విడాకులు తీసుకోవడానికి సిద్ధంగా ఉండమని నందు లాస్యకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. తండ్రి జైలుకి వెళ్లడంతో దివ్య కుమిలి కుమిలి ఏడుస్తుంది. లాస్య రాజ్యలక్ష్మికి ఫోన్ చేసి ఇక దివ్యకి చుక్కలు చూపించమని ఐడియా ఇస్తుంది. ఒక విధంగా దివ్య ఒంటరిది అయిపోతుందని రాజ్యలక్ష్మి సంబరపడుతుంది. దానికి ఇక టైమ్ ఉండదు పుట్టింటి కష్టాల్లో మునిగిపోతుంది. ఇదే సరైన టైమ్ విక్రమ్ దృష్టిలో దివ్యని చెడ్డ దాన్ని చేస్తాను. దాని జీవితాన్ని తగలబెట్టి పగ తీర్చుకుంటానని రగిలిపోతుంది. తులసి దిగులుగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే లాస్య ఎదురుపడుతుంది. నీతో మాట్లాడాలని లేదని తులసి అంటుంది. భర్త జైలుకి వెళ్తే కాస్త కూడా బాధగా లేదా అని అడుగుతుంది.


లాస్య: ఉంది ఎందుకు లేదు నన్ను మెడ పట్టి గెంటేశాడు


Also Read: ఓపెన్ అయిన రేవతి- ఇంకొక పెళ్లి చేసుకోమని ముకుందకి సలహా ఇచ్చిన మురారీ తల్లి


తులసి: నేను అనేది అది కాదు జైలుకి పంపినందుకు బాధ లేదా? నీలో ఇంత రాక్షసత్వం ఉందని అనుకోలేదు


లాస్య: తప్పు మీరు చేసి నావైపు వేలెత్తి చూపిస్తారే


తులసి: తులసి రంగంలోకి దిగే వరకు నీ ఆట దిగితే మొదలవుతుంది నా వేట. నందగోపాల్ కి శిక్ష పడినంత మాత్రాన అయిపోలేదు కేసు రీ ఓపెన్ చేయిస్తా నీ తప్పులన్నీ బయటకి లాగుతా


లాస్య: ఇప్పటికైనా మించిపోయింది లేదు నందుని నా దారిలోకి రమ్మను జైలు నుంచి విడుదల చేయిస్తా


తులసి: అరిగిపోయిన రికార్డులా ఎన్ని సార్లు ఇదే చెప్తావ్. నీ జీవితంలో నిన్ను సిన్సియర్ గా ప్రేమించింది నందగోపాల్ ఒక్కరే. ఇక ఆయన నీకు దగ్గర అయ్యే ప్రసక్తే లేదు.


దివ్య బాధగా ఇంటికి వస్తుంది. ఏడుపు మొహం చూడాలని రాజ్యలక్ష్మి తెగ ఆరాటపడుతుంది. బసవయ్య దివ్య తండ్రి గురించి నోటికొచ్చినట్టు మాట్లాడతాడు. ఆయన తప్పేమీ లేదని విక్రమ్ వెనకేసుకొస్తే నువ్వు చూశావా ఏంటని రాజ్యలక్ష్మి అంటుంది. దివ్య మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తుంది. ఇప్పుడు ఈ వాదనలు అవసరమా అని బసవయ్య మీద దివ్య సీరియస్ అవుతుంది. చేతనైతే ఓదార్చాలి అంతే కానీ బాధపెట్టేలా మాట్లాడకూడదని విక్రమ్ కోప్పడతాడు. దివ్య అపార్థం చేసుకుని ఉంటుంది వెళ్ళి సర్ది చెప్పమని పంపింస్తుంది.


Also Read: రాహుల్ పని అవుట్, రుద్రాణి నోరు మూయించిన కావ్య- స్వప్నతో పెళ్లి ఫిక్స్


ఇంటి దగ్గర నందు వాళ్ళ కోసం అనసూయ, పరంధామయ్య సంతోషంగా ఎదురు చూస్తూ ఉంటారు. మోహన్, తులసి దిగాలుగా ఇంటికి వస్తారు. మా వాడు ఎక్కడని ఆత్రంగా అడుగుతుంది. నందు ఐదేళ్ల తర్వాత వస్తాడని మోహన్ చెప్పేసరికి ముసలి దంపతులు గుండె పగిలిపోతుంది. ప్రాబ్లం ఉండదని చెప్పావు కదా ఇంతలోనే ఏమైందని కన్నీళ్ళు పెట్టుకుంటారు. దివ్య బాధపడుతుంటే విక్రమ్ వచ్చి సర్ది చెప్పడానికి చూస్తాడు. ఈ ఇంట్లో మీ నాన్నని ఎంత పట్టించుకుంటున్నారో గౌరవిస్తున్నారో చూస్తున్నాను ఇదే విషయం నేను అడిగితే మీరు ఒప్పుకుంటారా? నేనేమీ వాళ్ళని కావాలని ఇందులోకి లాగడం లేదు. మీ వాళ్ళు మా నాన్నని కావాలని హర్ట్ చేస్తూ మాట్లాడారు. కానీ నీ వాళ్ళు అంతగా మాట్లాడుతుంటే నువ్వేమి పట్టించుకోలేదని దివ్య బాధపడుతుంది.