తులసి ఝాన్సీని నిలదిస్తుంది. నువ్వే ఫైల్ గురించి తప్పు చెప్పావా లేదంటే నీతో ఎవరైనా చెప్పించారా అని అడుగుతుంది. కానీ ఝాన్సీ మాత్రం నిజం బయటపెట్టకుండా తనే తప్పు చేసినట్టు ఒప్పుకుంటుంది. అదంతా లాస్య వింటుంది. తులసి జరిగింది తలుచుకుని చాలా ఫీల్ అవుతుంది. అప్పుడే సామ్రాట్ బాబాయ్ వస్తాడు. వాడి తరపున నేను నీకు సోరి చెప్తున్నా అని అంటాడు. సామ్రాట్ గారి కోపానికి అర్థం ఉంది, నేను ఆయన నమ్మకాన్ని పోగొట్టుకున్నా అని తులసి అంటుంది. నువ్వు చేసింది తప్పు కాదు పొరపాటు, నువ్వు మోయలేని భారాన్ని నీ మీద పెట్టాడు అది వాడి తప్పు అని సామ్రాట్ బాబాయ్ చెప్తాడు.


ఝాన్సీ తన రిజైన్ లెటర్ తెచ్చి సామ్రాట్ కి ఇస్తుంది. అది చూసిన సామ్రాట్ కోపంగా దాన్ని చింపేస్తాడు. చేసిన తప్పు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు సర్ ఈ ఆఫీసులో ప్రశాంతంగా ఉండడం నా వల్ల కాదని అంటుంది. చెయ్యని తప్పుకు నువ్వు దోషివి ఎలా అవుతావు ఝాన్సీ. అసలు దోషిని నేను నా వల్లే కదా ఇలా చేశావు తులసిగారికి తెలియకుండా రూ.10 కోట్లు ఫైల్ పెట్టమని నేనే చెప్పాను ఆమెతో సైన్ చేసేలా చూడామని నేనే చెప్పాను కదా అని సామ్రాట్ అంటాడు. ఎందుకని అడగకుండా మీరు చెప్పిన పని చేశాను కానీ అందరి ముందు మీరు తులసిగారి మీద అరవడం నాకు నచ్చలేదు ఎందుకు అలా చేశారని ఝాన్సీ అడుగుతుంది. తులసిగారిని ఆఫీసు నుంచి బయటకి పంపించడానికి నాకు వేరే దారి దొరకలేదని సామ్రాట్ చాలా బాధపడతాడు. ఈ ఫైల్ విషయం ఎవరికి చెప్పకు అని సామ్రాట్ చెప్తాడు.


Also Read: సత్యకి తెలియకుండా రుక్మిణి వెంట ఆదిత్య- మాధవ్ చేతికి చిక్కిన పవర్ ఫుల్ అస్త్రం


సామ్రాట్ ఇంట్లో హనీ పుట్టినరోజు వేడుకలు మొదలువుతాయి. తులసి ఫ్యామిలీ మొత్తం సామ్రాట్ ఇంటికి వస్తారు. అనసూయ మాత్రం సామ్రాట్ వైపు కోపంగా చూస్తుంది. లాస్య, నందు కూడా పార్టీకి వచ్చి నందు గురించి గొప్పగా చెప్తూ ఉంటుంది. తులసి హనీని రెడీ చేస్తాను అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. లాస్య కూడా అనసూయని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. త్వరలోనే మీ ఇంట్లో రెండో కృష్ణుడు వస్తాదులే అని అంటుంది. నేను ఉండగా అది జరగదని అనసూయ సవాల్ చేస్తుంది. తులసి హనీని చక్కగా రెడీ చేయడం చూసి సామ్రాట్ చూస్తూ ఉండిపోతాడు. సామ్రాట్ తులసి వేసిన బట్టలు కాకుండా తను కొన్న డ్రెస్ వేయమని చెప్తాడు. అదేంటి వేసుకున్న డ్రెస్ చాలా బాగుంది తులసి ఆంటీ గిఫ్ట్ గా ఇచ్చింది నేను ఇదే ఉంచుకుంటాను అని హనీ అంటుంది.


పుట్టినరోజు నాడు దాన్ని బాధపెట్టకు అని పెద్దాయన అంటే సామ్రాట్ చాలా చిరాకుగా అంటే నా మాటకి విలువ లేదా అని అంటాడు. సామ్రాట్ ప్రవర్తన చూసి తులసి బాధపడుతుంది. అదిరిపోయే లెవల్ లో పార్టీ ఎరేంజ్ చేశావ్ బాగానే ఉంది కానీ గేటు దాటాక వాళ్ళ మాటలు విను చెవుల్లో నుంచి రక్తం వస్తుందని అనసూయ కోపంగా సామ్రాట్ తో అంటుంది. ఇదంతా అభి వింటాడు. నేను అడిగింది చెయ్యలేదు, ఓపికగా ఎదురు చూస్తున్నా, నేను కళ్ల ముందు కనిపిస్తే నేను అడిగింది గుర్తుకు వస్తుందని ఆశతో పార్టీకి వచ్చాను. నీకు తులసి అంటే గౌరవం ఉండొచ్చు కానీ నాకు ప్రాణం. తులసి క్షేమం నా బాధ్యత, నా ఆరాటం నీకు అర్థం కావడం లేదని అనసూయ అంటుంది. తులసిగారికి ఎటువంటి నష్టం కలగకుండా నేను చూసుకుంటాను. నా మీద నమ్మకం ఉంచండి అని సామ్రాట్ అనసూయతో అంటాడు. అలా అనుకునే వాడివే అయితే ఇలా పార్టీకి పిలవవు అని అంటుంది.


Also Read: ఆదిత్య కోరిక- వేద గుండె ముక్కలు, సులోచనకి యాక్సిడెంట్ చేయించిన మాళవిక