లాస్య ప్రతీదానికి కోర్టు ఆర్డర్, లేదంటే మీ అమ్మానాన్నని జైలుకి పంపిస్తానని బెదిరిస్తుంది. కానీ నందు మాత్రం భోజనం చేయకుండా చేయి కడిగేసుకుని వెళ్ళిపోతాడు. నందు నా భర్త తనని ఎవరూ దూరం చేయలేరని లాస్య చెప్పేసి వెళ్తుంది. విక్రమ్ తాతయ్య దివ్యతో మాట్లాడతాడు. రాజ్యలక్ష్మికి ప్రాణగండం అనే విషయం అబద్ధమని చెప్పొచ్చు కదా అంటాడు. అప్పుడే ప్రియ వస్తుంది. నీ మీద పగ పట్టింది. అంత తేలికగా తీసుకోకు అడుగులు జాగ్రత్తగా వెయ్యి. పుట్టింటి నుంచి దూరం చేసి ఒంటరిని చేయాలని చూస్తుందని ప్రియ హెచ్చరిస్తుంది. మీ అమ్మ కూడా పుట్టింటికి గురించి ఆలోచించొద్దని చెప్పింది కదా ముసలాయన కూడా అంటాడు. ఏ తల్లి కూతుర్ని ఒంటరిగా వదిలేయదని తులసిని వెనకేసుకొస్తుంది. తనకి ఏమైనా తల్లి చూసుకుంటుందని ధైర్యం చెప్తుంది. రాజ్యలక్ష్మికి బంధం విలువ తెలిసేలా చేయమని తన ఆగడాలు ఆపమని సలహా ఇస్తాడు. విక్రమ్ కి వాళ్ళ అమ్మ గురించి తెలిసేలా చేయాలని దివ్య డిసైడ్ అవుతుంది.

Continues below advertisement


Also Read: తను ప్రేమించింది ఎవరినో చెప్పిన ముకుంద- కొడుకు, కోడల్ని ఒక్కటి చేసేందుకు రేవతి హోమం


అనసూయ వాళ్ళు దిగులుగా ఉంటే తులసి వచ్చి ఓదార్పు యాత్ర మొదలుపెడుతుంది. కోర్టు ఆర్డర్ అని లాస్య నెత్తిన ఎక్కి ఆడుతుంది భరించాల్సిందేనా అని పరంధామయ్య బాధపడతాడు. భరించాల్సిందే తప్పదని తులసి చెప్పేస్తుంది. వాడి ఏడుపు చూడటం తప్ప ఏమి చేయలేము ఈ ఇంట్లో సంతోషం కనిపించదని ముసలోళ్ళు ఏడుస్తారు. దివ్య, విక్రమ్ నందుని కలిసేందుకు బయల్దేరదామని అనుకుంటారు. అత్తయ్య పర్మిషన్ తీసుకోలేదని దివ్య అంటే అమ్మ తను చెప్తే కాదని అంటాడు. బసవయ్య వాళ్ళు రాజ్యలక్ష్మిని రెచ్చగొట్టడానికి చూస్తాడు. దివ్య వాళ్ళ నాన్నని చూడటానికి వెళ్తుంది మళ్ళీ సాయంత్రానికి వచ్చేస్తుందని విక్రమ్ చెప్తాడు. ఒక్కదాన్నే ఎలా పంపిస్తావ్ వాళ్ళు ఏమనుకుంటారని ప్రేమ ఒలకబోస్తుంది. ప్రియని పిలిచి దివ్యతో వెళ్ళమని చెప్తుంది. స్వీట్స్, కొత్త బట్టలు ఇచ్చి తీసుకుని వెళ్ళమని అంటుంది. అది చూసి దివ్య అనుమానపడుతుంది. సరిగా బయల్దేరే టైమ్ కి నందు దివ్యకి కాల్ చేస్తాడు.


Also Read: రాహుల్ ప్లాన్ సక్సెస్- పెళ్లి మండపంలో శివతాండవం ఆడుతున్న రుద్రాణి


పుట్టింటికి రావొద్దని చెప్పడానికి కాల్ చేశానని అనేసరికి దివ్య షాక్ అవుతుంది. వస్తున్నావ్ అని తెలిసి కంగారుగా ఫోన్ చేశానని చెప్తాడు. ఆ మాటకి దివ్య చాలా బాధపడుతుంది. ఎందుకు రావొద్దని అంటుంది. కాస్త పని ఉంది బయటకి వెళ్తున్నానని చెప్తాడు. ఎదురుగా ఉన్న అమ్మకి ఇవ్వు మాట్లాడాలి అంటే తులసి పక్కనే ఉన్నా కూడా ఇక్కడ ఎవరూ లేరని ఫ్రీగా ఉన్నప్పుడు కాల్ చేస్తానని నందు అబద్ధం చెప్తాడు. విక్రమ్ వెళ్లిపోగానే రాజ్యలక్ష్మి నవ్వుతుంది. ఇక బసవయ్య వాళ్ళు భజన మొదలుపెడతారు. నాతో చాలా పెద్ద తప్పు చేయించావు తులసి మనసు చంపుకుని నీ మాట విన్నాను. ఇష్టం లేకపోయినా నీ మాట విని బంగారుతల్లిని బాధపెట్టను. ఎందుకు ఇలా చేశావాని నందు కన్నీళ్ళు పెట్టుకుంటాడు. ఒట్టు వేయించుకుని తులసి నందుకి నిజం చెప్తుంది. మన సమస్యకి కారణం రాజ్యలక్ష్మి, మన కష్టాల్లో మనం ఉన్నప్పుడు దివ్య వైపు నుంచి కూడా కష్టాలు క్రియేట్ చేసి ఎటూ ఆలోచించకుండా చేస్తుంది. దివ్యని మనం దూరం చేసుకునేలా చేస్తుంది.