అనసూయ వచ్చి దారుణంగా అవమానించడంతో పరంధామయ్య చాలా బాధపడతాడు. తనతో కలిసి ఇంటికి వెళ్ళను అని తులసితో అంటాడు. తులసి సరే అని తన ఇంట్లోనే ఉండమని చెప్తుంది. ఆయన పరిస్థితి చూసి సామ్రాట్ కూడా చాలా ఫీల్ అవుతాడు. ‘ఇంత వయస్సు వచ్చాక ఈ నిందలు ఏంటో, కట్టుకున్న భార్య తీసేపారేశాలా మాట్లాడటం ఏంటో ఇంతకన్నా నరకం మరొకటి ఉండదు’ అని సామ్రాట్ తులసితో అంటాడు. మావయ్య పోగొట్టుకున్న ధైర్యం, గౌరవం తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత తనదే అని తులసి ఎమోషనల్ అవుతుంది. అనసూయ ఇంట్లో కోపంతో రగిలిపోతుంది. నేను ఒంటరిగా బతకగలను అని పిచ్చి పట్టిన దానిలా కేకలు పెడుతుంది. అది చూసి లాస్య బిత్తరపోతుంది. ఈమె ఇలా బిహేవ్ చేస్తుంది ఏంటి, నందు వెళ్లేటప్పుడు ఇల్లంతా నేనే చూసుకుంటా అని మాట ఇచ్చాను, ఇప్పుడు మావయ్య ఇంట్లో నుంచి వెళ్లిపోయాడని తెలిస్తే ఇంకేమైనా ఉందా, నందు వచ్చేలోపు అన్ని సెటిల్ చెయ్యాలని టెన్షన్ పడుతుంది.


Also Read: మీడియా ముందు అడ్డంగా బుక్కైన రిషి, వసు- మహేంద్ర ఎంట్రీ అదుర్స్, దేవయాని ప్లాన్ తుస్స్


పరంధామయ్య నిద్రలో కూడా తులసిని క్షమించమని అడుగుతూ బాధపడతాడు. అది చూసి తులసి వెక్కి వెక్కి ఏడుస్తుంది. మీరు ఏడవడం చూస్తే ఆయన తట్టుకోలేరు అని సామ్రాట్ నచ్చజెప్పడానికి చూస్తాడు. ఇంత మంచి మనిషిని అత్తయ్య ఎలా అన్ని మాటలు అనగలిగింది, ఆయన గుండె పగిలిపోతుందేమో అని భయమేస్తుంది అని తులసి ఎమోషనల్ అవుతుంది. మావయ్యని చాలా బాధపెట్టింది, అత్తయ్య మీద చాలా కోపంగా ఉందని తులసి రగిలిపోతుంది. ఆమె అన్న మాటలు ఎప్పటికీ మర్చిపోలేను, క్షమించలేను అని అంటుంది. అత్తయ్య చేసిన పని నందుకి తెలిస్తే పరిణామాలు మామూలుగా ఉండవు, ఆయన మంచి భర్త కాదు కానీ మంచి కొడుకు, మంచి తండ్రి. మావయ్యని ఈ పరిస్థితిలో చూస్తే అసలు తట్టుకోలేరు, మావయ్య బర్త్ డే ఇక్కడ చేసి తప్పు చేశాను అని తులసి ఫీల్ అవుతుంది.


Also Read: కార్తీక్ ని ఫాలో అవుతున్న మోనిత- తల్లిదండ్రుల కోసం శౌర్య పోస్టర్స్ ప్లాన్


అనసూయ పిచ్చి పట్టిన దానిలా అందరూ వెళ్లిపోండి అని అరుస్తూ తల పట్టుకుని అరుస్తుంది. ఆమెని చూసి దివ్య భయపడుతుంది. తాతయ్యని అవమానించి తప్పు చేసిందని ప్రేమ్ అంటాడు. అమ్మమ్మకి సర్ది చెప్తాను అని శ్రుతి అంటుంది. అందరూ ఇంట్లోకి వెళ్లిపోతారు కానీ శ్రుతి మాత్రం అనసూయ దగ్గర ఆగుతుంది. ఇంట్లోకి వెళ్తున్న వాళ్ళని చూసి తిడుతూ ఉంటుంది. శ్రుతి సర్ది చెప్పేందుకు చూస్తుంది కానీ అనసూయ వినదు. మీకోపం తాతయ్య మనసు బాధపెట్టిందని శ్రుతి అంటుంది. ఇంట్లోకి రమ్మని బతిమలాడుతుంది కానీ అనసూయ మాత్రం రాను అని అరుస్తుంది. ఒంటరి దాన్ని, దిక్కులేని దాన్ని అయిపోయాను అని అనసూయ ఏడుస్తుంది. ఇంట్లో అందరూ జరిగింది తలుచుకుని బాధపడుతూ ఉంటారు. పరంధామయ్య నిద్రలో అనసూయ మాటలు తలుచుకుని ఉలిక్కిపడి లేస్తాడు. తులసి పక్కనే ఉండి ధైర్యం చెప్పి పడుకోబెడుతుంది. పదే పదే జరిగింది తలుచుకుని పరంధామయ్య భయపడుతూ వణికిపోతాడు.