తులసి ఇంట్లో పరంధామయ్య పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరుపుతారు. అదంతా చాటుగా అభి చూస్తూ కోపంతో రగిలిపోతాడు. కాసేపటికి వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత అభి కోపంగా ఇంట్లోకి వస్తాడు. తులసి మీద సీరియస్ అవుతాడు. నేను వచ్చి చాలాసేపు అయింది, బయట నిలబడి లోపల జరుగుతున్న తమాషా చూస్తూనే ఉన్నా అని అంటాడు.


తులసి: నీకు ఏమైనా అనుమానం ఉంటే లోపలికే వచ్చి చూడవచ్చు కదా బయట ఎందుకు నిలబడటం


అభి: తాతయ్య ముందు సీన్ క్రియేట్ చేయడం ఎందుకని రాలేదు


అంకిత: ఎప్పటి నుంచి పెద్ద వాళ్ళకి గౌరవం ఇవ్వడం నేర్చుకున్నావ్


అభి: మా మామ్ సిగ్గు, మర్యాద వదిలేసిన రోజు నుంచి. మా మామ్ చేసిన సిగ్గులేని పని బురదని కడిగేసి తాడో పేడో తేల్చుకోవడానికి వచ్చాను. నువ్వు చేసిన చేస్తున్న నీతిమాలిన పనికి మేము సఫర్ అవడానికి సిద్ధంగా లేం


తులసి: వెంటనే ఇక్కడ నుంచి వెళ్లిపో


Also read: మాధవ్ ని చంపేసిన సత్య, నేరం తన మీద వేసుకున్న రుక్మిణి- ముగిసిన 'దేవత' కథ


అభి: అసలు ఏంటి నీ పెద్దరికం, నీ వివాహ జీవితం నిలబెట్టుకోవడం చేతకాలేదు కానీ నీ పిల్లలకి నీతులు చెప్తూ వాళ్ళ జీవితాలతో కూడా ఆటలాడుతున్నావా. అసలు నువ్వు తల్లివేనా, నీ జీవితంలాగే మా జీవితం కూడా అయ్యేలాగా నాశనం చేస్తున్నావ్. నా భార్యకి నన్ను దూరం చేశావ్


అంకిత: నీ చేతకానితనానికి తనని ఎందుకు బ్లెమ్ చేస్తున్నావ్


అభి: తను బాయ్ ఫ్రెండ్ ని వెతుక్కుని ఎంజాయ్ చేస్తుంది. నీదశలు ఫ్రెండ్షిప్ చేసే వయస్సు కాదు అలాంటిది బాయ్ ఫ్రెండ్ ని సెట్ చేసుకున్నావ్. సమాజంలో కొన్ని కట్టుబాట్లు ఉన్నాయ్. అందరి మామ్ లు రూల్స్ పాటిస్తుంటే మా మామ్ రూల్స్ పట్టించుకోదు, నీకు నిలువెల్లా స్వార్థం, ఇంత సిగ్గు లేకుండా ఎలా ఉండగలుగుతున్నావ్.


సామ్రాట్: అభి.. ఇక చాలు, ఇంతవరకి ఓపికగా నీ మాటలు విన్నా, ఇక మీ అమ్మని ఏ మాత్రం అవమానించినా ఊరుకొను, అలాగే నా ఫ్రెండ్ ని అవమానించినా ఊరుకోను


అభి: ఈ ఏజ్ లో కూడా మా అమ్మ చెప్తే కంట్రోల్ అవుతారని అనుకోలేదు


సామ్రాట్: ఇక్కడ నుంచి వెళ్లిపో


అభి: మీరు ఎవరు నన్ను ఇక్కడ నుంచి వెళ్లమనడానికి, మన కుటుంబం ముక్కలు అవడానికి కారణం మీరే, మీ కారణంగా మా తాతయ్య పుట్టినరోజు మా ఇంట్లో జరుపుకోలేకపోయాం. మా మామ్ పడరాని మాటలు పడటానికి కారణం మీరే, ఇప్పుడు ఇల్లు వదిలి రావడానికి కారణం కూడా మీరే,  మీతో కలిసి ఉండటానికి ఇల్లు వదిలేసి వచ్చి కొత్త ఇల్లు తీసుకుంది. ఇలా చీప్ గా మారుతుందని అనుకోలేదని అనేసరికి తులసి చెంప పగలగొడుతుంది.


Also read: వేదనే తన జీవితమన్న యశోధర్- కోడలిని ఆకాశానికెత్తేసిన మాలిని


తులసి: ఎంత ధైర్యంగా అన్నావ్, లోకం అంతా దిగజారవచ్చు కానీ ఏ తల్లి దిగజారదు.  మీ అమ్మ ఎలాంటిదో నువ్వు తెలుసుకోలేవు, నేను ఏంటో నాకు తెలుసు, ఎవరికి జవాబు చెప్పుకోవాల్సిన పని లేదు. నీలాంటి కొడుకుని కన్నందుకు సిగ్గుగా ఉంది, నీలాంటి విషపురుగుని కన్నందుకు సిగ్గుపడుతున్నా, ఇప్పటి నుంచి నువ్వు నాకు ఏమి కావు, నువ్వు కాకుండా ఎవరైనా ఈ మాటలు మాట్లాడి ఉంటే చంపేసి ఉండేదాన్ని.. వెళ్ళు ఇక్కడ నుంచి


అభి: కేవలం నీ వల్లే ఒక తల్లి కొడుక్కు శత్రువుగా మారాడు


పరంధామయ్య వాళ్ళు ఇంటికి వెళతారు. మీరు అనుకున్న చోటుకి వెళ్లారు కదా ఇకనైనా నవ్వండి నాన్న అని నందు ప్రేమగా అడుగుతాడు. మీ మనసు బాధపడేలా చేసి ఉంటే క్షమించమని నందు తండ్రిని కోరతాడు. జరిగిన దాన్ని మర్చిపోలేను, క్షమించలేను కూడా అని పరంధామయ్య చెప్తాడు. అన్ని తన కారణంగానే జరుగుతున్నాయని, అభి చెప్పింది నిజమేనని సామ్రాట్ ఫీల్ అవుతాడు.