Guppedantha Manasu December 1st Update: తండ్రి రాకతో రిషిలో ఉత్సాహం, అర్థరాత్రి వసుతో షికార్లు

Guppedantha Manasu December 1st Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

Continues below advertisement

గుప్పెడంత మనసు గురువారం ఎపిసోడ్  ( Guppedantha Manasu  December 1st Update Today Episode 622)

Continues below advertisement

రిషి జగతితో మాట్లాడుతుంటాడు
రిషి: డాడ్ కి మీరంటే ఎంత గొప్ప ప్రేమో మీ కంటే నాకే బాగా తెలుసు. ఈ విషయం బహుశా మీకు ఇంతవరకు తెలియదేమో. డాడ్ ఆనందం కోసం మిమ్మల్ని ఇంటికి రమ్మని చెప్పి రిక్వెస్ట్ చేశాను. డాడ్ కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమే..కానీ..ఇంకొక బంధం కోసమో ఇంకొక బంధాన్ని కలుపుకోవడం కోసమో కాదు . మీరంటే నాకు గౌరవం ఉంది..గౌరవమే ఉంది.
జగతి: రిషి నేను ఎప్పుడో నేను ఇంటికి దూరమయ్యాను..ఇంటికి మాత్రమే దూరమయ్యాను..బంధాలకు కాదుగా.. సంవత్సరాల కొద్దీ మహేంద్రకి దూరమైనా మా బంధం అలాగే ఉంది..
రిషి: డాడ్ కి మీరు దగ్గరగా వచ్చినప్పుడు డాడ్ ముఖంపై చిరునవ్వు కనిపించింది. డాడ్ కి మీరు తోడుగా ఉండాలి..ఎప్పుడు డాడ్ ఆనందంగా ఉండాలి నా కళ్ళముందే ఉండాలి ఇంతకుమించి నేను ఏమీ కోరుకోవడం లేదు
జగతి: నేను కూడా జీవితంలో నువ్వు వసుధార ఇద్దరూ..
రిషి: జగతి మాటలు మధ్యలోనే ఆపేసిన రిషి..వసుధారని మీ శిష్యురాలు అని ఇష్టపడలేదు. వసుధారని వసుధార గానె ప్రేమించాను 
జగతి: వసుధారని ప్రేమిస్తున్నావు అన్న విషయాన్ని నీ కంటే ముందు నేను చెప్పాను ఆ మాట గుర్తుందా
రిషి: మేడం వసుధార నాతో కలిసి చివరి వరకు ప్రయాణం చేస్తుంది ఇందులో ఎటువంటి మార్పు లేదు  ( జగతి ఆ మాటలకు సంతోషిస్తుంది)
జగతి: రిషి డాడ్ అంటే ప్రేమ అన్నావు నేనంటే గౌరవం అన్నావు నేను ఎప్పటికీ జగతి మేడం గా గౌరవాన్ని అందుకోవాలా . 
జీవితాంతం మేడం అన్న పిలుపుతోనే సరి పెట్టుకోవాలా ...నాకు తల్లిగా ఉండే అర్హత దొరకదా, రాదా రిషి అని ఎమోషనల్ అవుతుంది రిషి మౌనంగా ఉండిపోతాడు...అక్కడకు వసుధార వస్తుంది..ఏంటి ఇద్దరూ మౌనంగా ఉన్నారని అడుగుతుంది..
రిషి: మేడం గారికి ఏం కావాలో జాగ్రత్తగా చూసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు

Also Read: కార్తీక్ గురించి దీపకి నిజం చెప్పేసిన డాక్టర్, మోనితను బంధించిన సౌందర్య

