పరంధామయ్యకి పుట్టినరోజు విషెస్ చెప్తూ నందు, లాస్య, అనసూయ, అభి తన గదిలోకి వస్తారు. అక్కడ బెడ్ మీద దుప్పటి కప్పి ఉండేసరికి పరంధామయ్య ఉన్నారనే అందరూ అనుకుంటారు. ఎంత పిలిచినా లేవకపోయేసరికి నందు వెళ్ళి దుప్పటి ముసుగు తీస్తాడు. హ్యాపీ బర్త్ డే నాన్న అంటూ నందు సంతోషంగా ముసుగు తీసేసరికి అక్కడ దిండ్లు ఉంటాయి. అది చూసి అందరూ షాక్ అవుతారు. తులసి సామ్రాట్ కళ్ళు మూసి సర్ ప్రైజ్ ఇస్తాడు. గది అంతా చక్కగా బెలూన్స్ తో అలంకరించి ఉంటుంది. అక్కడ పరంధామయ్య ఫోటో పెట్టి హ్యపీ బర్త్ డే కేక్ కూడా పెడతాడు. అది చూసి తులసి చాలా సంతోషిస్తుంది.


Also Read: ఆదిత్య, సత్య చెంపలు పగిలాయ్- దేవి తన మనవరాలని తెలుసుకున్న దేవుడమ్మ


మీరు మావయ్య దగ్గరకి వెళ్ళడం కుదరదు కదా అందుకే ఈ ఏర్పాట్లు చేశాను, ఎవరు ఎవరిని బాధపెట్టకుండా ఇలా చేద్దాం అని సామ్రాట్ అంటాడు. బాగుంది కానీ మాది తండ్రి కూతుళ్ల బంధం.. మావయ్య దగ్గర లేకపోవడం బాధగా ఉందని అంటుంటే పరంధామయ్య ఇంటికి వస్తాడు. ఆయన వెనుకే తులసి బ్యాచ్ మొత్తం వచ్చేస్తారు. నీకు అన్యాయం చేశానమ్మా అని పరంధామయ్య బాధపడతాడు. కష్టాలు శాశ్వతంగా ఉండవు త్వరలోనే అన్ని తీరిపోతాయి అని సామ్రాట్ చెప్తాడు. నీకు చేసిన ద్రోహానికి పుట్టినరోజు జరపుకోకూడదు అనుకున్నా కానీ వీళ్ళు బలవంతం చేసి తీసుకొచ్చారని చెప్తాడు. అటు లాస్య అందరూ కలిసి నాటకం ఆడారు అని ఎక్కిస్తుంది.


పరంధామయ్య అక్కడికి వెళ్లినందుకు నందు వాళ్ళు రగిలిపోతూ ఉంటారు. తులసి పైకి కనిపించెంత మంచిది కాదు, సమయం చూసి మన మీద పగ తీర్చుకుంటుందని అనసూయ అంటుంది. మామ్, సామ్రాట్ గారికి స్నేహం మొదలైనప్పుడే నేను ఎదురుతిరిగాను నా మాట ఎవరు వినలేదని అభి ఆవేశపడతాడు. ఈ విషయం ఇంతటితో వదిలెయ్యండని నందు చిరాకుగా వెళ్ళిపోతాడు. తులసి ఇంట్లో అందరూ కలిసి పరంధామయ్య పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేస్తారు. ఆయనతో కేక్ కట్ చేయించి సంబరాలు చేసుకుంటారు. అదంతా అభి చూసి రగిలిపోతాడు. తనకి తోడుగా నిలబడుతున్నందుకు సామ్రాట్ కి థాంక్స్ చెప్తుంది తులసి.


Also read: వేదనే తన జీవితమన్న యశోధర్- కోడలిని ఆకాశానికెత్తేసిన మాలిని


మా తులసిని ఎప్పటికీ ఒంటరిగా విడిచిపెట్టొద్దు అని పరంధామయ్య సామ్రాట్ ని అడుగుతాడు. మీకు ఆ భయం అక్కర్లేదు నేను చూసుకుంటానని సామ్రాట్ మాట ఇస్తాడు. అనసూయ, లాస్య తులసిని టార్గెట్ చేస్తూ మాటలు అంటారు. ఇలా ఎంతసేపు ఆయన కోసం వెయిట్ చేయాలని అనసూయ చిరాకుపడుతుంది. మీరెళ్ళి పడుకోండి నేను వెయిట్ చేస్తాను, ఆయన అంటే నాకు ప్రేమ ఉంది ఎప్పుడు వచ్చినా విషెస్ చెప్పి కేక్ కట్ చేయిస్తాను అని అలాగే ఉంటాడు. మా సంతోషాన్ని మీతో పాటు తెచ్చేసుకున్నారని అంకిత, శ్రుతి బాధపడతారు. తులసి, సామ్రాట్ ని చూసి మీరు క్యూట్ గా ఉన్నారని అంకిత అంటుంది. మేము అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ ఉండొచ్చా అని అంకిత అడిగితే రావొచ్చని తులసి అంటుంది. ఎవరు రారు అని అభి అరుస్తాడు. తులసి గురించి అభి చాలా నీచంగా మాట్లాడతాడు.