సు తలస్నానం చేసే ఆరబెట్టుకుంటుంటే రిషి హెయిర్ డ్రయ్యర్‌ తో ఆరబెట్టడానికి చూస్తాడు. హెయిర్ డ్రయర్ లాక్కోడానికి వసూ ట్రై చేస్తూ ఇద్దరూ ఒకరి మీద ఒకరు పడిపోతారు. కాసేపు ఇద్దరు చూపులు కలుసుకుంటాయి. అప్పుడే ధరణి వచ్చి రిషిని పిలుస్తుంది. ఫోన్ వచ్చింది అని తెచ్చి ఫోన్ ఇస్తుంది.


వసు.. రిషి తన దగ్గరకు వచ్చి చేసిన పని గురించి గుర్తుచేసుకొని మురిసిపోతూ ఉంటుంది. వసూ.. రుషిని చూస్తూ తనలో తనే మాట్లాడుకుంటుంది. ‘‘నీ మంకు పట్టు వల్లే మహేంద్ర సారు దూరమయ్యారు. అమ్మ అనే పిలుపు కోసం.. నాన్న అనే పిలుపుని దూరం చేసుకున్నావు. ఇదంతా నీ వల్లే జరుగుతుంది. కొన్ని సమస్యలకు కాలమే పరిష్కారం చూపిస్తుంది’’ అని అనుకుంటుంది. 


మహేంద్ర, జగతి మినిస్టర్‌ను కలుస్తారు. ‘‘మిషన్ ఎడ్యుకేషన్ వేరే ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేయాలని వాళ్ళకి కాల్ చేస్తున్నారు. మేము ఆ పని చూసుకుంటాం’’ అని జగతి మినిస్టర్‌కు చెప్తుంది. ఒక ఆథరైజేషన్ లెటర్‌ను మినిస్టర్‌కు ఇస్తుంది. ‘‘అదేంటి మేడం? మీరందరూ ఒకటే కుటుంబం కదా మళ్లీ ఈ లెటర్ ద్వారా ఎందుకు? ఒకటి, రెండు పనులు మీరే సర్దుకోవచ్చు కదా?’’ అని మినిస్టర్ మహేంద్ర, జగతీలను ప్రశ్నిస్తాడు. ‘‘జరిగితే బాగుంటుంది కదా’’ అని మహేంద్ర కవర్ చేస్తాడు.
 
మహేంద్ర, జగతి కంగారుగా మినిస్టర్ దగ్గర నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తారు. ‘‘రిషి ఎక్కడ తను ఇంకా రాలేదేంటి?’’ అని మినిస్టర్ అడుగుతారు. మహేంద్ర వాళ్లు ఇంట్లో నుంచి బయటకు వెళ్తుంటే.. అప్పుడే రిషి కారు లోపలికి వస్తుంది. రిషి ఇంట్లోకి రావడం గమనించిన మహీంద్రా, జగతి వేరే దారి గుండా బయటికి వెళ్ళిపోతారు. అప్పుడే రిషికి తన తండ్రి దగ్గరగా ఉన్న ఫిలింగ్ కలుగుతుంది. పెర్ఫ్యూమ్ స్మెల్ గ్రహించిన రిషి.. డాడీ వచ్చారంటూ మినిస్టర్ దగ్గరికి పరుగులు తీస్తాడు. డాడ్ వాళ్లు వచ్చి ఎంత సేపు అయింది? అని అడుగుతాడు. ఇప్పుడే వచ్చి వెళ్లారని మినిస్టర్ చెప్పడంతో రిషి బయటికి పరిగెడతాడు. అప్పటికే మహేంద్ర జగతి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ సీన్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. 


రుషి అక్కడ వాచ్‌మ్యాన్‌ను అడుగుతాడు. అదంతా మహేంద్ర, జగతి చాటుగా గమనిస్తూనే ఉంటారు. అందుకేనా మహేంద్ర రిషికి తెలియని కారు తీసుకొచ్చింది అని జగతి బాధపడుతుంది. అవును, జగతి రిషిని చూసి కొన్ని యుగాలు అయినట్లుంది అని మహేంద్ర బాధగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మినిస్టర్.. ‘‘ఏమైంది రిషి అంత కంగారుగా వెళ్ళాడు’’ అని అడుగుతారు. మినిస్టర్‌కు ఈ విషయాలన్నీ చెప్పడం అంత బాగోదు అని వసు మనసులో అనుకుంటుంది. సర్ తో ఏదో అర్జెంటు పని ఉంది అనుకుంటా అందుకే వెళ్లారు అని కవర్ చేస్తుంది.


వసు మహేందర్ కనిపించారా సార్ అని చిన్నగా రిషిని అడుగుతుంది. లేదని రిషి సైగ చేస్తాడు. కొత్త ప్రాజెక్టుకు సంబంధించి కృషితో ఫైల్స్ మీద సంతకాలు తీసుకుంటారు. మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు కోసం మహేంద్ర జగతి వాళ్ళు సర్వేకి వెళ్లారని, దానికి సంబంధించిన బాధ్యతలు అన్నీ చూసుకోవాల్సిందిగా వసుకి ఒక లెటర్ ఇచ్చారని మిస్టర్ గారు రిషికి చెప్తాడు. లెటర్ ఇచ్చారా? అని రిషి షాక్‌ అవుతాడు. అవును అని మినిస్టర్ బదిలిస్తారు. సర్వే కోసం వెళ్లాలి. టైం అవుతోంది. ఎయిర్ పోర్టు కు బయలుదేరారని మినిస్టర్ చెప్పేసరికి వసు, రిషి షాక్ అవుతారు. అదేంటి మీకు చెప్పలేదా మీరందరూ ఒకే ఇంట్లో ఉంటారు కదా అని మినిస్టర్ అనేసరికి రిషి ఏదో చెప్పి కవర్ చేస్తాడు. వాళ్ల సర్వేకి వెళ్లారు కాబట్టి ఈ పనులన్నీ మీరిద్దరే చూసుకోమని మినిస్టర్ చెప్తారు. రిజల్ట్స్ వస్తున్నాయి కదా అది అయిన తర్వాత కొత్త ప్రాజెక్టు మొదలు పెడతామని రిషి అడుగుతాడు. అందుకు మినిస్ట్రర్‌ సరే అంటారు. రిషి డల్ గా ఉండడం చూసి అంతా ఓకే కదా అని మినిస్టర్ అడుగుతారు. డాడ్ కి నా మీద అంత కోపం ఏంటి? నాకు కనిపించకుండా వెళ్ళిపోయారు అని రిషి చాలా ఫీల్ అవుతాడు.