ఆడవాళ్ళు ఫుల్ గా మేకప్ వేసుకుని వచ్చి లాస్యకి న్యాయం జరగకపోతే గట్టిగా బుద్ధి చెప్తామని హెచ్చరించి వెళతారు. వాళ్ళకి తులసి గట్టిగానే బదులిస్తుంది. మిమ్మల్ని అంత తేలికగా వదిలిపెట్టనని లాస్య వెళ్ళిపోతుంది. దివ్య పరధ్యానంగా ఆలోచిస్తూ ఉంటే పనిమనిషి కాంతమ్మ వస్తుంది. ఇంత వరకు తొలి రాత్రి జరగలేదు పనిమనిషి నాకే బాధగా ఉంటే మీకు దిగులు లేదా ఎందుకు ఇలా జరుగుతుందోనని అంటుంది. అటుగా ప్రియ వెళ్తుంటే దివ్య పిలుస్తుంది. చుట్టూ ఎవరూ లేరని చూసుకుని గదిలోకి వెళ్తుంది. ఎందుకు పారిపోతున్నావాని దివ్య అడుగుతుంది.


దివ్య: నీ ప్రవర్తన ఏంటో అర్థం కావడం లేదు నువ్వు సమస్యల్లో ఉన్నావా నేను సమస్యల్లో ఉన్నావా


ప్రియ: చెప్పడానికి ఏమి లేదు నా జీవితం నాకు అలవాటు అయిపోయింది మీ జీవితం మీరు అలవాటు చేసుకోండి


Also Read: స్వప్నకి పెళ్లి చూపులు ఫిక్స్ చేసిన కనకం- కావ్యని ఎందుకు వదిలేస్తున్నావని రాజ్ ని నిలదీసిన ధాన్యలక్ష్మి


దివ్య: ఎందుకు ఇలా మాట్లాడుతున్నావ్ నోరు విప్పుతావా లేదా


విక్రమ్ తాతయ్య: తను ఈ ఇంటి కట్టు బానిస ఎంత బెదిరించినా నోరు విప్పదు నిజాల్ని బయటకి చెప్పదు. చెప్తే మీ అత్త బతకనివ్వదు. ఈ ఇంట్లో జరుగుతుంది రాక్షస పాలన. రాజ్యలక్ష్మి అనే రాక్షసి కబంధ హస్తాల్లో ఉన్నాం. తనకి మంచితనం, జాలి ప్రేమ ఏమీ లేవు. ఆ రాక్షసి పెదవుల మీద నవ్వు అబద్ధం మాటల్లో తియ్యదనం అబద్దం. తనే ఒక నిలువెత్తు అబద్దం. 20 ఏళ్ళకు పైగా తను చేస్తున్న అకృత్యాలకు బలైన వాడిని. నా కొడుకు జీవితాన్ని చీకటి గదికి బలి చేసింది. నీ మొగుడు జీవితాన్ని బలి తీసుకుంటుంది. రేపో మాపో నీ జీవితం కూడా బలికాబోతుంది. ప్రియ మౌనంగా తల ఆడిస్తుంది.


దివ్య: నాకు అంతా అయోమయంగా ఉంది. విక్రమ్ ని ప్రాణంతో సమానంగా చూస్తున్నారు కదా


తాతయ్య: చూసుకుంటున్నట్టు నటిస్తున్నారు ఆస్తి కోసం అలా చేస్తున్నారు. ఎన్ని సార్లు నిజాలు చెప్పాలని చూసినా వినడం లేదు వాడు పూర్తిగా రాజ్యలక్ష్మి మాయలో ఉన్నాడు. గట్టిగా మాట్లాడితే చీకటి గదిలో ఉన్న నా కొడుకుని చంపేస్తానని అంటుంది. కనీసం వాడిని ప్రాణాలతో అయినా చూసుకోవచ్చని మౌనంగా ఉంటున్నా


దివ్య: నేను అంటే ఎందుకు కోపం


ప్రియ: నన్ను ఈ ఇంటి కోడల్ని చేసింది నువ్వే కదా అందుకే నిన్ను కోడల్ని చేసుకుని నరకం చూపించాలని చూస్తుంది


తాతయ్య: నువ్వు ఈ మాట విక్రమ్ కి చెప్పినా నమ్మడు. అసలు మొదటి రాత్రి జరగకుండా ఆ రాక్షసే అడ్డుపడుతుంది. మీ అమ్మానాన్నని అవమానిస్తుంది. నీకు, విక్రమ్ కి మధ్య అపార్థాలు సృష్టిస్తుంది. మీ అత్తయ్యని ఎదిరించడం మా వల్ల కాక తలవంచాను


దివ్య: నీ కోడలు మెడలు నేను వంచుతాను. మీ కోడలు ఆడే దొంగ నాటకాలకు కౌంటర్ నేను ఇస్తాను. మా అత్త పొగరు నేను అణుస్తాను. మా ఆయన్ని నాదారిలోకి తెచ్చుకుంటా ఆవిడ దారిలోకి వెళ్ళి బుద్ధి చెప్తా


Also Read: పగతో రగిలిపోతున్న మనోహర్- జ్ఞానంబ ఇంట వెల్లివిరిసిన ఆనందం


ప్రియ: ఆవిడ సామాన్యురాలు కాదు చాలా జాగ్రత్తగా ఉండాలి


దివ్య: నాకు నిజాలు చెప్పి మంచి పని చేశారు


నందు తాగుతూ ఉంటే తులసి వచ్చి అపుతుంది. నా వల్ల నీకు సమస్యలు వస్తున్నాయి ఇంట్లో నుంచి వెళ్లిపోతానని అంటాడు. కానీ తులసి అడ్డుపడుతుంది. సమస్యలు తట్టుకుని నిలబడాలని ధైర్యం చెప్తుంది. అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ లాస్య ఒకేలా ఉంది మీరే అర్థం చేసుకోలేదని అంటుంది. లాస్యని పిలుస్తానని తులసి అంటే వద్దు జైలుకి వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నానని కోపంగా వెళ్ళిపోతాడు.