విక్రమ్ ని తన గుప్పిట్లోకి తెచ్చుకోవడం కోసం రాజ్యలక్ష్మి తిండి తిప్పలు మానేసి పూజ చేస్తున్నట్టు నటిస్తుంది. తల్లిని అలా చూసి విక్రమ్ విలవిల్లాడిపోతాడు. నేను ఏదైనా తప్పు చేసి ఉంటే మొహాన అడిగే హక్కు నీకుంది. ఆ పెళ్లి సంబంధం కావాలని చెడగొట్టలేదు అలా జరిగిపోయింది మనసులు కలవని పెళ్లి చేసుకుంటే జీవితాంతం బాధపడాలి కదా. ముందు తమ్ముడి పెళ్లి చేయమని చెప్పాను కదా అని అంటాడు. సవతి తల్లి ముందు కొడుకు పెళ్లి చేసుకుందని అంటే తట్టుకోలేనని అంటుంది. నువ్వు చెప్పినట్టే పెళ్లి చేసుకుంటానని మాట ఇస్తాడు. తన ప్లాన్ వర్కౌట్ అయినందుకు లోపల సంతోషపడుతూనే పైకి మాత్రం నటిస్తుంది. విక్రమ్ మాత్రం దివ్యని తలుచుకుని బాధపడతాడు.
Also Read: ఇద్దరూ ఇద్దరే తగ్గేదెలే- రిషిధార చిలిపి గిల్లికజ్జాలు, పెళ్లి చేద్దామన్న మహేంద్ర
వాసుదేవ్ ఇంట్లో నందు, తులసి పెళ్లి రోజు సెలబ్రేషన్స్ ఏర్పాటు చేస్తాడు. నటించడం చాలా కష్టంగా ఉంది అన్నయ్యకి నిజం చెప్పేస్తానని తులసి అనసూయతో అంటుంది. అసలు ముందే ఒప్పుకోకుండా ఉండాల్సింది వాళ్ళు వెళ్లిపోయేటప్పుడు ఇలా చేయడం ఎంత వరకు కరెక్ట్ అని సర్ది చెప్తుంది. పెళ్లిరోజు పార్టీ అని మనసులోనే లేవని నందు కూడా తండ్రి దగ్గర ఫీల్ అవుతాడు. ఇప్పుడు ఏం చేయలేము నిజం బయటపెడితే లాస్య ఊరుకోదని అంటాడు. దివ్య మాత్రం సంతోషంగా తల్లిదండ్రులతో కేక్ కట్ చేయించాలని చెప్తుంది. ఛాన్స్ దొరికింది కదా అని రెచ్చిపోతున్నారు తర్వాత చెప్తా మీ సంగతని లాస్య మనసులో తిట్టుకుంటుంది. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకుతో కేక్ కట్ చేయిద్దామని దివ్య అంటే పెళ్లి కొడుకు మొహంలో సంతోషం తెగ కనిపిస్తుందే అని లాస్య వెటకారం ఆడుతుంది.
నందు చేయి పట్టుకుని కేక్ కట్ చేయమని తులసికి వాసుదేవ్ చెప్పేసరికి లాస్యకి మండిపోతుంది. పక్కనే రాములమ్మ లాస్యకి కౌంటర్ వేస్తూ ఉంటుంది. ఇద్దరు కలిసి ఇబ్బందిగా కేక్ కట్ చేస్తారు. నందు నా వైపు చూడటం కూడా లేదేంటని తిట్టుకుంటుంది. తులసికి కేక్ తినిపించబోతుంటే తనే తీసుకుని తింటుంది. ఈ వాసుదేవ్ పర్మినెంట్ గా మన ఇంట్లోనే బాగుంటుంది కదా అని అనసూయ, పరంధామయ్య సంతోషపడతారు. గిఫ్ట్ ఏమైనా ఇస్తున్నావా అని వాసుదేవ్ అంటే ఇప్పటికిప్పుడు ఎలా ఇస్తాడులే తర్వాత ఇస్తాడని అంటుంటే నందు నెక్లెస్ బయటకి తీస్తాడు. అది చూసి అందరూ సంతోషపడతారు. మీ ఆయనకి నీ మీద టన్నుల కొద్ది ప్రేమ ఉందని వాసుదేవ్ అంటాడు. లాస్యని ఎదురుగా పెట్టుకుని ఇంతకీ తెగిస్తున్నాడు ఏంటని అనసూయ వాళ్ళు అనుకుంటారు.
Also Read: రాజ్, కావ్య ప్రేమకీచులాట స్టార్స్- పగబట్టిన రుద్రాణి, నిజం తెలుసుకున్న స్వప్న
మొన్న లాస్యకి ఇచ్చిన దానికంటే ఇది చాలా బాగుందని రాములమ్మ నోరు జారుతుంది. వెంటనే నందు ఏదో చెప్పి కవర్ చేస్తాడు. చేతికి ఇవ్వడం కాదు తులసి మెడలో నెక్లెస్ వేయమని అనేసరికి నందు చేతులు వణుకుతూ ఉంటాయి. తులసి ఆపి ఆయనకి ఇలాంటివి అలవాటు లేదని తీసుకుంటే లాస్య వచ్చి నేను పెడతానని అంటుంది. నీ జేబు ఏమైనా మ్యాజిక్ బాక్స్ నెక్లెస్ లు పుట్టుకొస్తున్నాయ్ మన మ్యారేజ్ డే వస్తుంది వడ్డాణం బయటకి తియ్యి అని నందుకి వార్నింగ్ ఇస్తుంది. తనకి కావలసింది దొరుకుతున్నప్పుడు ఇవన్నీ పట్టించుకొనని తులసితో అంటుంది. 28 ఏళ్ల వైవాహిక జీవితంలో నేర్చుకున్న పాఠాలు చెప్పమని వాసుదేవ్ అడుగుతాడు. నందు తన మనసులోని బాధని బయటకి చెప్తాడు. భార్యాభర్తల బంధం ఎంతో పవిత్రమైనది, నిర్లక్ష్యం భార్యాభర్తల బంధాన్ని చెడగొడుతుందని అంటాడు. అందరి ముందు తులసికి క్షమాపణలు చెప్తాడు. తులసి వేదాంతం మొదలు పెట్టేస్తుంది. ఎవరిని క్షమించెంత పెద్ద మనసు తనకి లేదని అంటుంది. విక్రమ్ ఫోన్లో దివ్య ఫోటో చూసుకుంటూ మురిసిపోతాడు.