తులసి, సామ్రాట్ వర్షంలో తడుచుకుంటూ ఒక ఇంటికి చేరుకుంటారు. అక్కడి వాళ్ళు మీరు ఎవరో తెలియదు ఇంట్లోకి రానివ్వలేమని చెప్తారు. కానీ మీ ఇంట్లో వాళ్ళకి మీ గురించి చెప్పడం అయితే చేస్తాం కానీ షెల్టర్ ఇవ్వలేమని అంటారు ఇద్దరు అబ్బాయిలు. వీళ్ళు మంచి చేస్తున్నారని తులసి మెచ్చుకుంటుంది. మేము ఎవరో తెలియదని మీరు అంటున్నారు కదా ఇంటర్నెట్లో నా పేరు టైప్ చేసి నా గురించి తెలుసుకోండి నా పేరు సామ్రాట్ అని చెప్తారు. వెంటనే వాళ్ళు మీరు సామ్రాట్ గారు సోరి సర్ మీరెవరో తెలియక అలా చెప్పాం అని చెప్తారు. వెంటనే లోపలికి రమ్మని ఆహ్వానిస్తారు. అటు తులసి ఇంట్లో వాళ్ళు అందరూ తన కోసం కంగారూ పడతారు. అప్పుడే తులసి ప్రేమ్ కి ఫోన్ చేస్తుంది.


తులసి ఫోన్ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. ఎక్కడ ఉన్నారు ఎలా ఉన్నారని పరంధామయ్య టెన్షన్ గా అడుగుతాడు. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండండి అని ప్రేమ్ అంటాడు. మేము వర్షంలో చిక్కుకుపోయామని, కారు కూడా ఆగిపోయిందని, దగ్గరలో ఇల్లు దొరికింది ఇక్కడ ఉండిపోయాము అని తులసి చెప్తుంది. ఇంట్లో వాళ్ళు అందరూ బయటకి రావొద్దని తులసికి చెప్తారు. తులసి మాట్లాడుతుంటే ఫోన్ లైన్ కట్ అయిపోతుంది. ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పినందనుకు తులసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంకుల్ ఆంటీ అని మన ముందు పార్టీ చేసుకోవడానికి ఇబ్బంది పడతారేమో అని తులసి అంటుంది. నేను అంకుల్ కాదని సామ్రాట్ వాదిస్తాడు. అక్కడి అమ్మాయిలు కూడా సామ్రాట్ ని అంకుల్ అని అనేస్తారు.


Also Read: అందరి అనుమానాలని నిజం చేస్తానంటున్న మాధవ్- దేవి ఆచూకీ తెలుసుకున్న రుక్మిణి, ఆదిత్య


పార్టీ చేసుకుంటున్న అక్కడి వాళ్ళు నెట్లో సామ్రాట్, తులసి కలిసి దాండియా ఆడిన వీడియో చూస్తారు. మీరు మాతో బాగా కలిసిపోయారు అని సరదాగా మాట్లాడతారు. పరంధామయ్య సామ్రాట్ బాబాయ్ కి ఫోన్ చేసి విషయం చెప్తాడు. అనసూయ మాత్రం తులసి గురించి టెన్షన్ పడుతుంటే నందు వచ్చి మాట్లాడతాడు. తులసి, సామ్రాట్ ఒకే గదిలో ఉన్నారనే ఊహే నేను భరించలేకపోతున్నా అని అనసూయ అంటుంది. తులసి బాగా తడిచిపోవడంతో అక్కడి అమ్మాయిలు తన డ్రెస్ ఇస్తారు. మోడ్రన్ డ్రెస్ వేసుకున్న తులసిని అలాగే చూస్తూ ఉండిపోతాడు సామ్రాట్. వాళ్ళతో కలిసి తులసి సరదాగా డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నట్టు సామ్రాట్ ఊహించుకుంటాడు.  


స్నేహం నుంచే ప్రేమ పుడుతుంది అంటూ పార్టీలో ఒక అబ్బాయి తన స్నేహితురాలికి ప్రపోజ్ చేస్తాడు. అతను చెప్పిన మాటలు అన్నీ సామ్రాట్ కి తగులుతాయి. ధైర్యం చేస్తేనే కోరుకున్నది దొరుకుతుంది అని తులసి కూడా ఆ అమ్మాయికి చెప్తుంది. అందరూ కలిసి పార్టీలో ఎంజాయ్ చేస్తూ సామ్రాట్ తులసిని కూడా డాన్స్ చెయ్యమని లాగుతారు. తులసి కూడా వాళ్ళతో పాటు ఎగురుతూ ఉంటుంది. డాన్స్ చేస్తూ సామ్రాట్ కళ్ళు తిరిగి పడిపోతాడు. ఏమైందో అని తులసి కంగారుపడుతుంది. సామ్రాట్ ని తీసుకెళ్ళి గదిలో పడుకోబెడతారు.


Also Read: మాళవిక కన్నింగ్ ప్లాన్- గుండె పగిలేలా ఏడుస్తున్న వేద, అల్లుడిని ఆకాశానికి ఎత్తేసిన సులోచన


తరువాయి భాగంలో..


తులసి ఇంటికి వస్తుంది. నందు కోపంగా ఇంటి గుమ్మం ముందు కూర్చుని ఉంటాడు. ప్రయాణం ఎలా జరిగిందని అంకిత అడుగుతుంటే ప్రేమాయణం ఎలా జరిగిందని అనాలి అంటూ నందు రగిలిపోతాడు. తులసి కోపంగా అరుస్తుంటే అనసూయ కూడా నందుకే వంత పాడుతుంది.