యష్ మాళవిక కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అటుగా వచ్చిన వేద యష్ ని చూసి ఈయన ఇక్కడ ఉన్నారు ఏంటి పోనీలే ఇద్దరం కలిసి పేరెంట్స్ మీటింగ్ కి వెళ్లొచ్చు ఖుషి హ్యాపీగా ఫీల్ అవుతుందని కారు దిగి యష్ దగ్గరకి రాబోతుంది. అప్పుడే మాళవిక యష్ దగ్గరకి వస్తుంది. వాళ్ళిద్దరినీ చూసి వేద షాక్ అవుతుంది. కావాలనే వేద యష్ కి కాల్ చేస్తుంది. ఎక్కడ ఉన్నారని అడుగుతుంది. నువ్వు నిద్ర లేవలేదని ఖుషిని స్కూల్ కి తీసుకొచ్చి డ్రాప్ చేశాను అని చెప్తాడు. ఇప్పుడు ఈ నిమిషం మీరు ఎక్కడ ఉన్నారు అని కోపంగా రెట్టించి అడుగుతుంది, పక్కనే ఉన్న మాళవిక చెప్పకు అని సైగ చేస్తుంది. వేద అదే ప్రశ్న పదే పదే అడగటంతో నేను బిజీగా ఉన్న అని యష్ కోపంగా ఫోన్ పెట్టేస్తాడు.


మాళవిక కారులో బ్యాగ్ పెడుతూ వెనక్కి తిరిగేసరికి వేద కనిపిస్తుంది. ఇక్కడే ఉందా ఇది అని కావాలనే యష్ తో సీటు బెల్ట్ పెట్టుకోవడం రావడం లేదు హెల్ప్ చెయ్యమని అడుగుతుంది. యష్ తనకి దగ్గరగా వెళ్ళి పెట్టడం సీటు బెల్ట్ పెట్టడం చూసిన వేద తప్పుగా అర్థం చేసుకుంటుంది. వాళ్ళిద్దరినీ చూసి కుమిలి కుమిలి ఏడుస్తుంది. ఏమైంది మీకు అబద్దాల మీద అబద్దాలు చెప్తున్నారు, ఏదో పెద్ద విషయం నా దగ్గర దాస్తున్నారు. ఒకప్పుడు మాళవిక అంటేనే ఎగిరిపడే మీరు ఇప్పుడు దాన్ని వెంట పెట్టుకుని ఎందుకు తిరుగుతున్నారు. నాకే ఎందుకు ఈ ఎదురు దెబ్బలు, ఈ క్షోభ. ఎన్నాళ్ళు వీటిని భరించేది నా గుండె బండ కాదు కదా అని వెక్కి వెక్కి ఏడుస్తుంది.


Also Read: బాబోయ్ ఇవేమి అరచకాలు సామీ!- అనసూయకి నూరిపోస్తున్న లాస్య


వసంత్, చిత్ర కలుసుకుని కాసేపు సరదాగా మాట్లాడుకుంటారు. వేద చాలా బాధగా ఉండటం చూసి సులోచన ఏమైందని అడుగుతుంది. వేద జరిగింది గుర్తు చేసుకుని వెంటనే వచ్చి తల్లి దగ్గర కూర్చుని ఏడుస్తుంది. ఏమైంది ఎందుకు అలా ఉన్నావ్ అని మరోసారి అడుగుతుంది. యష్, మాళవిక ఒక హోటల్ కి వస్తారు. అక్కడ రిసెప్షన్ లో అమ్మాయి యష్ పక్కన ఉన్న మాళవికని మీ భార్య అని అడుగుతుంది. కాదు ఈమె నా భార్య కాదని చెప్తాడు. మరోవైపు వేద వాళ్ళని కూడా చూపిస్తారు. వేద యష్ గురించి బాధపడుతుందని సులోచన అంటుంది. ను’వ్వు పడే బాధకి కారణం అల్లుడుగారు, నాకు యాక్సిడెంట్ చేసిన వాళ్ళని కనిపెట్టడం కోసం ఆఫీసు పనులు కూడా పక్కన పెట్టి ఆ పని మీదే తిరుగుతున్నారు. నీ భర్త పడుతున్న బాధ టెన్షన్ లో సగాన్ని నువ్వు పంచుకున్నావ్ నాకు అర్థం అయ్యింది. వేద ఇన్నాళ్ళూ నీకు చెప్పకుండా దాచిన ఒక రహస్యం చెప్పనా.. నీకు యశోధర్ ని ఇచ్చి పెళ్లి చేయడం నాకు ఇష్టం లేదు. ఇద్దరు బిడ్డల తండ్రి, భార్య వదిలివెళ్లిపోయింది కానీ ఖుషికి అమ్మ అవ్వాలనే నీ ఆరాటం చూసి కాదనలేకపోయాను. అది చూసిన తర్వాత ఒప్పుకున్నా’.


‘యశోధర్ తో పెళ్లి సమయంలో ఖుషిని ఒడిలో కూర్చోబెట్టుకుని ఆనందంగా తాళి కట్టించుకుంటున్న ఆ క్షణం నీలో నాకు కూతురు కనపడలేదు ఒక తల్లి కనిపించింది. ఈ లోకంలో ఏ ఆడది అయిన పెళ్లి అయినాక తల్లి అవుతుంది కానీ నువ్వు తల్లి అయిన తర్వాత పెళ్లి చేసుకున్నావ్. తల్లి స్థానం తీసుకున్నాకే భార్య స్థానానికి వెళ్ళావ్. నీ పెళ్ళైన ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడు అనిపిస్తుంది ఎంత గొప్ప భార్య స్థానం. ఎంతో గొప్ప భర్తకి భార్యవి అయ్యావు. నా అల్లుడు నా కూతురుకి అన్యాయం చెయ్యడు ఆ నమ్మకం నాకుంది’ అని సులోచన అనేసరికి వేద ఏడుస్తూ వెళ్ళిపోతుంది. ఎంత గుడ్డి నమ్మకం నీది నేను చూసిన నిజాన్ని నీకు చెప్పి బాధపెట్టలేను నా బాధ ఎవరికి చెప్పుకోలేను అని గుండెలు పగిలేలా ఏడుస్తుంది. నేను నీ భార్యని కదా కాదు అని అంటున్నావ్ ఏంటి అని మాళవిక అడుగుతుంది. ఒకప్పుడు నువ్వు నా భార్యవి ఏమో కానీ ఇప్పుడు కాదు నా భార్య పండితారాధ్యుల వేదస్వని అని చెప్తాడు.


Also Read: యష్, వేద మధ్య అగాథం- పాత మొగుడి మీద మోజుతో అభిమన్యుకి హ్యాండ్ ఇస్తున్న మాళవిక


తరువాయి భాగంలో..


యష్ వాళ్ళు వెళ్ళిన హోటల్ లో ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది. వేద వచ్చి ఏమైందని అడిగేసరికి విషయం పోలీసులు విషయం చెప్తారు. వేద కంగారుగా లోపల నా భర్త ఉన్నారు వెళ్ళాలి అని వెళ్లబోతుంటే అప్పుడే యష్ మాళవికని ఎత్తుకుని బయటకి వస్తూ ఉండటం వేద చూస్తుంది.