గుప్పెడంత మనసు (Guppedantha Manasu) మార్చి 7 సోమవారం ఎపిసోడ్



రిషి సార్ మనసు బాగాపోతే కాలేజీకి వస్తారు కదా ఇంకా రాలేదేంటని మెట్లపై కూర్చుని ఆలోచిస్తుంటుంది వసుధార. ఇంతలో రిషి రానే వస్తాడు. 
రిషి: ఇంత పొద్దున్నే వచ్చావేంటి
వసుధార: మీరుకూడా వచ్చారేంటి..ఇంకా టైం ఉంది కదా
రిషి: నాకంటూ వేరే ప్రపంచం వేరే మనుషులు ఎవరుంటారు, ఇల్లు-డాడ్-ఈ కాలేజీ ఇదే కదా నా జీవితం, నా లోకం
అదే సమయానికి జగతి కూడా కాలేజీకి వస్తుంది. ఏదో ఆలోచనలో అలా నడుచుకుంటూ వెళుతుంది. అటు మహేంద్ర కూడా కాలేజీకి వచ్చి దూరం నుంచి జగతిని చూస్తాడు. మిషన్ ఎడ్యుకేషన్ అని వసు ఏదో చెప్పబోతుంటే అక్కడి నుంచి వెళ్లిపోతాడు రిషి...


ఎంట్రన్స్ దగ్గర జగతి-రిషి ఎదురుపడతారు. ( దూరం నుంచి చూస్తున్న మహేంద్ర-వసుధార ఇప్పుడేం జరుగుతుందో అనుకుంటారు). నీ కళ్లలోకి ఎలా చూడగలను. జరిగిన దానికి నువ్వెంత బాధపడుతున్నావో కదా అనుకుంటుంది జగతి. రిషి ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. థ్యాంక్స్ జగతి రావేమో అనుకున్నాను అన్న మహేంద్రతో...నాకంటూ వేరే ప్రపంచం, వేరే మనుషులు ఎవరున్నారు మహేంద్ర..నా ఇల్లు, నా ఒంటరితనం, ఈ కాలేజ్ ఇదే కదా నా జీవితం, ప్రపంచం అంటుంది. వెంటనే రిషి కూడా సేమ్ డైలాగ్స్ చెప్పినట్టు గుర్తుచేసుకుంటుంది వసుధార. ఎవరికి వారు వారి వారి రూమ్స్ కి వెళ్లిపోతారు. ఇద్దరి మనసులు-మాటలు-బాధ అన్నీ ఒకటే..కానీ ఇద్దరి దారులు మాత్రం వేర్వేరు..ఇద్దరూ ఎప్పటికి కలుస్తారో ఏంటో అనుకుంటుంది వసుధార.


క్లాస్ రూమ్ లో: వసుధారతో పుష్ప ఏదో మాట్లాడుతున్నా డల్ గానే ఉంటుంది. వింటున్నావా అంటే..ఏదో చెబుతున్నావ్ ఏంటి పుష్ప అనగానే ఏం లేదులే అంటుంది. క్లాస్ కి వస్తాడు రిషి. అంతా లేచి గుడ్ మార్నింగ్ చెబితే సిట్ డౌన్ అంటాడు. అంతా కూర్చున్నా వసుధార మాత్రం నిల్చునే ఉంటుంది( జగతి మేడం ఎదురైనప్పుడు పలకరిస్తే మీ సొమ్మేం పోయేది అని అడిగినట్టు ఊహించుకుంటుంది). వసు నువ్వు కూర్చో అని పుష్ప చేయిపట్టి లాగుతుంది. నేను రిషి సార్ దగ్గరకు వెళ్లానా అని అడిగితే..ఏం లేదు..కాసేపైతే నిన్ను బయటకు పంపించేవారు అంటుంది. నా పరిస్థితే అలా ఉంటే..రిషి సార్ పరిస్థితి ఎలా ఉందో అనుకుంటుంది. చేతిలో బుక్ ఒకటైతే మరో టాపిక్ గురించి మాట్లాడతాడు రిషి. ఓ స్టూడెంట్ లేచి..మీ చేతిలో ఉన్న బుక్ వేరే సార్ అని చెప్పడంతో నెక్స్ట్ క్లాసులో చూస్తానంటూ వెళ్లిపోతాడు.


