గుప్పెడంతమనసు జనవరి 21 శనివారం ఎపిసోడ్ (Guppedanta Manasu January 21st Update)


వసుధార కాలేజీకి వచ్చిందని, రిషి గెస్ట్ హౌజ్ లో ఉన్నాడని తెలుసుకుని దేవయాని రగిలిపోతుంటుంది. ఇదే అదనుగా మహేంద్ర-జగతిని టార్గెట్ చేస్తుంది.అసలు రిషి కాలేజీలో ఉన్నాడని ఎవరు చెప్పారని దేవయాని అడగడంతో...వసుధార పంపించిన వాయిస్ మెసేజ్ వినిపిస్తాడు మహేంద్ర. దాంతో మరింత రెచ్చిపోతుంది దేవయాని. చిన్నప్పుడు జగతి వదిలేసి వెళ్లింది..ఇప్పుడు ఇదే జగతి తీసుకొచ్చిన వసుధార మన జీవితాలను అతలాకుతలం చేస్తోంది..దీనికి పరిష్కారం మీరే చెప్పాలంటుంది.. అందరూ సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా దేవయాని తగ్గేదేలే అంటుంది. సాక్షికి ఇచ్చి పెళ్లిచేద్దాం అంటే ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు..వసుధార నటించి మోసం చేసింది..రిషిని మీరు వదిలేశారు కదా ఆ విషయమే..వసుధార మీకు మొహంమీదే చెప్పిందికదా అని ఫైర్ అవుతుంది. ఇంతలో జగతికి కాల్ చేసిన రిషి..కాలేజీకి రమ్మని చెబుతాడు..దేవయాని కూడా బయలుదేరుతుంటే తనని మాత్రమే రమ్మన్నాడని క్లారిటీ ఇస్తుంది జగతి.


Also Read: కార్తీక్ మీద పిచ్చితో అడ్డంగా బుక్కైపోయిన మోనిత, ఫైనల్ మలుపు ఇదే!


ఇంట్లో చక్రపాణి పనులుచేస్తుంటే..సుమిత్ర బాధపడుతూ ఉంటుంది.ఇంతలో రాజీవ్ కాల్ చేయడంతో ఫైర్ అవుతాడు చక్రపాణి. ఇన్నాళ్లూ నమ్మించి మోసం చేశావంటాడు..నన్ను క్షమించండి అని రాజీవ్ డ్రామా ప్లే చేసినా చక్రపాణి పట్టించుకోడు..మళ్లీ నా కంటికి కనిపంచే ప్రయత్నం చేసినా, వసుధారవైపు చూసినా నీ చావు నా చేతిలో ఉందని గుర్తుపెట్టుకో అని కాల్ కట్ చేస్తాడు. క్రూరంగా నవ్వుకున్న రాజీవ్..పిల్లి శాపానికి ఉట్లు తెగుతాయా అన్నట్టు మామ కోపానికి ఈ అల్లుడు ఆగుతాడా..వసుధారని పెళ్లిచేసుకుని తీరతాను అనుకుంటాడు..


రిషి..కాలేజీలో కూర్చుని ఆలోచిస్తుంటాడు...పుష్పతో మాట్లాడిన విషయాలు గుర్తుచేసుకుంటాడు. పుష్ప వచ్చి తాను వేరే దగ్గర జాబ్ చేస్తున్నానని చెప్పిన పుష్ప. క్యారియర్ ఇచ్చి ఇది వసుధారకి ఇవ్వండి అని అడుగుతుంది. తను మా ఇంట్లోనే ఉంటోంది సార్ అంటుంది. నువ్వు వాళ్ల ఆయన్ని చూశావా అంటే..లేదు సార్..కానీ.. లక్కీ ఫెలో వసుధార లాంటి భార్య దొరకడం అదృష్టమే కదా అంటుంది..వాళ్ల నాన్నగారు వస్తున్నారంట తనకోసం ఇల్లు చూడాలని చెబుతుంది. ఒకరు లక్కీ ఫెలో అయితే ఇంకొకరు అన్ లక్కీ నా అనుకుంటాడు..ఇంతలో జగతి వస్తుంది. 
జగతి: రిషి నువ్వు...
రిషి: ఫ్లైట్ క్యాన్సిల్ అయింది
జగతి: వసు
రిషి: ప్రాజెక్ట్ హెడ్ వసుధార వచ్చారు..నన్ను కలిశారు
జగతి: రిషి కూల్ గా ఉన్నాడా..ఉండేందుకు ప్రయత్నిస్తున్నాడా అనుకుంటుంది
రిషి: ప్రాజెక్ట్ హెడ్ కి ఇవ్వండి అని కీ ఇస్తాడు... ఇది గౌతమ్ ఫ్లాట్ కీ..మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ హెడ్ గా తనకి సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత మన కాలేజీకి ఉంది..తనకు కావాల్సిన అరెంజ్ మెంట్స్ చేయించండి
జగతి: తనపై కోపం లేదా
రిషి: ఎవరి కోపాలకు ఎవర్ని  బాధ్యులను చేస్తాం.. మన కోపం మన వ్యక్తిగతం..అదే గతం..సాధ్యమైనంత తొందరగా ప్రాజెక్ట్ హెడ్ గారిని గౌతమ్ ఫ్లాట్ లోకి షిఫ్ట్ అవమని చెప్పండి.. పుష్ప తెచ్చింది ఇది ప్రాజెక్ట్ హెడ్ కి ఇవ్వండని క్యారియర్ ఇస్తాడు..
జగతి: గొడ్డలితో గంధం చెట్టు నరికినా ఆ పరిమళం పోదు..నువ్వు ఎంతమంచివాడివి రిషి అనుకుంటూ అక్కడినుంచి వెళ్లిపోతుంది జగతి..


Also Read: అల్లరి ప్రేమికుల గిల్లికజ్జాలు, వసు మాట అస్సలు వినిపించుకోని రిషి


మా ఇంటికి వచ్చినప్పుడు నేను తప్పుగా మాట్లాడాను...అందుకు హర్ట్ అయ్యారు నిజమే కానీ ఎందుకలా ప్రవర్తించానో చెబితేనే కదా నిజం తెలిసేది..కానీ ఎవ్వరూ మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని బాధపడుతుంది వసుధార. ఇంతలో జగతి వస్తుంది..ఏంటి మేడం అలా చూస్తున్నారు
జగతి: ఎదుటివాళ్ల ఎమోషన్స్ పట్టించుకోవడం మానేశారు కదా మీరు
వసు: నేను చేసిన తప్పేంటి..
జగతి: తప్పొప్పుల గురించి మాట్లాడే అవసరం ఇప్పుడు లేదు..నువ్వు చెప్పిది వినే అవసరం నాకు లేదు.. ప్రాజెక్ట్ హెడ్ గా ఏమైనా చెప్పు వింటాను..మిషన్ ఎడ్యుకేషన్ హెడ్ గా మీకు సౌకర్యాలు కల్పించాలి కాబట్టి ఈ కీ ఇమ్మన్నారు.. 
వసు: రిషి సార్ కి నాపై ఎంత శ్రద్ధో కదా
జగతి: నీ ప్లేస్ లో పుష్ప ప్రాజెక్ట్ హెడ్ అయినా ఇలాగే చేశేవారు
వసు: మీరేదో కోపంగా ఉన్నారు
జగతి: ఎవరి కోపాలకు ఎవర్ని బాధ్యులం చేస్తాం.. మీరిప్పటికే జీవితంలో గొప్ప విజయాలు సాధించారు.. మరిన్నివిజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనేసి వెళ్లిపోతుంది..
వసు: జరిగింది చెప్పే అవకాశం కూడా ఇవ్వడం లేదు..రిషి సార్ కి నాపై ఎంత శ్రద్ధనో..ఎంతైనా రిషిసార్ జెంటిల్మెన్ కదా అనుకుంటుంది..


దేవయాని-రాజీవ్
రిషి వెళ్లిపోతాడు అనుకుంటే వెళ్లలేదు..వసుధార మళ్లీ వచ్చింది..ఇప్పుడు వాళ్లిద్దరూ ఒకటైపోతారా ఏంటి.. పైగా రిషి-జగతి కూడా కలిసిపోయేలా ఉన్నారు అనుకుంటూ దేవయాని...రాజీవ్ కి కాల్ చేస్తుంది..
దేవయాని: రేయ్ ఎక్కడ చచ్చావురా
రాజీవ్: రా ఏంటి..రా..అలా అంటే బాగోదు..మీ మీద గౌరవం ఉంది దాన్ని అలాగే ఉండనయండి..అసలే మంటమీదున్నాను.. 
దేవయాని: నేను అంతకన్నా మంటమీదున్నాను..నీకు డబ్బిచ్చాను, అవకాశం ఇచ్చాను అయినా చెప్పిన పని చేయకుండా తిరుగుతున్నావు..నిన్ను సన్మానించాలా మరి...
ఎపిసోడ్ ముగిసింది