫ్యూమ్, వాచ్)..అవి చూసిన రిషికి డౌట్ వస్తుంది. వాచ్ చూసి నేనే ఇది డాడ్ కీ గిఫ్ట్ గా ఇచ్చాను కదా మరి ఇక్కడ ఎందుకు ఉంది అనుకుంటూ ఉంటాడు రిషి. అప్పుడు రిషి ఒకవేళ నేను ఇచ్చిన గిఫ్ట్ ని గౌతమ్ కి డాడ్ గిఫ్ట్గా ఇచ్చుంటాడేమో అనుకుని సరిపెట్టుకుంటాడు...కానీ ఇంతలోనే అక్కడ మహేంద్ర రిషి ఫోటో కనిపించడంతో అది చూసి రిషి షాక్ అవుతాడు. అంటే ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి అంటే డాట్ వాళ్ళు ఇక్కడే ఉన్నారా అనుకుంటూ బయటికి వెళ్తాడు రిషి.
Also Read: తండ్రి రాకతో రిషిలో ఉత్సాహం, అర్థరాత్రి వసుతో షికార్లు
అప్పుడు రిషి వాచి ఫోటో చూపించి ఏంట్రా ఇది అని అడుగుతాడు. డాడ్ వాళ్ళు ఇన్నాళ్లు ఇక్కడే ఉన్నారు కదా అని అడుగుతాడు రిషి. డాడ్ మేడం వాళ్లకి షెల్టర్ ఇచ్చి ఎంత బాగా నాటకం ఆడావు రా అని అంటాడు రిషి. అప్పుడు వీడు నా చిన్నప్పటి స్నేహితుడు అందుకే డాడీ వాళ్లు ఇక్కడ ఉన్నా కూడా నాకు చెప్పలేదని రిషి అనడంతో.. గౌతమ్ టెన్షన్ పడుతుంటాడు. డాడ్ వాళ్ళు ఎక్కడికి వెళ్లారని అని నేను ఏడుస్తున్న కూడా నువ్వు ఇంట్లోనే పెట్టుకుని తమాషా చూశావని రిషి ఫైర అవుతాడు. గౌతమ్ అసలు విషయం చెప్పడానికి ప్రయత్నించినా రిషి మాట్లాడనివ్వడు. మిత్ర ద్రోహి ఇంత మోసమా డాడీ కోసం పిచ్చోడిలా మారిపోయాను కదరా నీకు కొంచెం కూడా బాధగా అనిపించలేదా అని నిలదీస్తాడు. దీనికంటే నన్ను కత్తితో పొడిచి చంపేసింది ఇంకా బాగుండేది అని బాధపడతాడు రిషి.