తీవ్ర సంచలనం రేపుతున్న వరంగల్ లా విద్యార్థిని రేప్ కేసులో మరిన్ని దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వరంగల్‌కు చెందిన ఎమ్మెల్యే నరేందర్ ప్రైవేట్ పీఏ శివ ఆగడాలను పోలీసులు వెలికి తీస్తున్నారు. యువతి ఫిర్యాదుతో ప్రాథమికంగా దొరికిన సమాచారం ఆధారంగా మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. దీంతో ఇంకా ఎన్ని ఆగడాలు శివ గ్యాంగ్ చేసిందో అన్న కోణంలో దర్యాపప్తు సాగుతోంది.
వరంగల్‌కు చెందిన ఎమ్యెల్యే నరేందర్ ప్రైవేట్ పీఏ శివ అతని స్నేహితుడితోపాటు హాస్టల్ ఓనర్‌పై హన్మకొండ పోలీస్ స్టేషన్‌లో ఓ యువతి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగం పెంచారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతోపాటు లైంగిక దాడి యత్నం ఫిర్యాదు మేరకు 527/2022, SC/ST, 506, 376, 109, ఆక్ట్-2015 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. శివతో పాటు అతడి స్నేహితుడిని, హాస్టల్ నిర్వాహాకురాలిన అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనలో నిందితుల వివరాలు బయటకు రాకుండా హన్మకొండ పోలీసులు గోప్యంగా ఉంచే ప్రయత్నం చేసినా సాధ్యం పడలేదని తెలుస్తోంది.
సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని(23) హన్మకొండలోని ఓ కళాశాలలో ఎల్ఎల్‌బీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. సుబేదారి ప్రాంతంలో ఓ ప్రైవేటు హాస్టల్‌లో ఉంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే విద్యార్థినికి ఏవో మాయ మాటలు చెప్పి ఎమ్మెల్యే పీఏ శివ, అతడి స్నేహితుడి వద్దకు హాస్టల్ నిర్వాహాకురాలు తీసుకెళ్లగా వారు లైంగిక దాడికి యత్నించినట్లుగా తెలుస్తోంది. యువతి హన్మకొండ పోలీసులను బుధవారం ఆశ్రయించగా ప్రాథమిక వివరాలను సేకరించి నిర్ధారించుకున్నాక గురువారం కేసు నమోదు చేసినట్లు సమాచారం.
ఈ మొత్తం ఎపిసోడ్‌లో హాస్టల్ ఓనర్ పాత్రే చాలా కీలకంగా మారినట్లుగా తెలుస్తోంది. శివ చెరలో ఇదే హాస్టల్‌కు చెందిన 10మందికిపైగా అమ్మాయిలు ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఈ కేసు ఆధారంగా తీగ లాగితే మరిన్ని కోణాలు, కొంతమంది ప్రముఖుల వ్యవహారాలు బయటకు వస్తాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. విచారణ పారదర్శకంగా జరపాలని ప్రజా సంఘాలు, మహిళ సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు.
వరంగల్ జిల్లా హన్మకొండలో ఓ కళాశాలలో ఎల్ఎల్‌బీ చదువుతున్న విద్యార్థినిపై ఎమ్మెల్యే పీఏ అతని స్నేహితుడు అత్యాచార యత్నం చేశారు. తనపై లైంగికదాడి జరిగిందని బుధవారం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరిపి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటన గురించి తెలుసుకున్న ప్రజల్లో టెన్షన్ మొదలైంది. వరంగల్ లాంటి ప్రాంతంలో ఇలాంటివి జరగడంపై జనాలు విస్తుపోయారు. లోతైన దర్యాప్తు చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుకుతున్నారు. ఇది రాజకీయంగా కూడా దుమారం రేపే అవకాశం ఉంది. అందుకే ఈ కేసును గోప్యంగా దర్యాప్తు చేయాలని పోలీసులు భావించారు కానీ... మీడియాకు విషయం లీక్ అయింది. దీంతో పోలీసులు షాక్‌కు గురయ్యారు. దీనిపై వివరాలు వెల్లడించే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది.