గుప్పెడంతమనసు జనవరి 20  శుక్రవారం ఎపిసోడ్ (Guppedanta Manasu January 20th Update)


 సుమిత్ర వసుధార కి ఫోన్ చేస్తుంది.
వసు: బాగున్నావా అమ్మ హెల్త్ బాగుందా 
సుమిత్ర:  మీ నాన్న నన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు 
చక్రపాణి: రిషి సార్ ని కలిసావా జరిగింది మొత్తం వివరించావా, సార్ మనసు చాలా మంచిది మహారాజు లాంటి వాడు నాకు బాగా తెలుసు నిన్ను అర్థం చేసుకుని ఉంటాడు 
వసు: వసుధార రాజీవ్ బావతో జాగ్రత్తగా ఉండండి 
చక్రపాణి: కోపంతో రగిలిపోయిన చక్రపాణి ...వాడు ఎంత మోసం చేశాడు వదిలిపెట్టను 


Alos Read: వసుకి కానుకగా పూలు ఇచ్చిన రిషి, మొహం మీదే తలుపేసి వెళ్లగొట్టిన జగతి!


మరొకవైపు రిషి సోఫాలో పడుకుని..వసుధార మాటలు గుర్తుచేసుకుంటాడు..అటు వసుధార రిషి ఇచ్చిన పూలవైపు చూస్తూ తనలో తాను మాట్లాడుకుంటుంది
రిషి: ఇంత పని చేసావ్ ఏంటి వసుధార నా జీవితంలో ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పావు కానీ చివరికి నువ్వే ప్రశ్నగా మిగిలిపోయావు వసు: రిషి ఇచ్చిన పూల వైపు చూస్తూ ఉంటుంది
రిషి: వేరే వాళ్ళ భార్యగా ఉన్నప్పుడు నాతో ఎందుకు మాట్లాడాలి..పూలు తీసుకోవడం తప్పుకదా
వసు: నన్ను నేను కాపాడుకోవడంలో పెద్ద తప్పు చేశానా రిషి సార్.. నన్ను ఎప్పుడు క్షమిస్తారో
ఫోన్ తీసి రిషికి వాట్సాప్ చేస్తుంది..ఓసారి మాట్లాడాలి అన్న మెసేజ్ చూసి రిషి మొబైల్ స్విచ్చాఫ్ చేస్తాడు..
రిషి చందమామ వైపు చూసి బాధపడుతూ ఉండగా మరోవైపు వసుధార కూడా చందమామ వైపు చూస్తూ ఉంటుంది.
వసు: మా మధ్య ఎందుకు ఇంత దూరం వచ్చిందో అర్థం కావడం లేదు
రిషి: వసు ఎందుకు ఇలా ప్రవర్తించిందో అర్థం కావడం లేదు
మళ్లీ వసుధార కాల్ చేసినా రిషి లిఫ్ట్ చేయడు, మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వడు..
వసు: రిషి సార్ మీరెక్కడ ఉన్నారు 
రిషి: ఎక్కడ ఉన్నానో ఏమైపోతున్నానో నాకే అర్థం కావడం లేదు 


Also Read: అసలు విషయం చెప్పిన వారణాసి , మోనిత చాప్టర్ క్లోజ్ - రాక్షస సంహారంతో 'కార్తీకదీపం' శుభం


మరుసటి రోజు ఉదయం వసుధార కాలేజీకి వస్తుంది. రిషి సార్ ఎక్కడికి వెళ్ళి ఉంటారు అనుకుంటూ గతంలో ఇద్దరూ కూర్చున్న ప్రదేశంలో కూర్చుని బాధపడుతుంది. మళ్లీ రిషికి, జగతికి కాల్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో బాధపడుతుంది.ఆ తర్వాత ధరణికి కాల్ చేసినా రిషి గురించి తెలియదు. మరొకవైపు రిషి వసుధారతో గడిపిన క్షణాలే గుర్తు తెచ్చుకుంటూ ఏంటిది అని బాధపడుతూ ఉంటాడు. ఇంతలోనే కాలేజీ గెస్ట్ హౌజ్ లో ఉన్నాడేమో అనే అనుమానంతో వెళ్లి చూస్తుంది... రూమ్ డోర్ బయటినుంచి వసుధార...లోపలి నుంచి రిషి ఇద్దరూ ఒకేసారి ఓపెన్ చేస్తారు....వసు తూలిపడబోతుంటే పట్టుకుంటాడు రిషి...
ఆ సమయంలో వసు తాళి రిషి షర్ట్ కు  తగులుకోవడంతో అది తీసేసి పక్కకు వెళ్లి నిల్చుంటాడు 
రిషి: వసుధార ఫస్ట్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో 
వసు:  ఒకసారి నాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి సార్ ప్లీజ్ సార్ .నేను మీకు చెప్పాల్సింది చాలా ఉంది ఒక్క ఐదు నిమిషాలు సమయం ఇవ్వండి 
రిషి: నేను నీతో మాట్లాడాల్సింది ఏమీ లేదు వసుధార 
వసు: ఈరోజు కాకపోయినా రేపు కాకపోయినా ఎల్లుండి అయినా నేను మీతో మాట్లాడాలి నాకు అవకాశం ఇవ్వాలి
రిషి: నువ్వేం చెప్పకు వసుధార దయచేసి వెళ్ళు అని చేతులు జోడించి అడుగుతాడు రిషి. 
అప్పుడు వసుధార మీకు  ఎలా నచ్చచెప్పాలో నాకు తెలుసు అని వాట్సాప్ లో మహేంద్ర సార్ రిషి సార్ కాలేజీకి గెస్ట్ హౌస్ లో ఉన్నారు వచ్చి తీసుకెళ్లండని వాయిస్ మెసేజ్ పెడుతుంది.
రిషి: ఎందుకు ఇలా చేస్తున్నావు పిచ్చిపిచ్చిగా చేయకు, ఇక్కడి నుంచి వెళ్తావా నన్ను వెళ్ళమంటావా 
వసు: ఇంటికి వెళ్ళండి సార్ నేను ఎక్కడికైనా వెళ్తాను
రిషి: అది నీకు అనవసరం అని కోపంగా మాట్లాడుతాడు
అప్పుడు వసుధార అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు రిషి తలుపు వేసుకుని బాధపడుతూ ఉంటాడు. 
ఆ తర్వాత వసుధారకి చక్రపాణి ఫోన్ చేసి మీ అక్క మాధవికి నలతగా ఉందట మీ అమ్మ అక్కడికి వెళుతుంది నేను నీ దగ్గరికి వస్తాను ఎందుకో నీ దగ్గరికి రావాలని ఉందమ్మా అని అంటాడు చక్రపాణి. సరే నాన్న మీరు రండి అని అంటుంది వసు. 


దేవయాని: కాలేజీలో రిషి ఉండడం ఏంటి..అక్కడికి వసుధార వెళ్ళిందా అసలు ఏం జరుగుతోంది...మీరంతా రిషి గురించి ఆలోచించకుండా ఏం చేస్తున్నారని సీరియస్ అవుతుంది..