గౌతమ్-మహేంద్ర: మరోవైపు... గౌతమ్, రిషి-మహేంద్ర ల ఫోటో చూస్తూ అంకుల్ వాళ్ళు ఇక్కడే ఉన్నారని తెలిస్తే వాడు ఎప్పటికీ నన్ను క్షమించడు ఫ్రెండ్ గా అసలు యాక్సెప్ట్ చేయడు అని భయపడుతూ ఉంటాడు. ఇంతలోనే మహేంద్ర గౌతమ్ కి ఫోన్ చేసి థ్యాంక్స్ చెబుతాడు. అప్పుడు గౌతమ్ మీరు నాకు థాంక్స్ చెప్పడం ఏంటి అంకుల్ మీరు ఇక్కడున్న విషయం తెలిస్తే రిషి నన్ను ఎక్కడ కోప్పడతాడో అన్న విషయం తలుచుకుంటేనే భయంగా ఉంది అని అంటాడు. ఒక మంచి పని కోసం సహాయం చేశావు నీ రుణం ఎప్పుడు తీర్చుకోలేను అంటే అంత పెద్దమాటలు ఎందుకు అంటాడు గౌతమ్. ఇక్కడ మీ ఫోటో పెర్ఫ్యూమ్ వాచ్ ఉన్నాయి వాటిని చూస్తే నాకు భయమేస్తోంది అని అనగా ఎందుకు భయం గౌతం అని అడగగా నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావ్ అని అనడంతో లేదు అంకుల్ వాడికి నిజం తెలిసినట్టు వాడు నన్ను దూరం పెడుతున్నట్టు ఏవేవో వస్తున్నాయి అని అనగా నువ్వేం టెన్షన్ పడకు గౌతమ్ అని అంటాడు మహేంద్ర. నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావ్ అని ధైర్యం చెబుతాడు..

Also Read:  జగతి ఆనందంపై నీళ్లు చల్లేసిన రిషి, మరో కుట్ర ప్లాన్ చేస్తోన్న దేవయాని!

ఆ తర్వాత అందరు కలిసి భోజనం చేస్తుండగా అప్పుడు ఫణింద్ర అమ్మ నువ్వు కూడా కూర్చుని భోజనం చెయ్యి వసుధార అని అనగా లేదు సార్ నేను జగతి మేడంకి భోజనం తీసుకుని వెళ్లాలి అనడంతో దేవయాని కుళ్లుకుంటుంది. అప్పుడు మహేంద్ర వసుధారని పొగడడంతో ఫణింద్ర కూడా పొగుడుతూ ఉంటాడు. ఆ తర్వాత వసుధార జగతికి భోజనం తీసుకుని వెళ్లి తినిపిస్తూ ఉంటుంది. అప్పుడు రిషి భోజనం చేయకుండా వెళ్ళిపోతూ ఉండగా ఏమైంది అని అందరూ అడగక తర్వాత తింటాను అని అంటాడు. అప్పుడు ధరణి తినడానికి కూర్చోవడంతో రిషి వడ్డిస్తూ ఉంటాడు. నువ్వు తిను అని ఫణింద్ర అనడంతో నేను,వసు కలిసి తింటాను అని చెబుతాడు...దేవయాని రగిలిపోతుంది.వసుని రమ్మని మెసేజ్ చేసిన రిషి... వసు బయటకు రావడంతో కాస్త నీ టైం కావాలి మనిద్దరం కలిసి బయటికి వెళ్దాం అంటాడు. అప్పుడు ధరణి అక్కడికి రావడంతో మేడం నీ జాగ్రత్తగా చూసుకోండి మేము బయటకు వెళ్తున్నాం అని చెప్పి బయటకు వెళ్ళిపోతారు రిషి వసుధార. డాడ్  వాళ్ళు ఇంటికి వచ్చారు కదా వసుధార పార్టీ చేద్దాం అనుకున్నాను కానీ డాడ్ వాళ్లకి అలా ఉండడంతో మౌనంగా ఉన్నాను అంటాడు రిషి. రిషి ఆనందం చూసి వసు మురిసిపోతుంది. 

Continues below advertisement
Sponsored Links by Taboola