Also Read: ఈ రోజే ఆఖరి రోజు అన్న కార్తీక్ మాటలకు షాక్ అయిన దీప
వసుధార: కాలేజీ మెట్లపై కూర్చుని రిషి, జగతి మాటలు అన్నీ తలుచుకుంటుంది. అనగనగా ఓ రాజ్యంలో ఓ రాకుమారుడు ఉండేవాడు..ఆ రాకుమాడుకు ఎవరికి ఏ కష్టం వచ్చినా ఇట్టే పరిష్కరించేవాడు. కానీ అనుకోకుండా ఓ రోజు ఆ రాకుమారుడికే సమస్య వచ్చిందని  ఫోన్లో కథ చెబుతుంటుంది. పాపం ఆ సమస్యను పరిష్కరించడం మానేసి టెన్షన్ పడుతున్నాడంట. అయితే రాజు అందరి సమస్యలు పరిష్కరించాలి ..తన సమస్యను కూడా...ఎందుకంటే రాజుకైనా, రాకుమారుడికి అయినా టైం చాలా విలువైంది కదా ...ఆ రాకుమారుడికి ఇదెందుకు తట్టలేదో మరి.
రిషి: వసు మాటలు విని దగ్గరకు వచ్చి పోన్ లాక్కుని... ఏంటిది... నా బాధ నీకు కథావస్తువుగా మారిందా..నా సమస్య నాది..దాంతో నీకెలాంటి సంబంధం లేదు. నేను కథ చెప్పుకుంటున్నా అన్న వసుతో... నువ్వు చెప్పింది నా కథే కదా  ఎవరికి చెబుతున్నావ్ అంటాడు. 
వసుధార: ఓ గ్రూప్ ఉంది...చిన్నపిల్లలకు రోజుకో కథ చెప్పి పోస్ట్ చేస్తుంటా
రిషి: నన్ను నువ్వు ప్రిన్స్ అన్నావ్... నా బాధనీకు కథా వస్తువుగా మారిందా. ఇది మా తాతగారు స్తాపించిన విద్యా సామ్రాజ్యం, ఇందులో ఆయనకు మనవడిగా నేను రాకుమారుడినే... ఎండీగా అందరి ససమ్యలు నేను పరిష్కరిస్తున్నాను..ఇదే కదా నువ్వు చెప్పిన కథ
వసుధార: అనుకోకుండా కథ అలా కలిసింది
రిషి: మీ అందరికీ ఇది కాలేజీ మాత్రమే...కానీ నాకు ఇదో దేవాయం, ఇదే జీవితం, ఇదే ప్రపంచం...మా కుటుంబానకి ఓ గౌరవం ఉంది..భూషణ్ వంశానికి ఇదొక కిరీటం..వేరే పరిస్థితుల్లో అయితే నేను ఈ కాలేజీకి వచ్చి ఉండేవాడిని కాదు...ఈ కాలేజీని నేను పవిత్రంగా భావిస్తున్నా కాబట్టే అన్నీ నా గుండెల్లో దాచుకుని మానసికంగా స్ట్రాంగ్ గా ఉంటున్నాను...దటీజ్ రిషీంద్ర భూషణ్..తెలుసా... నా సమస్య, నా జీవితం, నా వ్యక్తిగతం ఇవన్నీ నీకెందుకు..నన్నేది ప్రభావితం చేయలేదు..చేసినా..అది కొన్ని క్షణాలు మాత్రమే..నా జీవితం నీకు కథగా మారిందా..ఇంకోసారి ఇలా ఆలోచించకు.
గౌతమ్: రేయ్ ఇక్కడున్నావా...ఏంటిరా ఇద్దరూ ఏం మాట్లాడరేంటి...సడెన్ గా ఎంట్రీ ఇచ్చి సర్ ప్రైజ్ చేశానా...నేను అంతేరా..పెద్దమ్మ లంచ్ పంపించారు రా తిందాం... వసుధార మాతో కలసి లంచ్ చేయొచ్చు కదా 
వసుధార: నేను బాక్స్ తెచ్చుకున్నాను
గౌతమ్: బాక్స్ తెచ్చుకున్నావా లేదా అని అడగలేదు..నేను లంచ్ కి రమ్మన్నాను
వసుధార: నేను ఇంకోసారి వస్తాను...మీరు వెళ్లండి
గౌతమ్: రిషి నువ్వెళ్లరా..నేను వసుధారతో కలసి లంచ్ చేస్తాను. కోపంగా చూసిన రిషిని చూసి కొడతాడా ఏంటి అనుకుంటాడు
రిషి: పద వసుధార లంచ్ చేద్దాం
వసుధార: అంతలోనే కోపం, అంతలోనే ప్రేమ..మీరు నిజంగా ప్రిన్స్ సార్, జెంటిల్మెన్


Also Read: రిషి బాధను దూరం చేసే పనిలో పడిన వసుధార, ఆశ్చర్యంలో గౌతమ్
కాలేజీలో ఇద్దరు లెక్చరర్లు 
జగతి మేడంని చూశావా అని ఇద్దరు లెక్చరర్లు మాట్లాడుకుంటారు.  మహేంద్ర గారికి ఆమెకి మధ్య ఏముందో అయినా మనకి ఎందుకులే ఇప్పుడు అందరకీ తెలుసు అనుకుంటూ వెళ్లిపోతారు. అదంతా విన్న మహేంద్ర..గుండెల్లో అగ్ని పర్వతం బద్దలవుతున్నా కంట్రోల్ చేసుకోవడం జగతికి మాత్రమే చెల్లిందనుకుంటూ ఆమె దగ్గరకు వెళతాడు.
మహేంద్ర: ఏం చూస్తున్నావ్
జగతి: రిషిని చూస్తున్నా..బాధని ఎలా కంట్రోల్ చేసుకుంటున్నాడో కదా
మహేంద్ర: బాధ ఒకరికి ఎక్కువ, తక్కువ అని ఉండదు
జగతి: మన జీవితాన్ని చూశాం..రిషి చిన్న పిల్లాడు...అంత బాధని ఎలా ఓర్చుకుంటున్నాడో
మహేంద్ర: నువ్వు సమస్యని ఒకవైపే చూస్తున్నావ్.. రెండో వైపు చూడు అర్థం అవుతుంది


రేపటి ( మంగళవారం) ఎపిసోడ్ లో
భార్య భర్తలు, తల్లి కొడుకులు అని ప్రపంచానికి తెలియకుండా బాగా నమ్మించారు కదా  అని ఇద్దరు లెక్చలర్లు మాట్లాడుకుంటారు. ఆ మాటలు విన్న రిషి..జగతిని తన క్యాబిన్ కి పిలుస్తాడు. ఏం మాట్లాడాలో, ఏం చెప్పాలో తెలియడం లేదంటాడు. నన్ను ఏం చేయమంటారు సార్ అన్న జగతితో...ప్రశ్నించే గొంతులు ఆగాలి, వెనుక గుసగుసలు ఆగాలంటాడు. అక్కడి నుంచి జగతి ఏడుస్తూ బయటకు వెళ్లిపోతుంది. ఇదంతా రూమ్ బయటే నిల్చున్న వసుధార వింటుంది.